చిత్తూరు జిల్లాలో అంగన్ వాడీ పోస్టులు భర్తీకి చర్యలు


చిత్తూరులోని అంగన్ వాడీ భర్తీకి సంబంధిత అధికారులు ప్రకటన విడుదల చేశారు.చిత్తూరు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇంచార్జి పి.డి నాగ శైలజ మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేశారు. 484 పోస్టుల భర్తీ. అంగన్వాడి కార్యకర్తలు 110, మినీ అంగన్వాడీ కార్యకర్తల 65, 309 ఆయాలు నియమించేందుకు పాలనాధికారి హరి నారాయణణ్ ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. సంబంధిత సి డి పి వో కార్యాలయాల్లో అంగన్వాడి కేంద్రాల వారీగా ఖాళీలు, పోస్టుల వివరాలు అందులో ఉన్నట్లు తెలిపారు


అంగన్ వాడీ కార్యకర్త-110
మినీ అంగన్ వాడీ కార్యకర్తలు-85
అంగన్ వాడీ సహాయకురాలు-309
దరఖాస్తు తేదీ:2021 ఆగస్టు 26
దరఖాస్తు చివరితేదీ:2021 సెప్టెంబర్ 09

జీతం:అంగన్ వాడీ కార్యకర్త ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11500 వేతనం లభిస్తుంది. ఇంకా మినీ అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు రూ.7వేలు, సహాయకురాలికి నెలకు రూ.7వేలు వేతనం ఉంటుంది.

విద్యార్హత: అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాసై ఉండాలి. స్థానికంగా నివసిస్తూ ఉండాలి. వయస్సు జూలై ఒకటో తేదీ నాటికి 35 లోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు రూ.30ని పరీక్ష పీజుగా చెల్లించాలి.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా దరఖాస్తులను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను వచ్చేనెల 9 తేదీలోగా సంబంధిత సీడీపీఓ, సమర్పించాలి.

Official website https://chittoor.ap.gov.in/

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker