Site icon Education Telugu Thefinexpress

AP PMC Selection 2021 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరెంట్స్ మీటింగ్ కమిటీ నిర్వహణ సూచనలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుత చైర్మన్ పదవి కాలం అక్టోబర్ తో ముగియనుండడంతో కొత్త కమిటీకు సంబంధించిన కొత్త షెడ్యూల్ విడుదలైంది.

ఈ నెల 16న నోటిఫికేషన్:
సెప్టెంబర్ నెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ఎన్నిక కు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఓటర్ జాబితా నోటీస్ బోర్డ్ లో ప్రదర్శిస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 20వ తేదీ వరకు స్వీకరించి తుది ఓటర్ల జాబితా నోటీస్ బోర్డ్ లో పెట్టేలా షెడ్యూల్ లో వివరించారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019లో పాఠశాలకు తల్లిదండ్రుల కమిటీ ఉండాలని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరు మారుస్తూ పేరెంట్స్ మీటింగ్ కమిటీ గా పేరు మార్చింది. 2019లో అనేక పాఠశాలల్లో ఘర్షణలు చిన్న రేగడంతో ఈసారి ఓటర్ల జాబితా ప్రజల నుంచే పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హెచ్ ఎం లు, ఎన్జీవోలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇ ఎన్నికలకు మార్గదర్శకాలు నిర్వహిస్తారు.
ఈ నెల 16న నోటిఫికేషన్:
సెప్టెంబర్ నెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ఎన్నిక కు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఓటర్ జాబితా నోటీస్ బోర్డ్ లో ప్రదర్శిస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 20వ తేదీ వరకు స్వీకరించి తుది ఓటర్ల జాబితా నోటీస్ బోర్డ్ లో పెట్టేలా షెడ్యూల్ లో వివరించారు.

22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ను తల్లిదండ్రుల కమిటీ ఎన్నుకుంటుంది.
అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు చైర్మన్ ఉపాధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కొత్త కమిటీ మధ్యాహ్నం మూడు గంటలకు తొలి సమావేశం నిర్వహించేలా ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బి. రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం నాడు నేడు రెండో విడత పనులు చేపట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పనులను పేరెంట్స్ కమిటీ ద్వారా పరిశీలించాల్సి ఉంది. నాడు నేడు లో ఇచ్చే ప్రతి పైసాకు ఈ పేరెంట్స్ కమిటీ నుంచి పదవీకాలం ముగిసే వరకు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది.