AP Teacher News

Fit India Quiz: 8,9,10,11,12 విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు

Fit India Quiz: 8,9,10,11,12 విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు

ఫిట్ ఇండియా క్విజ్: Fit India Quiz: 8,9,10,11,12 విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు.

ప్రతి ఉన్నత పాఠశాల నుండి 8,9,10,11,12 తరగతుల విద్యార్థులు అర్హులు.

పాఠ శాల స్థాయి లో క్విజ్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేయాలి.
ఎంపిక కాబడిన విద్యార్థులలో కనీసం ఇద్దరిని రిజిస్టర్ చేయించాలి.గరిష్టంగా ఎంత మందినైన చేయించవచ్చు. ప్రతి పాఠశాల కు మొదటి ఇద్దరికీ రిజిస్ట్రేషన్ ఉచితం. తరువాత అదనంగా రిజిస్టర్ అయ్యే ప్రతి విద్యార్థికి ₹50/- రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాలి.

రిజిస్టర్ చేయించాల్సిన website link :

https://fitindia.gov.in/fit-india-quiz

రిజిస్ట్రేష న్స్ కు సెప్టెంబర్ 30 చివరి తేదీ.

మొదటి రౌండ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) నిర్వహించే ప్రిలిమినరీ రౌండ్.

ఈ రౌండ్ లో విద్యార్థులు individual వ్యక్తిగతంగా పాల్గొనాలి.ఇందులో 45 నిమిషాలలో 75 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.

ఇందులో గెలుపొందిన వారు స్టేట్ లెవెల్ క్విజ్ కు అర్హులు. స్టేట్ లెవెల్ కు ఎంపికైతే ఒక్కో విద్యార్థికి 2000 రూపాయలు క్యాష్ ప్రైజ్. సంబంధిత పాఠ శాల కు 15000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వబడును.

స్టేట్ లెవెల్ పోటీకి ఒక్కో team లో ఇద్దరు విద్యార్థులు ఉంటారు. ఒక పాఠశాల నుండి ఒకరే స్టేట్ లెవెల్ కు ఎంపికైతె అదే పాఠ శాల నుండి మరొకరిని అతనికి జతగా ప్రతిపాదించ వచ్చు.


స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్:
పాఠ శాల కు 250000/-
విద్యార్థులకు 25000/-

స్టేట్ 1 st runner-up:
పాఠ శాల కు 100000/-
విద్యార్థులకు 10000/-

స్టేట్ 2 nd runner-up:
పాఠ శాల కు 50000/-
విద్యార్థులకు 5000/-

నేషనల్ రౌండ్ విన్నర్ :
స్కూల్ కు 2500000/-
విద్యార్థులకు 250000/-

1 st runner-up కు:
స్కూల్ కు 1000000/-
విద్యార్థులకు 100000/-

2 nd runner-up:
School కు 500000/-
విద్యార్థులకు 50000/-

టాపిక్స్ ఫర్ క్విజ్:

హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్, ట్రెడిషనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, యోగ, పర్సనాలిటీస్, మొదలగునవి.

ఫిట్నెస్ టాపిక్స్ విత్ స్పెషల్ ఎంఫేసిస్ ఆన్ ఇండియన్ ట్రెడిషనల్ ఫిట్నెస్ మెథడ్స్.

ఒలంపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏసియన్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్ అండ్ అదర్ పాపులర్.

-పోటీ 13 భాషలలో ఉంటుంది. కావున “తెలుగు” లో కూడా పాల్గొనవచ్చు.
-ప్రైజ్ మనీ ను కేవలం స్పోర్ట్స్ కొరకు మాత్రమే ఉపయోగించాలి.