Site icon Education Telugu Thefinexpress

Navodaya 11th Class Admission: నవోదయ 11వ తరగతిలో ప్రవేశాలునవోదయ 11వ తరగతిలో ప్రవేశాలు

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: జవహర్‌ నవోదయ విద్యాలయం కాగజ్‌నగర్‌లో 11వ తరగతిలో ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయం ప్రిన్సిపల్‌ చక్రపాణి తెలిపారు.
సైన్స్‌ గ్రూపు-8, కామర్స్‌ గ్రూపు- 30 సీట్లు ఖాళీలున్నట్లు చెప్పారు. 2020-2021 సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు నవోదయ విద్యాలయం 94412 64035ను సంప్రదించాలి

జిల్లాలో 20 ఓపెన్‌ స్కూల్‌ కేంద్రాలు
ఆసిఫాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : ఆగిపోయిన చదువులను కొనసాగించడానికి తెలంగాణ సార్వత్రిక పాఠశాల (ఓపెన్‌ స్కూల్‌) ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ పరీక్షల జిల్లా సహాయ కమిషనర్‌ ఎం.ఉదయ్‌బాబు తెలిపారు. సార్వత్రిక పది, ఇంటర్‌ ప్రవేశాల ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాలోని అధ్యయన కేంద్రాల ప్రధానోపాధ్యాయులు, సహ సమన్వయకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉదయ్‌బాబు మాట్లాడుతూ.. జిల్లాలో 20 ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.

వచ్చేనెల 10లోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో ప్రవేశ దరఖాస్తు చేసుకోవచ్చని, అపరాధ రుసుముతో 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ విషయంలో సమన్వయకర్తలు విస్త్రృత ప్రచారం చేయాలన్నారు. సార్వత్రిక పాఠశాల ఉమ్మడి జిల్లా సమన్వయకర్త ఎన్‌.అశోక్‌ మాట్లాడుతూ.. ప్రవేశాల విధానాన్ని వివరించారు.