Amaravati: ఉన్నత విద్యా ప్రణాళిక మండలి రెండో సమావేశం శనివారం విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. దీనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఐఐఎం, పెట్రోలియం ఇంజనీరింగ్ విద్యాసంస్థలు ఆతిథ్యమిస్తున్నాయి. ఉన్నత విద్యా విస్తరణ, నాణ్యత, సమానత్వం అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నారు. ఐఐటి, ఢిల్లీ డైరెక్టర్ రామ్ గోపాల్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు.