RGUKT ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలో నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 4,400 సీట్లను నవంబరు లో కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నామని RGUKT కులపతి కె. సి. రెడ్డి గారు తెలిపారు. శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటి ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ లో సీట్లు భర్తీకి ఈ ఏడాది ఇప్పటికే ప్రత్యేకంగా సెట్ నిర్వహించి ఫలితాలు విడుదల చేశామన్నారు. అక్టోబర్ 21 తేదీన వర్సిటీ స్థాయిలో ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించి షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. శ్రీకాకుళం, ఒంగోలులో, ఇడుపులపాయ,నూజివీడులో ఒక్కోదానిలో 1100 సీట్లను నవంబర్ లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ లో బోధనా సిబ్బంది నియామకానికి త్వరలో ప్రకటన వెల్లడిస్తామన్నారు. ట్రిపుల్ ఐటి సంచాలకులు జగదీశ్వరరావు, ఏవో మోహన్ కృష్ణ చౌదరి, ఓఎస్ డీ ఎల్ డీ సుధాకర్ బాబు, డీన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.