Telangana Army Recruitment Rally 2022: దరఖాస్తు తేదీలు

Telangana Army Recruitment Rally 2022: 15 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

హైదరాబాద్: ‘ అగ్నివీర్ నియామకాలలో భాగంగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని ఈ నెల 15 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో ఈ ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. దీనికి తెలంగాణ అన్ని జిల్లాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అగ్నివీర్ జనరల్, అగ్నివీర్ టెక్నికల్,అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ ట్రేడ్ మెన్, వంటి క్యాటగిరీలో నియామకాలు ఉంటాయని వివరించారు. దరఖాస్తు సమయంలో www.joinindianarmy.nic.in లో అప్లోడ్ చేసిన ధ్రువీకరణ పత్రాలను రిక్రూట్మెంట్ ర్యాలీకి వచ్చేటప్పుడు విధిగా తీసుకురావాలని సూచించారు.

ఆర్మీ రిక్రూట్మెంట్ ద్వారా శిక్షణతో కలుపుకొని గరిష్టంగా 4 సంవత్సరాల కాలపరిమితితో నియామకాలు చేపడతారు. ఆ తర్వాత కేవలం 25% మంది సైనికులు మాత్రమే రెగ్యులర్ క్యాడర్ గా తీసుకుంటారు. ఆర్మీలో నియామకాల కోసం నిర్దేశించిన అగ్నిపథ్ పథకం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణలో అక్టోబర్ 15 నుంచి 31 వరకు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ విభాగం అగ్నిపథ్ నియామక ర్యాలీ నిర్వహించనుంది. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు ర్యాలీకి హాజరు కావచ్చు.

ఆర్మీ యాక్ట్ 1950 సర్వీస్ నిబంధనల ప్రకారం నాలుగేళ్ల ఉద్యోగ కాల పరిమితికి అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అగ్నివీర్ పథకం ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. వాయు, నావిక, భూ సైన్యం ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. అగ్ని వీరులకు ఎలాంటి పెన్షన్ గాని, గ్రాట్యుటీ గానీ వర్తించదు.

ఆర్మీ ర్యాంకులతో పోలిస్తే వీళ్ళ ర్యాంకులు భిన్నంగా ఉంటాయి. అగ్ని వీరులు సైన్యం లో కోరినచోట పనిచేయాలి. ఇందులో చేరేందుకు ఫిజికల్, రిటన్ టెస్ట్, ఫీల్డ్ టెస్ట్, మెడికల్ చెకప్ వంటివి పాస్ అవ్వాలి.ఆర్మీ రిక్రూట్మెంట్ ద్వారా శిక్షణతో కలుపుకొని గరిష్టంగా 4 సంవత్సరాల కాలపరిమితితో నియామకాలు చేపడతారు. ఆ తర్వాత కేవలం 25% మంది సైనికులు మాత్రమే రెగ్యులర్ క్యాడర్ గా తీసుకుంటారు. ఆర్మీలో నియామకాల కోసం నిర్దేశించిన అగ్నిపథ్ పథకం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.

తెలంగాణలో అక్టోబర్ 15 నుంచి 31 వరకు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ విభాగం అగ్నిపథ్ నియామక ర్యాలీ నిర్వహించనుంది. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు ర్యాలీకి హాజరు కావచ్చు.ఆర్మీ యాక్ట్ 1950 సర్వీస్ నిబంధనల ప్రకారం నాలుగేళ్ల ఉద్యోగ కాల పరిమితికి అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

అగ్నివీర్ పథకం ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. వాయు, నావిక, భూ సైన్యం ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. అగ్ని వీరులకు ఎలాంటి పెన్షన్ గాని, గ్రాట్యుటీ గానీ వర్తించదు. ఆర్మీ ర్యాంకులతో పోలిస్తే వీళ్ళ ర్యాంకులు భిన్నంగా ఉంటాయి. అగ్ని వీరులు సైన్యం లో కోరినచోట పనిచేయాలి. ఇందులో చేరేందుకు ఫిజికల్, రిటన్ టెస్ట్, ఫీల్డ్ టెస్ట్, మెడికల్ చెకప్ వంటివి పాస్ అవ్వాలి.

నియామక తీరు: ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ద్వారా శిక్షణతో కలుపుకొని గరిష్టంగా 4 సంవత్సరాల కాల పరిమితితో నియామకాలు చేపడతారు. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సైనికులలో కేవలం 25 శాతం మంది సైనికులను మాత్రమే తీసుకుంటారు. వీరు 15 ఏళ్ల పాటు సర్వీస్ లో ఉంటారు. నాలుగేళ్లు తర్వాత విరమణ పొందే సైనికులకు ‘ సేవానిధి, కింద రూ.12 లక్షల వరకు ఆర్ధిక వెసులుబాటు కల్పిస్తారు.

అలాగే ఉద్యోగంలో ఉన్నంతవరకు రూ.48 లక్షల నాన్ కాంట్రిబ్యూటరీ జీవిత బీమా కల్పిస్తారు. రిటైర్డ్ అయిన అగ్ని వీరులకు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తారు.

జీతం: నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన అగ్రి వీరులకు మొదటి ఏడాది నెల జీతం రూ.30,000, రెండో ఏడాది రూ.33,000 మూడో ఏడాది రూ.36,000 నాలుగో ఏడాది రూ.40,000 వరకు అందుతుంది. దీంతో పాటుగా కార్పస్ ఫండ్ కింద మొదటి ఏడాది రూ.18,000, రెండో ఏడాది రూ.19,800, మూడో ఏడాది రూ.21,900, నాలుగో ఏడాది రూ.24,000 ఇస్తారు.

అగ్నివీర్ (జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్కు/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్ మెన్ వంటి పోస్టులు రిక్రూట్మెంట్ (2022-23)

  • అర్హత: అగ్నివీర్ ట్రేడ్ మెన్ ఖాళీలకు ఎనిమిదో తరగతి, ఇతర పోస్టులకు పదవ తరగతి అర్హత ఉండాలి.
  • వయోపరిమితి: 01.10.2022 నాటికి 17.5-21 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
  • దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్,ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

Telangana Army Recruitment Rally 2022: Download Here

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker