Beetroot benefits: బీట్ దుంప బీట్రూట్ ,క్యారెట్, ముల్లంగి, అని మూడు రకాల దుంపలు ఉన్నాయి, దుంపలో కెల్ల మంచి దుంప బీట్రూట్ దుంప. బీట్రూట్లో ఫోలిక్ యాసిడ్ అనేది 97.3 మైక్రో గ్రాములు ఉంటుంది. ఈ ఈ ఫోలిక్ యాసిడ్ అనేది బీట్రూట్ జ్యూస్ ను అప్లై చేసినప్పుడు కొత్త కణాల అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. బీట్రూట్ జ్యూస్ ని తాగడం వల్ల బాహ్యంగా చర్మ సౌందర్యాన్ని, ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.
Beetroot benefits:
బీట్రూట్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల ,స్కిన్ సెల్స్ మధ్యలో పగుళ్లు రాకుండా ఉండడానికి విటమిన్ ఏ ఉపయోగపడుతుంది. ఫ్రెష్ జ్యూస్ తీసుకోవడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్, యాక్సిడెంట్, ఆంటీ ఫంగల్, యాంటీ వైరల్ ను కలిగి ఉంటుంది. బీట్రూట్లో విటమిన్ సి ఉంటుంది. బీట్రూట్ ను వేడి చేయడం వల్ల విటమిన్ సి నశిస్తుంది. బీట్రూట్ రసాన్ని అప్లై చేసినప్పుడు చర్మం కింద కొల్లాజిన్, ఎలాసిటీ బాగా ఉండడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది.
చర్మంలో ఉండే నలుపు రంగులో ఉండే మేలనోసైట్ అనే కణాలు, మెలోనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయడానికి, నిరోధించడానికి బీట్రూట్ రసం ఉపయోగపడుతుంది..
Beetroot juice
స్క్రీన్ డ్రైగా ఉన్నవారు రెండు లేదా మూడు స్పూన్ల బీట్రూట్ జ్యూస్ ను తీసుకొని, టూ స్పూన్ మిల్క్, మరియు ఆల్మండ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్, తీసుకొని ఈ మూడింటి మిశ్రమాన్ని కలిపి, ఫేస్ కి అప్లై చేసుకోవడం వల్ల డ్రై స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది. స్కిన్ గ్లో కి మరియు బ్రైట్ నెస్ కోసం చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు.
కమలా పండుల తొక్కల పొడికి ఈ బీట్రూట్ జ్యూస్ ని కొంత కలిపి ఫేస్ కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ గ్లో వస్తుంది. డార్క్ సర్కిల్స్ పైన ప్రెగ్నెంటేషన్ తగ్గించడానికి ఒక స్పూన్ బీట్రూట్ జ్యూస్ తీసుకొని, ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ తీసుకొని, ఈ రెండింటిని కలిపి ఈ డార్క్ ప్రెగ్నెంటేషన్ ఉన్నచోట అప్లై చేసి మర్దనచేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల తో పాటు మర్ధన చేసుకోవాలి. స్కిన్ మృదువుగా, స్మూత్ గా ఉండడం కోసం, మూడు లేక నాలుగు స్పూన్ల బీట్రూట్ జ్యూస్ తీసుకొని, మూడు స్పూన్ల ల పెరుగును కలిపి, ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి ముఖానికి అప్లై చేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు అప్లై చేసుకుంటే స్కిన్ మృదువుగా తయారవుతుంది.
బీట్రూట్ తింటే ప్రమాదమా?
మార్కెట్లలో లభ్యమయ్యే కూరగాయలు బీట్రూట్ చక్కటి ఔషధం. బీట్రూట్ జ్యూస్ ను సేవిస్తే శక్తి పెరిగి క్రీడా సామర్థ్యం పెరుగుతుందని క్రీడాకారులు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ నుతీసుకుంటారు. బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. బీట్రూట్లో విటమిన్లు, మెగ్నీషియం మరియు బయో ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. చర్మ సౌందర్యం పెరగడానికి, శరీరంలో ట్రై గ్లిజరేట్స్ శాతం తగ్గించడానికి బీట్రూట్ ఉపయోగపడుతుంది. ట్రై గ్లిజరేట్స్ తగ్గడం వల్ల రక్తంలోని కొవ్వు కూడా తగ్గుతుంది. శరీరంలో సహజంగా హార్మోన్లు ఉత్పత్తి కావడానికి బీట్రూట్ సహాయపడుతుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే అనేక రకాల వ్యాధుల నివారణలో బీట్రూట్ ని వాడతారు. బీట్రూట్ అద్భుతంగా ఉన్న మన ఆరోగ్యానికి మేలు చేయాలన్న నియమం లేదు. ఇన్ని సుగుణాలు ఉన్న ఈ బీట్రూట్ మెరిసేదంతా బంగారం కాదు. . కొన్ని ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతుంది. దీని తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఏమిటో చూద్దాం.
బీట్రూట్ ఎవరు తినకూడదు?
కంటి చూ పులు సమస్యలను తగ్గించడం బీట్రూట్ సహాయపడుతుంది. బీట్రూట్ ఎరుపు రంగుతో కలిగే బీ టసయానిన్ కూడా పెద్ద ప్రేగుతో క్యాన్సర్ తో పోరాడే లక్షణం ఉంది, అనిమియా తో బాధపడేవారు రోజు ఒక కప్పు బీట్రూట్ రసం తాగితే త్వరగా కోలుకుంటారు. అయితే ఎన్నో ప్రయోజనాలు అందించే బీట్రూట్ కొన్ని సార్లు ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీట్రూట్ తీసుకోవడం వల్ల హానికరంగా మారుతుంది. అలాగే కిడ్నీలో రాళ్లు సమస్యతో బాధపడే వారు కూడా బీట్రూట్ ను తీసుకోకూడదు. గాల్ బ్లాడర్, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీట్రూట్ తీసుకోకూడదు.
ఇందులో ఆక్సి లేట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కిడ్నీలో రాళ్లు సమస్య పెరుగుతూ ఉంది. అలర్జీ చర్మంపై ,దద్దుల సమస్య ఉన్నవారు బీట్రూట్ తినకూడదు. ఇది ఎలర్జీలు ,చర్మంపై దద్దుల సమస్యను మరింతగా పెంచుతుంది. అలాగే మధుమేహ రోగులు కూడా బీట్రూట్ ను ఎక్కువగా తినకూడదు. డయాబెటిక్ సమస్యను మరింతగా పెంచుతుంది. ఇందులో గ్లైసిమిక్ ఇండిక్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర సాయి పెరుగుతుంది.
బీట్రూట్ ఉపయోగాలు:
బీట్రూట్ కంటికి ఇంపుగా కనిపించడమే కాకుండా ఆరోగ్యానికి మరియు చర్మ సౌందర్యాన్ని కూడా చాలా మంచిది. ఇది మన శరీర వ్యవస్థను కాపాడుకునే మంచి టానిక్. అన్ని రకాల వ్యాధుల నివారిణిలో బీట్రూట్ ను వాడితే ఐరన్ మరియు కాపర్ పుష్కలంగా ఉన్నాయి. రక్త పోటు స్థాయిలను తగ్గించడంలో బీట్రూట్ ప్రధాన లక్షణం. బీట్రూట్ దుంపను మరియు ఆకులను రెండు తినేందుకు వాడతారు. శక్తి నుంచి దుంపలలో బీట్రూట్ ప్రత్యేక స్థానం. బీట్రూట్లో మాయిశ్చర్, ప్రోటీన్లు, ఖనిజాలు, పీచు, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, జింక్, దయామిన్, విటమిన్ సి ఉన్నాయి.
రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడుతుంది. బీట్రూట్లో నైట్రేట్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నైట్ ఆక్సైడ్లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడానికి నివారిస్తాయి. బీట్రూట్ రసాన్ని తరచుగా తాగడం వల్ల రక్తపోటును నివారించవచ్చు. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీట్రూట్ ఎరుపు రంగును కలిగించే బీటా సయానిన్ కు, పెద్ద ప్రేగులో క్యాన్సర్లతో పోరాడే లక్షణం ఉంది. బీట్రూట్లో బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఫలితంగా చర్మం, గోర్లు, వెంట్రుకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
మలబద్ధకంతో బాధపడేవారు బీట్రూట్ ను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. పిల్లలు మరియు వృద్ధులలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటే రోజు బీట్రూట్ జ్యూస్ ను ఇవ్వడం వల్ల ఈ లోపాన్ని నివారించవచ్చు. బీట్రూట్లో మాయిశ్చర్ శాతం ఎక్కువ అందువల్ల తరచుగా బీట్రూట్ ను తీసుకోవడం ద్వారా కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు. గర్భంతో ఉన్న మహిళలు బీట్రూట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన కణజాలాలు వృద్ధి చెందేలా చేస్తుంది.
క్యాన్సర్ నివారణకు దోహదం చేస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించడంలో బీట్రూట్ పాత్ర అమోఘమైంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక కప్పు బీట్రూట్లో 11 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది. ఇనుము రక్తంలోని హిమోగ్లోవిన్ శాతాన్ని పెంచుతుంది. అవయవాలకు సరిపడినంత గా ఆక్సిజన్ అందించడంలో ఇనుము కీలక పాత్ర పోషిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు ఒక నెల రోజులపాటు క్రమం తప్పకుండా బీట్రూట్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బీట్రూట్ ను మహిళలు తీసుకోవడం వల్ల మహిళల్లో సాధారణంగా ఐరన్ లోపాల్ని అధిగమించవచ్చు. ఎముకలను దృఢంగా ఉంచడంలో బీట్రూట్ సహాయపడుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ శాతం తక్కువ. బరువు తగ్గాలనుకున్నవారు బీట్రూట్ ను తమ డైట్లో కంట్రోల్ ఫుడ్ లలో చేర్చుకోవచ్చు.
కడుపుని శుభ్రం చేసి, కడుపులోని మలినాలనుబయటకు పంపిస్తుంది. బీట్రూట్ తీసుకోవడం వల్ల సమస్యలను నివారించవచ్చు. సహజసిద్ధమయిన హార్మోల ఉత్పత్తికి బీట్రూట్ దోహదపడుతుంది. అయితే శరీరంలో తక్కువ ఇనుము ఉన్న వ్యాధితో బాధపడే వారు మాత్రం బీట్రూట్ కు దూరంగా ఉండడం మంచిది. బీట్రూట్ కొందరికి సరిపడదు. బీట్రూట్ తీసుకోవడం వల్ల జ్వరం రావడం, గొంతు బిగుదుగా అవ్వడం, శరీరంపై దద్దులు రావడం, ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల శరీరానికి సరిపడుతుందని నిర్ణయించుకున్న తర్వాతే బీట్రూట్ ను వాడడం మంచిది.
బీట్రూట్ లాభాలు:
బీట్రూట్ ముక్కలుగా లేక జ్యూస్. తీసుకోవడం వల్ల. శరీరంలో రక్త శాతం అధికమవుతుంది. ప్రతిరోజు బీట్రూట్ తినట్లయితే మానసిక ప్రశాంతత తో పాటు మెదడు చురుకుగా పనిచేస్తుంది. బీట్రూట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని శరీరానికి అందజేస్తాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. వయసు పై బడూతున్న వారు బీట్రూట్ తీసుకోవడం వల్ల ఉత్సాహంగా కనబడతారు. బీట్రూట్ ను ఫేస్ ప్యాక్ లలో కూడా వాడతారు. ఈ బీట్రూట్ ఈ వేసవిలో చలువ చేస్తుంది అని కూడా పెద్దలు చెప్తున్నారు. బీట్రూట్ ను తీసుకోవడం వల్ల రోజంతా చురుకుగా ఉంటారు. తక్షణ శక్తి కూడా లభిస్తుంది. కొవ్వు కరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బరువు కూడా తగ్గుతారు. రక్తహీనతను కూడా నివారిస్తుంది. కాలేయని శుభ్రపరుస్తుంది, ఎముకలను దృఢంగా ఉంచుతుంది, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది ఇలా బీట్రూట్ తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.
