CBSE Minority Scholarship 2023: ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్
CBSE Minority Scholarship 2023: ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్
బాలికలకు సీబీఎస్ఈ ఆర్థిక చేయుత
కుటుంబంలో ఏకైక సంతానముగా ఉన్న ఆడపిల్లల చదువును ప్రోత్సహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), స్కాలర్షిప్ అందిస్తుంది. తల్లిదండ్రులకు ఏకైక బాలిక సంతానంగా ఉన్న, ప్రతిభ కలిగిన విద్యార్థుల కోసం సింగల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ (ఎస్ జీసీఎస్) పేరుతో 2026 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన బాలికల ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గలవారు నవంబర్ 14వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు: విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె (సింగల్ గర్ల్ చైల్డ్) అయి ఉండాలి. సీబీఎస్ఈ లో పదవ తరగతి ఉత్తీర్ణులై. సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 11వ తరగతిలో ప్రవేశం పొంది ఉండాలి. పదో తరగతి పరీక్షల్లో కనీసం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500/- కంటే మించకూడదు.11,12వ తరగతి చదువుతున్న మాత్రమే దరఖాస్తుకు అర్హులు. సీబీఎస్ఈ బోర్డుకి సంబంధించి NRI విద్యార్థిని అయితే ట్యూషన్ ఫీజు నెలకు రూ.6000/- మించకుండా ఉంటే స్కాలర్షిప్ కి అర్హులే అవుతారు. విద్యార్థిని ఏకైక సంతానమని రుజువు చేయడానికి సంబంధించి CBSE వెబ్ సైట్ లో పేర్కొన్న ఫార్మాట్లో ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్/ఎడీఎం/ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్/నోటరీ అటెస్టి చేసిన ఒరిజినల్ అఫిడవిట్ ను సమర్పించాల్సి ఉంటుంది.
స్కాలర్షిప్ వ్యవధి
స్కాలర్షిప్ కి ఎంపికైన విద్యార్థులు 11వ తరగతి తర్వాత ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ రెన్యువల్ చేయించుకోవాలంటే…విద్యార్థిని 11వ తరగతి నుంచి తరగతులలో కనీసం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి.
విద్యార్థిని సత్ప్రవర్తనతో పాటు స్కూలు హాజరు శాతం బాగా ఉండాలి. ఒకవేళ విద్యార్థిని స్కూలుకు లేదా కోర్సు మారాలనుకుంటే…బోర్డు ముందస్తు అనుమతి తీసుకుంటేనే స్కాలర్షిప్ కొనసాగుతుంది. స్కాలర్షిప్ ఒక్కసారి రద్దయితే తిరిగి పునర్దించరు.
స్కాలర్షిప్ మొత్తం
విద్యార్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500/- చొప్పున ఈ స్కాలర్షిప్ మొత్తాన్ని అందిస్తారు. ఈ మొత్తం నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
ముఖ్య సమాచారం:
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
- దరఖాస్తు చివరి తేదీ: 14.11.2022.
- వెబ్ సైట్: cbse.gov.in.