Telangana EAMCET ఎంసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ: ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కొద్దిసేపటి క్రితమే ఫలితాలు విడుదల చేశారు.
ఎంసెట్ ఇంజనీరింగ్ కోర్సుకు ఎంట్రెన్స్ కు 90 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఎంసెట్ అగ్రికల్చర్ మరియు మెడికల్ స్ట్రీమ్ కు 91.19 శాతం హాజరయ్యారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు.
ఎంసెట్ పరీక్ష ఫలితాల కోసం eamcet.tsche.ac.in అధికార వెబ్ సైట్ ద్వారా పరీక్ష ఫలితాలను చూడవచ్చు. ఈనెల 4, 5, 6, 9 and 10 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షను నిర్వహించిన ప్రభుత్వం.
ఈరోజు ఎంసెట్ ఫలితాలు విడుదల కాగా, మొదటి విడత కౌన్సెలింగ్ ఈ నెల 30వ తేదీన జరగనుంది. 30 తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి ధ్రువ పత్రాలు పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలి. సెప్టెంబర్ 4 నుంచి 11వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. ఇదేవిధంగా సెప్టెంబర్ 4 నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అవకాశం కల్పించింది. ఇక రెండవ విడతగా కౌన్సిలింగ్ త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర విద్యా శాఖ తెలిపింది.