AP MODEL SCHOOL: 282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
AP MODEL SCHOOL: 282 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
71 టిజిటి, 211 పిజిటి పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు చేపట్టనున్నారు. ఈనెల 8 నుంచి 17 వరకు అప్లై చేసుకోవాలి. ఆగస్టు 30 నుంచి టీచింగ్ డెమో ఉంటుంది.
మోడల్ స్కూల్లో 282 టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. 71 టీజీటీ, 211 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పోస్టులు గలవు. అభ్యర్థుల అర్హత, ఇతర ప్రాధాన్యతలను పరిగణంలోనికి తీసుకొని ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ చేస్తారు.
కమ్యూనిస్టు రిజర్వేషన్, జోన్ లా ద్వారా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది. జోన్ ల వారీగా సెలక్షన్ కమిటీల ఆధ్వర్యంలో నియామకాలు జరుగుతాయి.
టీజీటీ పోస్టులు:
జోన్1 లో 17,
జోన్ 3 లో 23,
జోన్ 4 లో 31 పోస్టులు ఉన్నాయి.
పీజీటీ పోస్టులు:
జోన్ 1లో 33,
జోన్ 2 లో 4,
జోన్ 3 లో 50,
జోన్ 4 లో 124 పోస్టులు గలవు.
ఆన్లైన్లో దరఖాస్తులను www.cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ స్కాన్డ్ కాపీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 18 సం.నుండి 44 సం. లోపల వయసు ఉండాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ ఈ డబ్ల్యూఎస్ వారికి గరిష్ట వయసు 49 సం.లు, దివ్యాంగులకు 54 సం.లు, పీజీటీ పోస్టులకు రెండేళ్ల మాస్టర్ డిగ్రీ 50 శాతం మార్కులు ఉండాలి. సంబంధిత సబ్జెక్ట్ మెథడాలజీలో బీఈడీ కోర్సు చేసి ఉండాలి. పీజీటీ కామర్స్ పోస్టులకు ఎం. కామ్ అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ చేసిన అభ్యర్థులు అర్హులు కారు.
టిజిటి పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీ కోర్స్ లేదా యూజీఎస్ గుర్తింపు ఉన్న కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి 50% తో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సబ్జెక్టు లో బీఈడీ తదితర ప్రొఫెషనల్ కోర్సు సాధించి ఉండాలి. అర్హతలు వెయిటేజ్ కి సంబంధించిన పూర్తి వివరాల పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ లో తెలిపారు. నిబంధనల ప్రకారం నిర్ణీత కాంట్రాక్ట్ ఒప్పందాలను పూర్తి చేశాక నియామకాలను పొందుతారు. డీఎస్సీ ద్వారా రెగ్యులర్ టీచర్ నియామకాలు జరిగితే మీ కాంట్రాక్టు ఆటోమేటిక్ గా తొలగించబడుతుంది.
షెడ్యూల్:
1 ఆన్లైన్ దరఖాస్తులు: ఆగస్టు 8 నుండి 17 వరకూ
2 ప్రాథమిక సీనియార్టీ లిస్ట్: ఆగస్టు 23
3 అభ్యంతరాల నమోదు: ఆగస్టు 24,25
4 అభ్యంతరాలకి పరిష్కారాలు: ఆగస్టు 26, 27
5 జోన్ ల వారిగా ఇంటర్వ్యూల ఎంపిక: ఆగస్టు 29
6 టీచింగ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ డెమో: ఆగస్టు 30,సెప్టెంబర్ 1
7 ఫైనల్ ఎంపిక లిస్ట్: సెప్టెంబర్ 5
8 వెబ్ కౌన్సిలింగ్: సెప్టెంబర్ 8
9 జాయినింగ్: సెప్టెంబర్ 9