Geetu Royal: త్వరలో రాజకీయాల్లోకి చిత్తూరు చిరుత గీతు రాయల్
టెలివిజన్లో ఎక్కువ రేటింగ్స్ సొంతం చేసుకున్న రియాల్టీ షోలలో బిగ్ బాస్ షో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఈ షో కి ఆరు సీజన్స్ ఇటీవల పూర్తి చేసుకుంది. మరి ఈ షో కి నాగార్జున గారు హోస్ట్ గా వ్యవహరించారు. మరి సీజన్ 6 కంటెస్టెంట్స్ విషయానికి వస్తే కంటెస్టెంట్స్ అందరిలో గీతు రాయల్ కూడా ఒకరు.
బిగ్బాస్ సీజన్ 6 లో గీతు రాయల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. చిత్తూరు యాసలో మాట్లాడుతూ అందరినీ బాగానే ఎంటర్టైన్ చేసింది. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బిగ్ బాస్ కి సంబంధించిన రివ్యూస్ ని ఇస్తూ సోషల్ మీడియాలో బాగానే ఫేమస్ అయింది గీతు రాయల్
. ఈ కారణంగానే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ని కూడా కొట్టేసింది. రీసెంట్గా బిగ్బాస్ సీజన్ సిక్స్ షో నుంచి అనూహ్య కారణాలవల్ల ఎలిమినేట్ అయింది. చిత్తూరు చిరుత గా పేరు సంపాదించుకుంది. మనసులో ఏది దాచుకోని కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకుంది.
రీసెంట్ గా గీతు రాయల్ తాను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను అంటూ రాజకీయాల్లోకి రావడం అంటే తనకి ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. చిత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నా గీతు రాయల్ మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.
“గ్రేట్ ఆంధ్ర ప్రతినిధి”తో ఆమె మాట్లాడుతూ ఈ విషయం తెలియజేసింది. ప్రజల కోరికలను నెరవేర్చడానికి అనువుగా ఉండే ఒక పార్టీలో చేరడానికి వెతుకుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.తాను బిగ్ బాస్ హౌస్ నుంచి రీసెంట్ గానే బయటికి ఎలిమినేట్ ద్వారా వచ్చాను అంటూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల గురించి తెలుసుకోవాలి అంటూ క్షుణ్ణంగా పరిశీలించాలి అంటూ చెప్పుకొచ్చింది.
ఎన్నికల బరిలో పోటీ చేయాలని అనుకుంటున్నారా అని గ్రేట్ ఆంధ్ర ప్రతినిధి గీతు రాయల్ ని ప్రశ్నించినప్పుడు తనది చిన్న వయసు అంటూ, పదవుల పై ఎలాంటి కోరిక లేదని చెప్పుకుంటూ, తాను ఒక రూలర్ కావాలని తనకు ఆకాంక్ష ఉందని ఈ విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లో కూడా చాలా సార్లు చెప్పిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ విషయం గురించి చెప్పింది గీతు రాయల్.