నవోదయ నోటిఫికేషన్-2021-22 ఆరో తరగతి ప్రవేశంనవోదయ విద్యాలయాల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశం కొరకు జరిగే ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 20వ తేదీ నుండి 2021 నవంబర్ 30 తేదీ లోపల ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు
1.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలోగానీ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో గాని, 2019-2020,2020-21 విద్యా సంవత్సరాల్లో వరుస 3,4 తరగతులు చదివి విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి.

2. అభ్యర్థులు 01/05/2009 నుండి 30/04/2013 మధ్య పుట్టిన వారు అయిఉండాలి.
(ఈ రెండో తేదీల ను కలుపుకుని)
ఈ క్రింద ఇవ్వబడిన వెబ్ సైట్ల ద్వారా దరఖాస్తు ఫాంని డౌన్లోడ్ చేసుకుని దానిని పూర్తి చేసి,5 తరగతి చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు ద్వారా ధ్రువీకరణ చేసి మరలా దానిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫామ్ లోని నియమ నిబంధనలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించి, దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.

ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభం తేదీ: 20/09/2021

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ:30/11/2021

పరీక్ష తేదీ: 30/04/2022

వెబ్ సైట్లు: www.navodaya.gov.in

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker