అన్ని విభాగాల్లో ట్రాన్స్ఫర్లు
అమరావతి: ఇంటర్మీడియట్ విద్యా మండలి పరిధిలో పని చేస్తున్న అన్ని విభాగాల సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. ఇంటర్మీడియట్ కమిషనరేట్ ఏర్పాటు చేసే బదిలీల కమిటీల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
90 రోజుల కన్నా ఎక్కువ లాంగ్ లీవ్ లో ఉన్న ఉద్యోగులు మాత్రం అదే స్థానంలో కొనసాగుతున్నారు. ఓకే కళాశాలలో అయిదేళ్లు, అంతకన్నా ఎక్కువ సర్వీస్ పూర్తయిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. రెండేళ్ల నుంచి సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులని వివరించారు. బదిలీల పూర్తి షెడ్యూల్ ఇంటర్ బోర్డు విడుదల చేయనున్నది. బదిలీలు ” “ఆన్ రిక్వెస్ట్ లు పాలనాపరమైన అవకాశాల మేరకు ఉంటాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తెలిపారు