మచిలీపట్నంలోని మహాత్మా జ్యోతిబాపులే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 5 నుంచి 9తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ డా.ఎం. అనిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లలో చదువుతున్న ఆసక్తిగల, విద్యార్థులు నిర్ధేశిత తరగతుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
O.C ,B.Cలకు చెందిన విద్యార్థులు 2010 సెప్టెంబర్ 1 నుండి 2012 ఆగస్టు 31 మధ్య జన్మించి, ఉండాలి. ∙SC,STలు 2008 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య కాలంలో, జన్మించి ఉండాలి. ∙విద్యార్థులు జిల్లాలో 2019–20, 2020–21 విద్యాసంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో మూడవ,నాలుగవ తరగతులు చదివి ఉండాలి. ∙O.C, BC విద్యార్థులు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలోనే చదివి ఉండాలి. ∙గ్రామీణ పట్టణ ప్రాంత SC, ST, మైనార్టీ విద్యార్థులు పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. విద్యార్థి తల్లి, తండ్రి, సంరక్షకుల 2020–21 ఆర్థిక వార్షికాదాయం రూ .లక్ష రూపాయలు మించరాదు.
విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. లక్షమించని వారు మాత్రమే అర్హులు అని చెప్పారు. మిగిలిన ఖాళీలను రిజర్వేషన్ కేటగిరీ ఆధారంగా భర్తీ చేస్తామన్నారు. విద్యార్థులు తమ స్టడీ సర్టిఫికేట్, ఫోటో, ఆధార్‌కార్డు, ఫొటో, పుట్టిన తేదీ, క్యాస్ట్, ఇన్కమ్,ద్రువీకరణపత్రాలతోపాటు బియ్యం కార్డు జిరాక్స్ కాపీని కూడా దరఖాస్తుకు జతచేయాలన్నారు.
వివరాలకు:ఫోన్‌నెం:08672-250434, 9494760434 నంబర్లలో సంప్రదించ వచ్చని చెప్పారు. అప్లికేషన్స్ తమ వారి వారి,పాఠశాలలో అందుబాటులో ఉంటాయని, ఈనెల 28 నుంచి సెప్టెంబరు 6వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.