Site icon Education Telugu Thefinexpress

గుడ్ న్యూస్ తెలిపిన ప్రభుత్వం… ఎట్టకేలకు పోస్ట్లు మంజూరు



తెలంగాణ: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 339 విద్యావలంటీర్లను ప్రభుత్వం తిరిగి తీసుకుంది.

2021- 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెన్యువల్ చేసుకోవాలని ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సరిపడా ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయానీ, మైదాన ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పని చేసేందుకు వీరిని తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరంతా సంబంధిత జిల్లా కలెక్టర్లకు రెన్యువల్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా పాఠశాలల్లో విద్యార్థుల అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉన్న రెగ్యులర్ టీచర్లు, ఉన్న ఖాళీల ఆధారంగా విద్యా వాలంటీర్లను తీసుకున్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అవసరానికి మించిన టీచర్ల సంఖ్య ఉందని 15 వేల మంది విద్యా వాలంటీర్లను విధులకు దూరం చేసిన విషయం విదితమే. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 339 మంది విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.