హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి: హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖల ఆధ్వర్యంలో తిరుపతిలో స్థాపించిన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ ఆఫ్ హోటల్ అప్లైడ్ న్యూట్రిషన్ (NIHM) కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశానికి కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వి. గిరిబాబు తెలిపారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఏపీ పర్యాటక శాఖ లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
కోర్సుల వివరాలు: సర్టిఫికెట్ కోర్స్ అండ్ ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీస్, బి ఎస్ సీ(హెచ్ అండ్ హెచ్)
ఎఫ్ బి ప్రొడక్షన్స్, ఎఫ్ బి సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్ అండ్ హౌస్ కీపింగ్ కోర్సులున్నాయి.
వయస్సు: పదవతరగతి ఉత్తీర్ణులైన 25 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులు.
సడలింపు: ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల సడలింపు. యువతీ యువకులకు వేరుగా హాస్టల్ సదుపాయం కలదు.
వెబ్ సైట్:www.sihmtpt.org. వెబ్ సైట్ లో సంప్రదించాలని సూచించారు.