ఎంజేపీ విదేశీ విద్య నిధి స్కాలర్ షిప్
తెలంగాణ ప్రభుత్వం మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి ప్రోగ్రాం ద్వారా ఉన్నత విద్య అభ్యసించాలని బీసీ,ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
•మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి ఉపకారవేతన పథకం
స్కాలర్ షిప్ మొత్తం: రూ.20 లక్షల వరకు/అడ్మిషన్ లెటర్ ప్రకారం చెల్లిస్తారు. అలాగే వన్ వే ఎకానమిక్ టికెట్, వీసా ఛార్జీలు కూడా చెల్లిస్తారు.
అర్హత: 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, అగ్రికల్చర్, వైద్య, నర్సింగ్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణత, జీఅర్ఈ/జీమ్యాట్ స్కోర్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, టెస్ట్ తో పాటు కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించకుండా ఉండాలి.సీఓఈ,ఐ 20 వీసా ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 35 ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021,నవంబరు 01
దరఖాస్తు చివరితేదీ: 2021 నవంబర్ 30
వెబ్ సైట్: http://telanganaepass.cgg.gov.in