Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Deepavali 2022: దీపావళి పండుగ లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే !

Deepavali 2022: ప్రపంచంలో హిందువులు అనేక పండుగలను ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. వాటిలో ఎక్కువగా దసరా, దీపావళి ,సంక్రాంతి పండుగలు వస్తే వేరుగా ఉంటుంది. అలాంటప్పుడు దీపావళి పండుగ దగ్గర పడుతుంది. దీపావళి అంటే ఏమిటో ?పండగ విశిష్టత ఏంటని, దానిగురించి అనేక విషయాలను తెలుసుకుంటాం.

దీపావళి పండుగ లో అలంకరించుకోవడం, బంధువులతో, స్నేహితులతో ఆనందంగా గడపడం, ఇల్లంతా దీపాలతో అలంకరించుకోవడం. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందంగా రెడీ అవుతాం. అలాగే సిరిసంపదలకు, కుటుంబ శ్రేయస్సుకు, కుటుంబంలోని వారి ఆరోగ్యానికి కోసం అన్నిటికి లక్ష్మీ అమ్మవారికి పూజలు చేస్తారు.

Deepavali 2022 Wishes:

Deepavali
Deepavali

దీపాలి పండగ ఎప్పుడో ఈరోజు చేయాలో తెలుసుకుందాం:

ఈ సంవత్సరం కూడా దీపావళి పండుగ జరుపుకోవడానికి ముందు నుంచి అన్ని సిద్ధం చేసుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం దీపావళి పండగ 25వ తేదీన కాకుండా, 24వ తేదీన చేసుకోవాలని పండితులు, పూజారులు చెబుతున్నారు. ఎందువలన అంటే? అక్టోబర్ 25వ తేదీన మధ్యాహ్నం 2: 25 నిమిషాల నుండి సాయంత్రం 6:30 వరకు సూర్యగ్రహణం ఉంది. అందువలన సూర్యగ్రహణం కారణంగా 25వ తేదీన చేసుకోకుండా 24వ తేదీన జరుపుకోబోతున్నాం.

ప్రతిసారి లక్ష్మీ పూజ చేసుకుంటాం. కదా ఈసారి గ్రహణం కారణం గా లక్ష్మీ పూజ ఎప్పుడు? జరుపుకోవాలని కొందరు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అందువలన లక్ష్మిపూజ సమయం ఎప్పుడు ?అలాగే సూర్యగ్రహణం రోజు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? దీపావళి పండుగ రోజు లక్ష్మీ కటాక్షం కోసం పాటించవలసినవి, ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Laksmi Devi ammavaru
Sri Laksmi Devi ammavaru

Deepavali 2022 లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకునే సమయం:

ఈ సంవత్సరం సూర్య గ్రహణం వలన దీపావళి పండుగను 24వ తేదీన జరుపుకోవాలని, 25వ తేదీన జరుపుకోవాలా? అనే అనుమానంతో ఉంటున్నారు. ఇలాంటి అనుమానం ఉన్నవారు లక్ష్మీదేవి పూజ 24వ తేదీన జరుపుకోవడం చాలా మంచిదని, జాతకాలను తెలిపే మహా పండితులు చెబుతున్నారు.

లక్ష్మీదేవి పూజ చేయటానికి కూడా సమయం ఎప్పుడు బాగుంటుందో? కూడా వారే నిర్ణయిస్తున్నారు. దీపావళి పండుగను అక్టోబర్ 24వ తేదీన జరుపుకోవాలని చెప్పారు. కాబట్టి ఆ రోజు సాయంత్రం 5:30 నుండి లక్ష్మీదేవి పూజలు ప్రారంభం చేసుకుని సాయంత్రం 6:51 నిమిషాలకు ముగించవచ్చు అని చెప్పారు.

