Plants

Gongura Benefits Telugu: పుండుకూర గోంగూర పచ్చడి ఔషధం

Gongura Benefits Telugu: గోంగూర అంటే తెలియని తెలుగు వారంటూ ఉండరేమో, గోంగూర ఆహారంగే కాకుండా ఔషధంలా కూడా పనిచేస్తుంది. గోంగూరలో విటమిన్ ఏ ,బి b1,b2,b5,b9 ,విటమిన్ సి తో పాటు క్యాల్షియం ,ఫాస్ఫరస్ ,సోడియం, మరియు ఐరన్ వంటి ఖనిజాలు ,యాంటీ ఆక్సిడెంట్లు మరియు మరెన్నో పోషక పదార్థాలు మెండుగా ఉన్నాయి. గోంగూర నుంచి vitamin a,సమృద్ధిగా లభిస్తుంది. గోంగూరను తరచుగా ఆహారంలో తీసుకోవడం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు.

గోంగూర చికెన్ తయారీ విధానం Gongura chicken:

ఎక్కువ మసాలాలు లేకుండా మంచి రుచిగా ఎలా చేసుకోవచ్చు చేసి చూపిస్తాను. టేస్ట్ మటుకు సూపర్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.ఫస్ట్ ఆఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్, టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, ధనియాల పొడి 1 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టిస్పూన్. అలాగే గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్,అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్లుఈపొడులన్నీ వేసుకున్న తర్వాత, దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయలు ,ఒక టమాట ,మూడు పచ్చిమిరపకాయలు, రెండు రెమ్మల కరేపాకు, కొద్దిగాకొత్తిమీర ,వీటీలన్నింటిని కలిపికట్ చేసుకొని ,ఈ చికెన్ ముక్కల్లో వేసుకోవాలి.

దీంట్లోనే ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. గోంగూర చికెన్ కి కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మీకు అంతా వద్దు అనుకుంటే కాస్త తగ్గించి వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసిన తర్వాత ఈ మసాలా పొడులన్నింటినీ, అన్ని చికెన్ ముక్కలకి బాగాతగలేటట్టు చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత బాండిల్ కి మూత పెట్టి ఒక అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గోంగూరను ఉడికించి పెట్టుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజు మూడు గోంగూర కట్టలను తీసుకున్నాను.

గోంగూరను శుభ్రంగా కడిగి. ఫ్యాన్ లో వేసుకుంటున్నాను .ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. 10 లేదా 12 దాకా వేసుకుంటున్నాను. గోంగూర మరీ ఎక్కువ వేసుకున్న గాని, మీకు ఆ గోంగూర పులుపుతనం పోతుంది.కాబట్టి టెస్ట్ మారిపోతుంది .కాబట్టి ఎక్కువ గోంగూర కూడా వేసుకోకూడదు.

Gongura Benefits పుండుకూర గోంగూర పచ్చడి ఔషధం
Gongura Benefits Telugu: పుండుకూర గోంగూర పచ్చడి ఔషధం

ఇందులోనే అర గ్లాస్ నీళ్లు పోసుకుని, ఫ్యాన్ కిమూత పెట్టుకొని ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకొని గోంగూర మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి.ఇప్పుడు పది నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. గోంగూర చూడండి,గోంగూర మొత్తం ఉడికిపోయింది. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఉడికిపోయాయి ,ఇలా ఉడికిపోయిన తరువాత. ఇలా ఒకసారి కలిపేసి, బాగా చల్లారిన తర్వాత,మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, మనంచికెన్ కలిపి పెట్టుకున్న బండిల్ ని స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టుకొని,ఫ్లేమ్ ని first ఐదు నిమిషాలు highఫ్లేమ్ లో పెట్టుకొని ,ఇలామధ్యమధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. చికెన్ లో నుంచి వాటర్ వచ్చి పూర్తిగా ఇంకిపోయి ,ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత, అలా వచ్చేంతవరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉంచుకోండి, తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు చూడండి చిక్కల్లో నుంచి వాటర్ వచ్చి, వాటర్పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యి, మీకు కాస్త ఎర్రగా వేగుతుంది. ఇలా కాస్త ఎర్రగా వచ్చేంతవరకు వేగి oచుకోవాలి.అప్పుడే చికెన్ ముక్క, తినేటప్పుడు బాగా ఉంటుందిటేస్ట్. ఇలా వేగిన తరువాత మనం ముందుగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్న గోంగూరను, పేస్టును వేసుకోవాలి. చి కెన్ బాగా కాస్త ఉ డికి కాస్త ఎర్రగా వేగింది అన్న తరువాతనే, మీరు గోంగూరపేస్టు వేసుకోవాలి. ముందే వేసుకున్నారు అనుకోండి, చికెన్అనేది ఉడకదు ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది .

కాబట్టి, గోంగూర పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత,ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసుకొని మీకు ఎంతో క్వాంటిటీలో వాటర్ పడుతుందో వేసుకోవాలి. వాటర్ కూడా పోసి ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని, ఫ్లేమ్ ని medium flameలో పెట్టుకొని , ఈ బాండిల్ కిమూత పెట్టుకొని, oilseparate అయ్యేంతవరకు బాగా ఉడికించుకోండి. Lost గా కలుపుకునేటప్పుడు మీకు ఉప్పు, కారం ఏదైనాసరిపోలేదుసరిపోయిందో ఈ పులుపుకి తగ్గట్లు, సరిపోలేదు అనుకుంటే ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 60 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను.

ఈ విధంగా Oil సపరేట్ అయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ,చిక్కటి గ్రేవీ లాగా, ఉడికిన తర్వాత లాస్ట్, ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని, మొత్తం బాగా కలిపేసుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ కదా ఇలా తయారు చేసుకోవడం. ఒకసారి ఈ స్టైల్ లో ఒకసారి గోంగూర చికెన్ ని తయారు చేసుకోని తిని చూడండి .మళ్లీ మళ్లీ మీరు ఈ విధంగానే గోంగూర చికెన్ తయారు చేసుకుంటారు.

గోంగూర పచ్చడి తయారీ విధానం:

  • ముందుగా రెండు చిన్న సైజు గోంగూర కట్టలను తీసుకోవాలి.
  • వాటిని ఆకులను బాగా శుభ్రం చేసుకోవాలి.
  • ఒక కుక్కర్ తీసుకొని అందులోనే 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మెంతం కూర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి.
  • ఒక పెద్ద సైజు టమాట ను కట్ చేసుకుని వేసుకోవాలి.
  • రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి.

అందులోనే కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసి, ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని,కుక్కర్ మూత పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్లు వచ్చేవరకు, గోంగూరను మెత్తగా ఉడికించుకోవాలి. కుక్క స్టవ్ మీద నుంచి దించుకున్న తర్వాత, చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే, గోంగూర మెత్తగా ఉడికి పోయి ఉంటుంది. దీనిని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి.

చివరకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి గోంగూర పచ్చడిని. ఇదివారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

గోంగూర పప్పు తయారీ విధానం (Gongura pappu):

ముందుగా రెండు చిన్న సైజు గోంగూర కట్టలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కొని సన్నని రంధ్రాలు ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని, అందులో రెండు కప్పుల కంది పప్పును తీసుకొని శుభ్రంగా, కందిపప్పును రెండు మూడు సార్లు కడుక్కోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసి తీసుకోవాలి.

ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక పెద్ద సైజు టమాట సన్నగా కట్ చేసుకుని అందులోనే వేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మెంతం కూర వేసుకోవాలి, మెంతం కూర ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు.కుక్కర్ కి మూత పెట్టి, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టి 6 నుంచి 7 విజిల్లు వచ్చినంతవరకు గోంగూరను ఉడికించుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత, కుక్కర్ మూత తీసి చూస్తే గోంగూర పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. దీనిని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి.

ఆయిల్ ఎక్కువ వేసుకుంటే గోంగూర పప్పు రుచిగా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ అని వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత, ఒక టీ స్పూన్ పోపు గింజలను వేసుకోవాలి. అవి కాస్త వేగాక రెండు కరేపాకు రెమ్మలను చిటపటలాడేంతవరకు వేయించుకోవాలి, తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలను వేసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా ఉల్లిపాయను తాలింపు లోకి వేసుకోవాలి. రెండు ఎండు మిరపకాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు తాలింపు బాగా దోరగా వేయించుకోవాలి .తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపును గోంగూర పప్పులోకి వేసుకొని బాగా కలుపుకొని రుచి చూడాలి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొవా లి.

గుమగుమలాడే గోంగూర పప్పు రెడీ.

గోంగూర నిల్వ పచ్చడి తయారీ విధానం (gongura pachadi Pickle):

నేను ఇక్కడ పది కట్టల గోంగూర తీసుకున్నాను. పది కట్టల గోంగూర ఆకులను తెంచుకున్నాను. కొద్దిగా కాడ పెట్టుకుని తెంచుకున్నాను. ఆకులు మరీ అంత ముదురుగా లేవు ,మరీ అంతా లేతగా లేవు మీడియం లో ఉన్నాయి. ఈ గోంగూరను శుభ్రంగా ఒకటి నుంచి నాలుగు సార్లు బాగా బకెట్లు వేసుకొని శుభ్రం చేసుకున్నాను. ఎందుకంటే గోంగూర ఇసుకతో ,మట్టితో ఉంటుంది కాబట్టి. తరువాత ఈ గోంగూరను ఒక టవల్ తీసుకొని, దానిమీద పలుచగావేసుకొని ఆరబెట్టుకోవాలి. తడి ఏమి లేకుండా రెండు నుండి మూడు గంటల తో పాటు ఆరబెట్టుకోవాలి.

లేకుంటే ఈ గోంగూర కు తడిఉన్నట్లయితే పచ్చడి ఎక్కువకాలం నిలువ ఉండదు. బాగా రెండు నుంచి మూడు గంటలు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకుంటే 500 గ్రాములు గోంగూర అయింది. నేను ముందుగానే 100 గ్రాముల చింతపండును వేడినీటిలోనానబెట్టుకొని చింతపండు గుజ్జును తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ఫ్యాన్ పెట్టుకొని, అందులో రెండు నుంచి మూడు టేబుల్స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొద్ది కొద్దిగా గోంగూరను తీసుకొని వేయించుకున్నాను. మరీ మొత్తం ఒకేసారి వేసుకోకూడదు. మీ దగ్గర ఉన్న గోంగూరను కొద్దికొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి.

ఎలా అంటే గోంగూర లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చి ఆకు మొత్తం బాగా మగ్గి , దగ్గరకువచ్చేవరకు వేయించుకోవాలి.మధ్య, మధ్యలో కలుపుకొ వ లి.లేకపోతే అడుగున మాడిపోతుంది. చింతపండులో పీచు, నారలు లేకుండా కొద్దిగా నీళ్లు వేసుకుని నానబెట్టి దానిని వడగట్టుకోవాలి. ఈ చింతపండు గుజ్జును చక్కగా ఉడకబెట్టుకోవాలి. అదే ఫ్యాన్ లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం చిక్కగా గుజ్జులాగా తీసుకున్న చింతపండు గుజ్జును ఆయిల్ వేడైన తర్వాత వేసుకొని, చింతపండులోని నీరు మొత్తం బయటికి పోయి ,దగ్గరికి వచ్చే వరకు వేయించుకోవాలి.

చింతపండు గుజ్జు మాడిపోకుండా మధ్యలో కలుపుకుంటూ చిక్కగా గుజ్జు వచ్చేంతవరకు వేయించుకోవాలి .మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చింతపండు గుజ్జును పెట్టుకోవాలి. వేరొక బ్యాండిల్, తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని ,దోరగా వేయించుకోవాలి .మెంతులు వేగుతూ ఉండగా ఇక ఒక నిమిషంలో దించుకుందాము, అనే టైంలో నాలుగు స్పూన్ల ఆవాలు, వేసుకొని సన్నగా దోరగా వేయించుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 100 గ్రాముల ఎండుమిరపకాయలను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి.

ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా చల్లార్చిన తర్వాత 100 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకొని ,ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు , ఆవాలు రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయల్ని తీసుకొని పొట్టు తీసి ,వెల్లుల్లి రెమ్మలు మిక్సీ జార్ లో వేసుకోవాలి. 75 గ్రాముల ఉప్పును వేసుకొని ,వీటిని మొత్తాన్ని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను. 100 గ్రాముల కారం ,75 గ్రాముల ఉప్పును తీసుకొని ఇలా పౌడర్లా పెట్టుకున్నాను .తర్వాత ముందుగా చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కలిపి మొత్తం మిక్సీ పట్టుకోవాలి.

ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరని కూడా ఒకసారి మిక్స్ పట్టుకోవాలి. వీటిని అన్నింటిని కలిపి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత తాలింపు వేసుకోవాలి. ఒక బ్యాండిల్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక టీ స్పూన్ జీలకర్ర మినప్పప్పు, పచ్చిశనగపప్పు దోరగా వేయించుకొని కరేపాకు రెండు రెమ్మలు ,వెల్లుల్లి, ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడికి టేస్ట్ వస్తుంది. వీటిని అన్నింటిని బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి లోకి కలుపుకోవాలి. రుచికరమైన సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర pickel రెడీ.

గోంగూర బెనిఫిట్స్ (Gongura benefits Telugu):

  1. ఇది మన కంటి చూపును మెరుగుపరచడంతో పాటు ,రేచీకటి సమస్యను దూరం చేస్తుంది. గోంగూర లో పొటాషియం అధికంగా ఉంటుంది.
  2. ఇది శరీరంలో రక్త సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. గుండె లాంటి అవయవాలకు,రక్త సరఫరా బాగా జరిగేలా చేసి ,గుండెపోటు మరియు అధిక రక్తపోటు వంటి సమస్యలను చెక్ పెడుతుంది.
  3. గోంగూర మధుమేహ వ్యాధిగ్రస్తుల పాలిట సంజీవని చెప్పవచ్చు. ఇది రక్తంలోని చక్కెర నిల్వల స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది.
  4. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు తరచుగా గోంగూరను ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. ఇందులో ఉండే పోలిక్ యాసిడ్ గుండె ,కిడ్నీ సమస్యలను తగ్గించడంతోపాటు, కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నిరోధిస్తుంది.
  5. అంతే కాకుండా కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. గోంగూర శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లను తగ్గిస్తుంది. అధిక బరువు సమస్యలను నివారిస్తుంది.
  6. ఇందులో ఉండే పీచు పదార్థం ,తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేసి ,మలబద్ధకం మరియు ఊబకా య సమస్యలను తగ్గిస్తుంది. గోంగూర శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది.
  7. గోంగూర ఆకులను మెత్తగా పేస్టులాగా చేసి తలకు పట్టించుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే గోంగూర లో ఉండే సుగుణాలు బట్టతల సమస్యలను కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది.
  8. గోంగూర లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి మరియు విటమిన్ సి దంతాలను ఆరోగ్యంగా మరియు పటిష్టంగా మారుస్తుంది.
  9. అంతేకాకుండా శరీరంపై గడ్డలు తగ్గడానికి గోంగూరను నూరి కట్టుగా కడితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు ,ఆయాసం ,తుమ్ములు వంటి సమస్యలను తగ్గిస్తాయి .
  10. అలాగే నిద్రలేమి సమస్యలను గోంగూర తగ్గిస్తుంది. గోంగూరను పుండుకూరని కూడా అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది.

ఒకటిపట్నం గోంగూర, ఇంకొకటి పల్లెటూరి గోంగూర.

ఈ పల్లెటూరి గోంగూరలో కొద్దిగా పులుపు తక్కువగా ఉంటుంది. పట్నం గోంగూర ఎరుపు రంగును కలిగి ఉండి ఐదు ఆకులను కలిగి ఉంటుంది. ఇదిపుల్లగా ఉంటుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button