Health tips of the day:శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని అందేలా చూసుకుంటూ త్వరగా బరువు తగ్గడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే!
weight loss yellow foods
ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి. ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలు కలుషితం అవుతున్నాయి. అటువంటి కలుషితమైన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా త్వరగా రోగాల బారిన పడుతున్నాం.
అటువంటి వాటిలో బరువు పెరగడం, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలాంటి వ్యాధులు మనకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. వీటిలో ఎక్కువగా ఆడవారు బరువు పెరగడం ద్వారా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
Health tips for women:
ప్రస్తుత కాలంలో ప్రపంచ జనాభాలో ఉన్న స్త్రీలలో ఎక్కువగా బాధిస్తున్న సమస్య బరువు పెరగటం. పిల్లలు పుట్టిన తర్వాత వారి శరీరంలో జరిగే మార్పులు దీనికి ఒక కారణం. అయితే హెల్తీగా లేని ఫుడ్స్ తీసుకోవడం వల్ల, అలాగే ఉన్నచోటనే కదల కదలకుండా ఉండటం వలన ఇలా చాలా కారణాలు ఉన్నాయి.
కారణాలు ఏమైనా చివరికి బరువు పెరగడం మాత్రం కచ్చితంగా జరుగుతుంది. అందువలన ఈరోజు హెల్త్ టిప్స్ ఆఫ్ ది డే లో సులభంగా బరువు తగ్గడానికి కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
Health tips of the day: ఈరోజు హెల్త్ టిప్స్ ఆఫ్ ద డే లో సులభంగా బరువు తగ్గే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కేవలం 14 రోజుల్లో బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగపడే yellow colour foods ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
వీటిని తినడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. బరువు పెరగడానికి పోషకాలు ఎంత ముఖ్యమో, అలాగే బరువు తగ్గడానికి కూడా అంతే ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఫర్ వెయిట్ లాస్:
నిమ్మకాయ:
నిమ్మకాయ ప్రతి ఒక్కరికి తెలుసు. దానివల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. నిమ్మకాయలో సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియ సమస్యలను దూరం చేసి, శరీరంలో ఉండే టాక్సిన్ తీసివేస్తాయి.
ప్రతిరోజు నిమ్మకాయను మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా త్వరగా బరువు తగ్గుతారు. ప్రతిరోజు ఉదయం నిమ్మకాయ రసాన్ని గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకుంటే చాలా తొందరగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇలా రోజుకు రెండుసార్లు కూడా తీసుకోవచ్చు
అల్లం:
అల్లం ఔషధ గుణాల గని అని చెప్పవచ్చు. ఎందుకంటే అందులో చాలా రకాల ఔషధ గుణాలు అధిక మొత్తంలో ఉంటాయి. జలుబు, దగ్గు వంటి వాటికి మంచి యాంటీబయోటిక్ లా పనిచేస్తుంది. అంతేకాక అల్లం రసాన్ని తీసుకోవడం ద్వారా త్వరగా బరువు తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం, అల్లం రసం, మరియు తేనె కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఎల్లో క్యాప్సికం:
క్యాప్సికం అంటే అందరికీ తెలిసిందే. అనేక రకాల వంటలలో వాడుతారు. మనం ఎక్కువగా గ్రీన్ కలర్ వాటిని వాడుతాం. అయితే గ్రీన్ కలర్ క్యాప్సికంలో కెలరీలు అధికంగా ఉంటాయి.
అందువలన పసుపు రంగులో ఉండే క్యాప్సికం వాడటం వల్ల ఆరోగ్యంగా ఉండి, తొందరగా బరువు తగ్గవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక జీర్ణ క్రియను మెరుగుపరిచే విధంగా ఉంటుంది. అందువలన దీనిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు.
అరటి పండ్లు:
మన శరీరానికి అరటి పండ్లు చాలా మంచివి. శరీరానికి అందవలసిన అన్ని పోషకాలు లభిస్తాయి. దీనిని ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా శరీరం దృఢపడుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ బరువును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.