డిగ్రీలు తెలుగు మాధ్యమం కనుమరు..
అన్ని డిగ్రీ కళాశాలలో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు.
అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలోఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని అన్ని కళాశాలల్లో అమలు చేయాలని నిర్ణయించారు.ఇప్పటివరకు తెలుగు, ఆంగ్లం మాధ్యమాలు అందుబాటులో ఉండగా ఈ ఉత్తర్వుల్లో ఆంగ్ల మాధ్యమం కనుమరుగయింది. విద్యార్థులందరూ ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలు పొందవలసి ఉంది. గత ఏడాది డిగ్రీ మొదటి సంవత్సరంలో 2,62,805 మంది ప్రవేశాలు పొందగా వీరిలో 65,701(25%) మంది తెలుగు మాధ్యమంలో చేరారు. తెలుగు మాధ్యమంలో చేరిన వారిలో ఎక్కువ మంది గ్రామీణ నేపథ్యంలో ఉండేవారే. తెలుగు ప్రవేశాలు పొందిన వారిలో ఎస్సీలు 24%, ఎస్టీలు 10%, ఓసీలు 11%, బీసీలు 55%, ఉన్నారు. ఆంగ్ల మాధ్యమం నిర్ణయంతో వీరందరూ తమ అవకాశాన్ని కోల్పోనున్నారు.