AP Teacher News

TS విద్యావాలంటీర్ల నియామకం

TS విద్యావాలంటీర్ల నియామకం

ఉపాధ్యాయుల సర్దుబాటు తర్వాతే విద్యావాలంటీర్లు నియామకం పై నిర్ణయం తీసుకుంటాం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలో గల పాఠశాలల నిర్వహణకు గ్రాంట్లు రూపంలో ఇప్పటికే నిధులు విడుదల చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు. మూడేళ్లుగా రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు2017-2018 లో రూ 38 కోట్లు ,2019-2020లో 46కోట్లు, 2020-2021లో 80 కోట్లు, 2021- 2022 ఏడాదికి 80 కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు. పాఠశాల మైదానం విశాలంగా ఉంటే పిల్లలకు ఇబ్బంది లేకుండా పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయవచ్చని కలెక్టర్లకు తామే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని పాఠశాలలో తక్కువ విద్యార్థులు ఎక్కువ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తక్కువ ఉండే విద్యార్థులు ఎక్కువ ఉన్న పరిస్థితులు ఉన్నాయని ముందు ఆ పోస్టులను సర్దుబాటు చేసి తర్వాత విద్యావాలంటీర్లు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు .

గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పాఠశాలలు అంగన్వాడీలు పి.హెచ్.సి కేంద్రాల నిర్వహణలో ఆ పంచాయతీలో చూసుకోవాలని గతంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కార్పొరేషన్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటిని పట్టణ స్థానిక సంస్థలు చూసుకోవాలన్నారు. చాలా గ్రామాల్లో సర్పంచులు శ్రద్ధ తీసుకుని పాఠశాలల నిర్వహణ చూసుకుంటున్నారని తెలిపారు. సర్పంచులకు ఆ బాధ్యతలను అప్పగిస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మార్గనిర్దేశం కూడా చేశారని వివరించారు.

ఏ సర్పంచ్ అయినా పాఠశాలల నిర్వహణ బాధ్యత తీసుకోకపోతే అక్కడే హెడ్మాస్టర్ ఫిర్యాదు చేసి తమ దృష్టికి తీసుకు వస్తే మేముఏ సర్పంచ్ అయినా పాఠశాలల నిర్వహణ బాధ్యత తీసుకోకపోతే అక్కడే హెడ్మాస్టర్ ఫిర్యాదు చేసి తమ దృష్టికి తీసుకు వస్తే మేము చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాల విద్యార్థులతో పారిశుద్ధ్య పనులు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కొన్ని పాఠశాలల్లో మైదాన ప్రాంత 10 నుండి 20 ఎకరాల్లో ఉందని మైదానం ఎక్కువగా ఉండడంతో అక్కడ ప్రకృతి వర్ణాలు ఏర్పాటుకు కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఆ పార్కులో వల్ల పిల్లలకు కూడా ఆరోగ్యకర వాతావరణం అందుతుందన్నారు.