న్యూఢిల్లీ: వైద్య, విద్య డెంటల్ కోర్సులో 2021-2022 నీట్ ద్వారా ప్రవేశాల విషయంలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబిసి) 27 శాతం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ఈడబ్ల్యూఎస్ పది శాతం కోటా కల్పిస్తూ జూలై 29 న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ సవాళ్ళు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై స్పందించాలని కేంద్రానికి, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంపీసీ) సూచించింది.
ఈ మేరకు జస్టిస్ డి వై చంద్ర గౌడ్, జస్టిస్ బి వీ నాగరత్న తో కూడిన ధర్మాసనం నోటీసు జారీ చేసింది. జూలై 29 నాటికి నోటిఫికేషన్ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఎనిమిది మంది పిటిషన్లు దాఖలు చేశారు. వీరిలో నీట్ పరీక్ష రాసిన వారు కూడా ఉన్నారు. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ విరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. పీజీ మెడికల్ కోర్సుల్లో సీట్లు ఇప్పటికే చాలా పరిమితంగా ఉన్నాయని, వాటి రిజర్వేషన్లు ఆధారంగా భర్తీ చేయడం సరైంది కాదని, దీనివల్ల ప్రతిభావంతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.