ఏపీ లో డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ ఇలా
ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ కళాశాల ప్రవేశానికి అడ్మిషన్ల ప్రక్రియ ఇవాళ నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ విధానం ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
కరోనా సంక్షోభం కారణంగా విద్యాసంస్థల అడ్మిషన్ల పై తీవ్ర ప్రభావం పడుతుంది. జూన్ లో ప్రారంభం కావాల్సిన అడ్మిషన్ల ప్రక్రియ మూడు నెలలు ఆలస్యంగా September లో ప్రారంభం అవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ విధానం ద్వారా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రారంభం కానున్న అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్ షెడ్యూలు విడుదల చేశారు. మరోవైపు ఈనెల 17,18 తేదీల్లో ఏపీ ఐసెట్ నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయిలో,MBA,MCA కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏపీఐసెట్ 2021 పరీక్షలు 17 ,18 తేదీలు జరగనున్నాయని కన్వీనర్ ఆచార్య శశిభూషణ్ రావు తెలిపారు. రాష్ట్రంలోనూ అటు హైదరాబాద్ లోను పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థుల ను లోపలకి అనుమతించేది AAలేదని అంటున్నారు.
రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లు షెడ్యూల్
నోటిఫికేషన్ సెప్టెంబర్ 16వ తేదీ విద్యార్థులు రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 17 నుంచి 22వ తేదీ వరకు.
వెబ్ ఆప్షన్ల నమోదు 23-26 వరకు వెరిఫికేషన్ 23-24 తేదీ లో సీట్ల కేటాయింపు 29వ తేదీ కళాశాలలో రిపోర్టింగ్ సెప్టెంబర్ 30, అక్టోబరు 1న తరగతులు ప్రారంభం.
apply here: https://oamdc.ap.gov.in/