Site icon Education Telugu Thefinexpress

AP EAPCET Certificate Verification 2022 లిస్ట్

AP EAPCET Certificate Verification: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలలో అర్హత సాధించిన విద్యార్థులకు త్వరలో ఇంజనీరింగ్ మరియు వ్యవసాయ రంగ కోర్సులలో ప్రవేశం కొరకు ప్రభుత్వం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కౌన్సిలింగ్కు అవసరమైన సర్టిఫికెట్లు మరియు సంబంధిత పత్రాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

AP EAPCET- సెట్టుకు కావలసిన సర్టిఫికెట్స్:

AP EAPCET- Rank card ఇటీవల ప్రకటించిన ఫలితాలలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా వచ్చిన రాంక్ కార్డును జతపరచాలి.

HALL TICKET-ప్రవేశ పరీక్ష కోసం ప్రభుత్వం జారీ చేసిన హాల్ టికెట్ను పొందుపరచాలి.

INTERMEDIATE T.C-ఇంటర్ కాలేజీ నుండి జారీ చేయబడిన బదిలీ ధ్రువ పత్రం జతపరచాలి.

INTER MARKS LIST-ఇంటర్ లేదా దానికి సమానమైన కోర్స్ లలో సాధించిన మార్కుల జాబితాను జత పరచాలి.

AP EAPCET సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చెక్ లిస్ట్

S.S.C MARKS LIST-పదవ తరగతి లేదా దానికి సమానమైన కోర్స్ లలో సాధించిన మార్కుల జాబితాను పొందుపరచాలి.

STUDY CERTIFICATES-ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యాసంస్థల నుండి స్టడీ సర్టిఫికెట్లు పొంది వాటిని జతపరచవలసి ఉంటుంది.

EWS CERTIFICATE-OC అభ్యర్థులలో అర్హత గలవారు EWS రిజర్వేషన్ కొరకు ఈ సర్టిఫికెట్ను పొందుపరచవలసి ఉంటుంది. దీనిని మీసేవ నుండి పొందవచ్చు. ఈ సంవత్సరమునకు చెల్లుబాటు అయ్యే విధంగా ఉన్న సర్టిఫికెట్లు మాత్రమే జతపరచాలి.

ఇంటర్మీడియట్ ప్రైవేట్ గా రాసిన అభ్యర్థులు ప్రవేశపరీక్షకు ఏడు సంవత్సరంల ముందు స్థానికత గల సర్టిఫికెట్ను జతపరచవలసి ఉంటుంది.

CASTE CERTIFICATE- SC/ST/BC మీసేవ ద్వారా పొందినటువంటి కుల ద్రవీకరణ పత్రమును రిజర్వేషన్ కొరకు జతపరచవలసి ఉంటుంది.

INCOME CERTIFICATE-ఫీజు రీయింబర్స్మెంట్ ఉపకార వేతనం లభించే అభ్యర్థులు మీసేవ ద్వారా పొందినటువంటి ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందుపరచవలసి ఉంటుంది.

RATION CARD-తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే దానిని సమర్పించవలసి ఉంటుంది.

AADHAR CARD-అభ్యర్థి యొక్క గుర్తింపు కొరకు ఆధార్ కార్డును జత పరచవలసి ఉంటుంది.

2014 ఏపీ విభజన తర్వాత తెలంగాణ నుండి ఎవరైనా వలస వచ్చిన వారు వుంటే వారు ఎమ్మార్వో ఆఫీస్ నుండి స్థానికత పత్రంను పొంది దానిని జతపరచవలసి ఉంటుంది.

ఈ విధంగా పైన చూపించబడిన పత్రాలు మొత్తం రెండు సెట్లు జిరాక్స్ కాపీలు మరియు ఒక సెట్ ఒరిజినల్ జాబితాను అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని కౌన్సిలింగ్ జరిగే సమయంలో ప్రభుత్వం నియమించిన అధికారి చేత పరిశీలన చేయడం జరుగుతుంది.