AP D.El.Ed (2020-22): సెకండ్ సెమిస్టర్ పరీక్షలు-2022 హాల్ టికెట్స్ విడుదల చేశారు. AP D.El.Ed 2020-22 విద్యా సంవత్సరం వారికి రెండో సెమిస్టర్ పరీక్షలను జూన్ లో నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకడు దేవానంద్ రెడ్డి అన్నారు.
పరీక్ష ఫీజును మే 24వ తేదీలోపు చెల్లించాలని, అపరాధ రుసుము 50/- రూపాయల తో మే 26వ తేదీలోపు చెల్లించాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌లను అప్‌లోడ్ చేయడానికి వెబ్ లింక్ 18-5-2022 నుండి అందుబాటులో ఉంటుంది. సాధారణ అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ.150/-.
కళాశాల ప్రిన్సిపాల్స్ వెబ్ అప్లికేషన్ ఫారమ్ నింపే ప్రక్రియలో కనిపించే పేమెంట్ గేట్‌వే ద్వారా రెగ్యులర్ మరియు ప్రైవేట్ అభ్యర్థులకు వేర్వేరుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
D.El.Ed సెమిస్టర్ రెండవ పరీక్షలు ఆగస్టు 22 (2020-22 బ్యాచ్) 24/8/2022 నుండి 27-08-2022 వరకు ఉదయం 9:00 నుండి 11:30 వరకు నోటిఫైడ్ పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడతాయి. అభ్యర్థుల హాల్ టిక్కెట్లు ఈ వెబ్‌సైట్ www.bse.ap.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను 17-08-2022 నుండి పై వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వెబ్‌సైట్‌కి లాగిన్ అయి వరుసగా జిల్లాలు, ఇన్‌స్టిట్యూట్ పేరు మరియు అభ్యర్థి పేరును ఎంపిక చేసుకుని హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.