TS MDM Rates 2022: మధ్యాహ్న భోజనం రేటు పెంపు
TS MDM Rates 2022: మధ్యాహ్న భోజనం రేటు పెంపు
హైదరబాద్: ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు అందించే భోజన ఛార్జీలు స్పలంగా పెరిగాయి.ఈ విద్యా సంవత్సరానికి 9.6 శాతం పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు గతంలో రూ.4.97 ఉండగా, తాజాగా రూ.5.45 కు పెంచారు.ప్రాథమికోన్నత పాఠశాల వారికి గతంలో రూ.7.45 ఉండగా,తాజాగా రూ.8.17 కు పెంచారు. గత రెండేళ్లుగా మధ్యాహ్న భోజన ఛార్జీలను కేంద్రం పెంచలేదు. 2011 నుంచి ఏటా 10% పెంచుతుండగా,ఈ ఏడాది 9.6 శాతమే పెంచారు. కొత్త ధరలు అక్టోబర్ 1 నుంచి అమలో ఉంటాయినీ కేంద్ర విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
కొత్త ధరలు ఇలా..
పెంచిన ఛార్జీలు (ఒక్కో విద్యార్థికి) | కేంద్రం | రాష్ట్రం | మొత్తం |
1-5 తరగతులు | రూ.3.27 | రూ.2.18 | రూ.5.45 |
6-8 తరగతులు | రూ.4.90 | రూ.3.27 | రూ.8.17 |