రోజు ఓ బీట్రూట్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు:
చెడు కొలస్ట్రాల్ తగ్గించి ,గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్త పోటును తగ్గిస్తుంది, గర్భిణీలో బిడ్డ ఎదిగేలా మేలు చేస్తుంది. క్యాన్సర్ ను నివారిస్తుంది, వాపు, నొప్పులను తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ క్రియ కు బీట్రూట్ బాగా తోడ్పడుతుంది. వృద్ధాప్య చాయలను ఈ బీట్రూట్ తీసుకోవడం వల్ల తగ్గిస్తుంది చర్మం పై మచ్చలు, ముడతలు లేకుండా చేసి ,యవ్వనంగా కనిపించేటట్లు చేస్తుంది. బీట్రూట్ నిత్యం తీసుకోవడం వల్లశారీరక దారుఢ్యం పెరుగుతుంది.
రక్తహీనతతో బాధపడే వారికి ఆహారంలో బీట్రూట్ ను చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఆటలలో సామర్థ్యమును పెంచి, ఆటలకు 90 నిమిషాల ముందు బీట్రూట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బీట్రూట్ చేసుకోవడం వల్ల ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు..
How to prepare beetroot curry
బీట్రూట్ కర్రీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక పాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. అయిన బాగా హిట్ అయిన తర్వాత, పోపు గింజలను యాడ్ చేసుకోవాలి. ఆఫ్ స్పూన్ చొప్పున మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆడ్ చేసుకుని ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను తీసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి .
తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు వేడైన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని, యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకుని పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెండు పెద్ద సైజుల బీట్రూట్ ని తీసుకొని, ముందుగానే బీట్రూట్లను శుభ్రంగా కడిగిన తర్వాత బీట్రూట్ పైన ఉన్న తొక్కను తీసిసన్నగా కట్ చేసుకుని, పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల బీట్రూట్ తొందరగా ఫ్రై అవుతుంది. బీట్రూట్ ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాల వరకు బాగా మగ్గించాలి.
ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని టేస్ట్ కి సరిపడినంత సాల్టు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మళ్లీ మూత పెట్టుకొని ఆరు నుండి ఏడు నిమిషాల వరకు ఈ బీట్రూట్ చక్కగా మగ్గింతవరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. బీట్రూట్ ముక్క అనేది సాఫ్ట్ అయ్యేంతవరకు బాగా మగ్గించుకోవాలి, బీట్రూట్ సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం ,హాఫ్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న
కొత్తిమీర ,యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ,లో ఫ్లేమ్ లో మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలాల్ని ఆడ్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ బీట్రూట్ ముక్కలకు బాగా చక్కగా పడతాయి .గరం మసాలా పౌడర్ ఈ బీట్రూట్ కర్రీ కి హైలెట్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్రేమ్‌లో ఫ్రై చేసుకుంటే బీట్రూట్ ఫ్రై అయిపోతుంది. డైరెక్ట్ గా రైస్ లోనైనా సరే, చపాతీలోకైనా, సైడ్ డిష్ కైనా చాలా బాగుంటుంది.
బీట్రూట్ జ్యూస్ తయారీ విధానం
కావాల్సిన పదార్థాలు చిన్న అల్లం ముక్క ఒకటి. బీట్రూట్, తేనె , పంచదార. బీట్రూట్ జ్యూస్ పరిగడుపున ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా బీట్రూట్ ను శుభ్రం చేసుకోవాలి, బీట్రూట్ పైన ఉన్న తొక్క నుతీసివేసి, సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొద్దిగా చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, వీటిని అన్నింటిని కలిపి మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి, దాంతోపాటు కొద్దిగా నీటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, బీట్రూట్ కి ఐస్ క్యూబ్ లను ఉపయోగించకూడదు, కుండలో ఉన్న చల్లటి నీటిని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులో తీసుకొని ఒక స్పూన్ తేనె కలుపుకొని రెండు లేదా మూడు స్పూన్ల షుగర్ ను యాడ్ చేసుకుని బీట్రూట్ జ్యూస్ ను తయారు చేసుకోవాలి.
ఈ తయారు చేసుకున్న బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకోవడం వల్ల, కిడ్నీలో రాళ్లు, కిడ్నీలు పాడవ్వడం లాంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది, రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు, క్యాన్సర్ వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది, రక్తాన్ని శుద్ధి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది,.ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల రోగాలన్నీ పరార్ అయితాయి.
రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.ఉత్సాహంగా చురుకుగా ప్రతిరోజు ఉండవచ్చు మంచి జ్ఞాపకశక్తి మీ సొంతం అవుతుంది. బీట్రూట్ జ్యూస్ సంపూర్ణ ఆరోగ్యంనీ మీ సొంతం చేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. హాయ్ బిపి ని కంట్రోల్ చేయడానికి, ఈ బీట్రూట్ జ్యూస్ ఉపయోగపడుతుంది .అంతేకాకుండా బరువు తగ్గిపోతారు. ఇంకా గర్భిణీలు బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల పోలిక్ ఆసిడ్ పుష్కలంగా అందుతుంది.
కడుపులో ఉండే బిడ్డ,ఎదుగుదలకుఈ పోలిక్ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల లివర్ శుభ్రపరచడమే ,కాకుండా దాని పనితీరును మెరుగుపరుస్తుంది. నిత్యం బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ జ్యూస్ త్రాగడంవల్ల ఐరన్ పెరుగుతుంది, బ్లడ్ లో హిమోగ్లోవిన్ స్థాయి పెరుగుతుంది. బీట్రూట్లో కాల్షియంతో పాటు, మెగ్నీషియం,, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఎముకలకు మంచి బలాన్ని ఇచ్చే శక్తి ఈ బీట్రూట్ జ్యూస్ కి ఉంటుంది.. డ్రై స్కిన్ ఉన్నవారు ఈ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం కళా పెరుగుతుంది. చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. చర్మం కాంతివంతంగా ప్రకాశిస్తుంది ఈ బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.
Read Also: Guava fruit benefits పేదవానికి మంచి పండు జాంపండు
బీట్రూట్ పౌడర్ (beetroot powder)
అందం ఆరోగ్యాన్ని ఇచ్చే బీట్రూట్ పౌడర్. బీట్రూట్ పౌడర్ తో స్కిన్ తెల్లగా చేస్తుంది, ఫేస్ మీద ఉన్న మచ్చలు, పోవడానికి ఉపయోగపడుతుంది, బీట్రూట్ తీసుకొని చిన్నచిన్న ముక్కలు కట్ చేసుకుని, మిక్సీ వేసుకోవలి. వాటర్ వేసుకోకుండా మెత్తటి పేస్టు చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని దాని రసాన్ని పిండుకోవాలి, ఈ విధంగా రసం తీసుకున్న తర్వాత, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని, ఈ రసాన్ని అందులో వేసి బాగా మరిగించుకొని ఒక పావు గ్లాస్ మిగిలే వరకు వేడి చేసుకోవాలి.
తర్వాత అందులో స్టౌ ఆఫ్ చేసి రైస్ పౌడర్ ను యాడ్ చేసుకుని దాన్ని బాగా కలుపుకోవాలి, మొత్తం బాగా కలుపుకున్న తర్వాత టూ ఆర్ త్రీ స్స్పూన్ గ్రంథం వేసి చేత్తో పొడిని మొత్తం మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత దానికి కస్తూరి పసుపు, మాత్రమే ఉపయోగించాలి. ఒకటి లేదా రెండు చెంచాల చొప్పున కస్తూరి పసుపును వేసి మొత్తం కలుపుకోవాలి.
బీట్రూట్ పౌడర్ ను తయారు చేసుకోవాలి. దానిని గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఒక నెల రోజులపాటుస్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న పౌడర్ ప్రిగ్మెంటేషన్ను, మచ్చలు, పోవడమే కాకుండా, బి,విటవిన్ఎక్కువగా ఉండడం వల్ల చర్మ సౌందర్యాన్ని ఎక్కువ చేస్తుంది. స్కిన్ మెరిసేలా చేస్తుంది. స్కిన్న్ కలర్ గ్లో అవుతుంది. ఒక నెల రోజులపాటు వాడడం వల్లచర్మం కాంతివంతంగా ప్రకాశిస్తుంది..