Surya grahanam
Surya grahanam

25 అమావాస్య అలాగే సూర్యగ్రహణం ఉన్నందున ఆచరించవలసిన పద్ధతులు:

ఎప్పుడైనా దీపావళి అమావాస్య రోజునే వస్తుంది. అదేవిధంగా ఈసారి అమావాస్య 25వ తేదీన ఉంది. కానీ ఆ రోజు సూర్యగ్రహణం కారణంగా మనం పండుగను ఒకరోజు ముందు అక్టోబర్ 24వ తేదీన జరుపుకుంటున్నాం. అయినప్పటికీ అమావాస్య గ్రహణం రెండూ ఒకే రోజు వచ్చాయి. అందువలన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదని పండితారాధ్యులు చెబుతున్నారు.

గ్రహణం ప్రారంభమైన తర్వాత ఎవరు భుజించకూడదని, మొదలవ్వకముందే భోజనాన్ని చేయడం చాలా మంచిదని అంటున్నారు. అలాగే ఇంట్లో మనం ప్రతిరోజు అవసరాలకు వాడుకునే నిత్యవసరాలు వస్తువుల పైన దర్బను తెచ్చి ఉంచాలని చెబుతున్నారు. అదేవిధంగా జపం చేసే వారు గ్రహణం మొదలయ్యేటప్పుడు పట్టు స్నానం చేయాలి, అలాగే గ్రహణం వీడిన తర్వాత విడుపు స్నానం ఆచరించాలని, గ్రహణం వీడిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.

ఇప్పుడు దర్భణం, పట్టు స్నానం, విడుపు స్నానం అంటే ఏంటో తెలుసుకుందాం:

దర్భణం:

దర్భ అంటే గడ్డి జాజికి చెందిన మొక్క. దర్భ మొక్కలు ఎంతో శక్తివంతమైనవి. వీటిని అనేక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ,పూజలకు, మంత్ర తంత్రాలకు, జాతకంలో దోషాలు తొలగిపోవడానికి ఇలా అనేక రకాలుగా ఉపయోగిస్తారు. భూమిపై ఉండే అన్ని చెట్లలో దర్భ చాలా విశిష్టత కూడుకున్నది. గ్రహణం అంటే మొదటగా గుర్తుకు వచ్చేది దర్భ మాత్రమే. గ్రహణం ఉన్న రోజు మనం తినే ఆహార పదార్థాల పైన దర్భను తెచ్చి పెడతారు.

ఎందుకంటే సూర్యగ్రహణం, కానీ చంద్రగ్రహణం కానీ ఉన్నప్పుడు గ్రహణం నుండి వచ్చే కిరణాలు విషపూరితమైనవి. వాటి వలన అనేక రకమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విషపూరితమైన కిరణాల నుండి కాపాడే శక్తి దర్భలకు మాత్రమే ఉందని, అందువలన వీటిని తలపై అలాగే, ఇంట్లో ఉన్న నిత్యవసర వస్తువుల పైన పెడతారు. పూర్వకాలంలో వీటిని ఇంటి పైకప్పుగా కప్పుకునేవారు. ఇప్పుడు దర్భలు అరుదుగా దొరుకుతున్నాయి. అందువలన

వీటిని మనకు అవసరమైన వాటిపైనే ఉంచుకుంటున్నాము. ఈ విషయం గురించి పరిశోధనలో కూడా నిరూపించబడింది.

పట్టు స్నానం, విడుపు స్నానం:

పట్టు స్నానం అంటే గ్రహణం ప్రారంభమవుతున్నప్పుడు చేసే స్నానం. పట్టు స్నానం చేసేటప్పుడు తలకు పోసుకోవాలి. అప్పుడు తలకు ఎటువంటి షాంపూలు, సబ్బులు రుద్దుకోకుండా నీటితోనే స్నానం చేయాలి. ఈ విధంగా స్నానం చేయటాన్ని పట్టు స్నానం అంటారు. ఆ తర్వాత ఉతికిన బట్టలు ధరించి జపాలు చేసుకోవచ్చు. గ్రహణం పూర్తయిన తర్వాత కూడా విడుపు స్నానం చేయాలి.

ఇంటిని శుభ్రం చేసుకోవడం:

గ్రహణం ప్రారంభం అయినప్పుడు సూర్యుని నుండి వచ్చే విషపూరితమైన కిరణాల వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. అందువలన ఇంటిని శుభ్రం చేసుకోవడం ద్వారా నెగటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ కారణం ద్వారా గ్రహణం సమయం అయిపోగానే ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.

గ్రహణం తర్వాత జాగ్రత్తపడవలసిన రాశులు:

Horoscope
Horoscope

గ్రహణం జరగడం వలన రాశులలో మార్పులు జరుగుతాయి. ఫలితంగా దోషాలు కూడా ఉంటాయి. అందువలన కొన్ని రాశుల వారికి ఉపయోగకరంగాను, కొన్ని రాశుల వారికి కష్టతరంగాను ఉంటాయి. స్వాతి నక్షత్రం, తులారాశి వారు ఎటువంటి పరిస్థితులలో గ్రహణాన్ని చూడకూడదు.

గ్రహణం వలన కొన్ని దోషాలు కూడా ఉంటాయి. అలాంటి దోషాలను నివారించుకోవటానికి మరుసటి రోజు శివుని దర్శిస్తే మంచిది. తులా రాశి, కర్కాటక రాశి, మీన రాశి వృశ్చిక రాశి ఉన్నవాళ్లు సూర్యగ్రహణం తర్వాత కచ్చితంగా పరిహారం చేసుకోవాలని తెలియజేస్తున్నారు.

దీపావళి పండుగ రోజు పాటించవలసినవి:

బ్రహ్మ స్థలం:

దీపావళి పండుగ రోజున బ్రహ్మ స్థలాన్ని అందరూ శుభ్రం చేసుకోవాలి. బ్రహ్మ స్థలం అంటే ఇంటికి మధ్యలో ఉండే ప్రదేశం. ఇంటి మధ్య ఉన్న స్థలాన్ని స్థానాన్ని సూర్య స్థానం అంటారు. ఇంటి మధ్య అంటే ఇంటి లోపల ఉండే హాల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంటిలో హాల్ మధ్యలో ఉంటుంది.

హాల్ ను బ్రహ్మ స్థలంగా చెప్పవచ్చు. అందువలన దీపావళి రోజు హాల్ను శుభ్రం చేసుకోవాలి. అందులో పనికిరాని గడియారాలు, విరిగిపోయిన కుర్చీలు, సోఫాలు ఉండకూడదు. బ్రహ్మ స్థలం నీటుగా లేకపోతే లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం వచ్చి, ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది. దీనివల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దీపావళి పండుగ రోజు వేసుకోకూడని బట్టలు:

దీపావళి పండుగ రోజు అందరూ రకరకాల బట్టలతో అందంగా రెడీ అవుతారు. అయితే బట్టల విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. పండుగ రోజున జరుపుకునేందుకు వేసుకునే బట్టలలో నలుపు రంగు కలసకుండా ఉన్న బట్టలు వేసుకోవాలి.

నలుపు రంగు అశుభానికి సూచికంగా చెబుతారు. అందువలనే ఒడిబియ్యం పోసేవారు, శుభకార్యాలు చేసేవారు నలుపు రంగు ఉన్న దుస్తులను తీసుకోరు. అందువలన దీపావళి రోజున నలుపు రంగు ఉన్న దుస్తులను వేసుకోకుండా ఉంటే మంచిది.

Muggulu for Deepavali
Muggulu for Deepavali

ముగ్గులు:

దీపావళి రోజు వేసుకునే ముగ్గులలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఈ పండుగ రోజు ముగ్గులు వేయడం ఆనవాయితీ. ముగ్గులు వేసేటప్పుడు ముగ్గులు పొడికి బదులు, బియ్యం పిండితో ముగ్గులు వేయాలని, అదేవిధంగా ముగ్గులను అలంకరించే రంగులలో నలుపు రంగు ఉండకూడదు అని తెలియజేస్తున్నారు.

బహుమతులు:

దీపావళి పండుగలో బహుమానాలను ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. అందువలన ఈ పండుగలో బహుమతులను లేదర్ తో తయారు చేసిన వాటిని ఇవ్వకూడదు.

ఒకవేళ అలాంటి వాటిని ఇవ్వడం ద్వారా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, డబ్బు నష్టం కూడా జరుగుతుందని, అందువలన కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే చేయవలసిన పని:

పండగ రోజు మనం లక్ష్మీదేవిని ఏకాగ్రతతో పూజించాలి. అదేవిధంగా పండుగ రోజున ఇతరులతో గొలువలకువెళ్లకూడదు. ఎవరిని తిట్టుకోకూడదు, కోపంగా వ్యవహరించకూడదు. ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అమ్మవారి కటాక్షం మీ పైన, మీ కుటుంబ సభ్యుల పైన ఉండదని చెబుతున్నారు.

ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు, అని సకల సిరిసంపదలతో ఉండవచ్చు అని చెబుతున్నారు.

దీపావళి పండుగను ఎప్పుడు చేసుకోవాలి? లక్ష్మీ పూజ ఏ రోజు ,ఏ టైం లో చేసుకోవాలి? అలాగే గ్రహణం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు? అదేవిధంగా దీపావళి పండుగలో పాటించవలసిన నియమాల గురించి, పరిహారం చేసుకోవలసిన రాశుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పండగ రోజున వీటిని చూడడం ద్వారా లక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షం పొందవచ్చు తెలుసుకుందాం.

లక్ష్మీ అమ్మవారి కటాక్షం పొందాలంటే చేయవలసిన పని:

Cows
Cows

ఆవులు:

హిందువులకు ఆవు అంటే ఎంతో ప్రీతికరమైనది. ఆవును గోమాతగా భావించి పూజలు చేస్తారు. దీపావళి రోజున ఆవును చూస్తే మంచి జరుగుతుందని, ముదురు గోధుమ రంగు ఉన్న ఆవులను చూస్తే డబ్బుకు కొరత ఉండదని మీయొక్క వైభవమే మారిపోతుందని పండితులు చెబుతున్నారు.

Cat
Cat

పిల్లి:

పిల్లి అనగానే ఆశుభానికి సూచిక అని అంటారు. అయితే దీపావళి పండుగ రోజు మాత్రం పిల్లి కనబడితే శుభానికి గుర్తుగా చెబుతారు. దీపావళి పండుగ రోజు పిల్లిని దర్శించుకుంటే మంచికి గుర్తు అని ,వారికి అమ్మవారి అనుగ్రహం మెండుగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు.

Lizard
Lizard

బల్లి:

పండుగ రోజు బల్లి ని చూడడం కూడా మంచిదని అంటున్నారు. బల్లిని చూడడం అంటే అమ్మవారి ఆనందానికి సూచనగా చెబుతారని, దీనివల్ల అంతా మంచిగా ఉంటుందని, చెబుతూ ఇంట్లో బల్లులు పండుగ రోజు ఉంటే లక్ష్మీ అమ్మవారు ఆ ఇంటిలోకి వస్తున్నారని అర్థం చేసుకోవాలంటున్నారు పండితులు.

Owl
Owl

గుడ్లగూబ:

గుడ్లగూబ పండుగ రోజు కనిపిస్తే చాలా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. అని అంటున్నారు. మామూలు రోజులలో గుడ్లగూబ ఇంటిని చూసిన, ఇంటిలోకి వచ్చిన అశుభం జరుగుతుందని అంటారు. అయితే దీపావళి పండుగ రోజు మాత్రం చాలా మంచి జరుగుతుందని, అమ్మవారి వాహనం కావడం వల్ల దీపావళి రోజున మాత్రమే గుడ్లగూబ కనిపిస్తే ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారని పేర్కొంటున్నారు. పండుగనాడు గుడ్లగూబను చూస్తే వారికి పట్టే అదృష్టం అంతా ఇంతా కాదని, వారి జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker