AP Teacher News

AP నూతన సీఎస్ గా డాక్టర్ సమీర్ శర్మ గారు

AP నూతన సీఎస్ గా డాక్టర్ సమీర్ శర్మ గారు. నూతన సీఎస్ గా డాక్టర్ సమీర్ శర్మ గారిని నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. డాక్టర్ శర్మ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆప్కో, ఐటిడిసి ఎండీ గా పనిచేశారు. ఇతను 1985 సంవత్సరం ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ గారు సెప్టెంబర్ 30వ తేదీన పదవి విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి డాక్టర్ సమీర్ శర్మ గారు బాధ్యతలు తీసుకోనున్నారు.

ప్రస్తుతం ఈయన రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఎక్స్లెన్స్ అండ్ గవర్నెన్స్ సంస్థ వైస్ చైర్మన్ సభ్య కార్యదర్శిగా ఉన్నారు. ఈయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గతంలో అనేక కీలక పదవుల్లో పని చేశారు. హైదరాబాద్, విశాఖ మున్సిపల్ కమిషనర్ గాను, విజయవాడ, హైదరాబాద్ స్మార్ట్ సిటీస్ మిషన్ డైరెక్టర్ గాను పని చేశారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ నియమించిన వాళ్ళు కమిటీలకు కూడా చైర్మన్ గా చేశారు. కమ్యూనిటీ ప్లానింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన డాక్టర్ సమీర్ శర్మ గారు అమెరికా నుంచి డాక్టరేట్ తీసుకున్నారు.

డాక్టర్ సమీర్ శర్మ గారు రచించిన పుస్తకాలు

-హవర్ గ్లాస్ మేనేజ్మెంట్ పారాడిగం పాథ్వే టు ఎక్సలెన్స్ లీడర్షిప్(2015)
-స్మార్ట్ సిటీస్ అన్ బండిల్డ్(2018)
-ఏ టెక్స్ట్ బుక్ ఆన్ అర్బన్ ప్లానింగ్ అండ్ జియోగ్రఫీ (2021)