మనబడి నాడు నేడు కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
మనబడి నాడు–నేడు పనులపై సమీక్ష
అనంతపురం :
అనంతపురం మునిసిపల్ కార్యాలయంలో మనబడి నాడు–నేడు పనులపై మేయర్ వసీం,కమిషనర్ మూర్తి లతో కలిసి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా చేపట్టే పనులు నాణ్యతగా ఉండాలని అధికారులు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారేలా చూడాలన్నారు.ఇప్పటికే నాడు నేడు మొదటి విడత ద్వారా 18 బడులను కార్పొరేట్ బడులను ధీటుగా తయ్యారు చేసారని మిగిలిన వాటిని రెండు,మూడో విడతల్లో పొందుపరుస్తారని స్పష్టం చేశారు.
ఎక్కడా నిధుల సమస్య లేదని, ఇతర నియోజకవర్గాల కంటే జిల్లా కేంద్రమైన అనంతపురంలో మెరుగ్గా ప్రభుత్వ బడులు తయారవ్వాలని సూచించారు.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య , కోగటం విజయభాస్కర రెడ్డి, కార్యదర్శి సంఘం శ్రీనివాసులు, EE లు నాగ మోహన్, రామ్మోహన్,ప్రిన్సిపాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.