ఈత చెట్టు నీరా ఉపయోగాలు
ఈత చెట్టు నుండి ఈ కల్లు లభిస్తుంది. ఈత చెట్టు పుష్పించే మొక్కలలో పామే కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామము ‘ఫినిక్స్ సిల్వెస్టిస్’ ఈత చెట్టును పండ్ల కోసం పెంచుతారు. ఈత చెట్టుకు గల మట్టలను నాలుగైదు సార్లు చెక్కడం ద్వారా ఆ మట్టల నుండి వచ్చే కళ్ళును కుండలు కట్టి సేకరిస్తారు మొదటగా లోపలి మట్టాను చెక్కి వారం రోజులపాటు దానిని అలాగే వదిలిపెడతారు .వారం రోజుల అనంతరం మళ్లీ చెక్కుతారు .అప్పటినుండి కల్లుకారడం మొదలవుతుంది. ఒక ఆల్కహాల్ కలిగిన పానీయము దీనిని తాటి చెట్టు ఈత చెట్టు అనేక చెట్ల నుండి తీస్తారు .పామే కుటుంబానికి చెందినది. చిక్కని తెల్లని ద్రవం .
కల్లుఆఫ్రికా ఖండం ,దక్షిణ భారతదేశము, పిలిపిన్స్, మొదలైన ప్రాంతాలలో వాడుతారు .దీని లాంటి మరికొన్ని మత్తు పానీయాలు బంగు ,సారాయి ,దీనిని వారుణి అని కూడా పిలుస్తారు. మట్టాలకు కట్టి కుండను మూడు రోజుల తర్వాత తీస్తారు. అప్పటి ముందు కారిన కల్లుపులిసిన తర్వాత కారినకల్లు కలిసి మరింత నిషానిచ్చేదిగా మారుతుంది . కల్లు ఆరోగ్యానికి మంచిది అనిచాలామంది చెప్తున్నారు .ఎందుకంటే కల్లుతాటి చెట్టు ప్రకృతి సిద్ధమైనది. మరి ఈతచెట్టు నుండి వచ్చిన పానీయమే .
కొబ్బరి చెట్టు నుంచి వచ్చిన కొబ్బరి నీళ్లు ఎలా వస్తాయో అలానే ఈత చెట్టు నుంచి కల్లు వస్తుంది. ఈత చెట్టు నుంచి కారిన పానీయం 12 గంటలోపు తాగితే దానిని నీరా అంటారు .ఈ నీరా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నీరా 100 ఎంఎల్ తీసుకుంటే ఇది ఏ విధమైన మత్తు పదార్థాoగా ఉండదు.
పూర్వం రోజుల్లో అనారోగ్యంగా ఉన్న వారికి ఈ నీరాని త్రాగించేవారు ఈ నీరాని 12 గంటలు దాటిన తర్వాత బయట ఉంచితే ఇది కల్లుగా మారుతుంది 48 గంటలు నిల్వ ఉంటే దానిని కళ్ళు అంటారు ఈ కళ్ళు పులసిపోయి మరి వాసన వచ్చిన తర్వాత త్రాగితే టేస్ట్ మారుతుంది కాబట్టి ఈ విధంగా టేస్ట్ మారకుండా ఉండేందుకు క్యాల్షియం హైడ్రాక్సైడ్ ను కలుపుతారు త్రాగే వారికి కొద్దిగా ఎక్కువ మత్తు రావడానికి ఈస్ట్ వేసి కొద్దిగా స్టార్చ్ కానీ పంచదార కానీ వేస్తారు ఈస్ట్ ఆల్కహాల్‌ను పొడి చేస్తుంది.
నిల్వ ఉంచి ఈస్ట్ వేసి ఆల్కహాల్ శాతంఇంకా పెంచుతారు. కల్లు ప్రకృతి నుంచి వచ్చింది .కదా అని మంచిది అనుకుంటారు. సారాయితో పోలిస్తే కల్లు మంచిదే నేచర్ నుంచి వచ్చినప్పటికీ కొంత హానిని కూడా కలిగిస్తుంది. కల్లు ఆహారం కాదు.అది ఒక ఆల్కహాల్ కాబట్టి తీసుకోకూడదు
.
కల్లు ఉపయోగాలు:
ఆరోగ్యానికి ఉపయోగం, పుష్కలంగా పోషక విలువలు, అన్ని సమయాల్లో ఉత్పత్తి అవుతుందినీరా. ఈత చెట్టు నుంచి వస్తుంది నీరా ,కానీ కల్లు కాదు .ఆల్కహాల్ కూడా ఉండదు. ప్రకృతి అందించే సహజ సిద్ధమైన, స్వేచ్ఛమైన పానీయం నీర ,పుష్కలంగా పోషక విలువలని నీరాలో ఉన్నాయి. ఆరోగ్యరీత్యా అనేక ప్రయోజనాలు కలిగి ఉంది. ఈత చెట్టుకు ఏడాది పొడవునా నీర దొరుకుతుంది.
అక్టోబర్ నుంచి జనవరి వరకు నాలుగు నెలలు ఎక్కువగా లభిస్తుంది. నీర తాగితే త్రాగితే గ్యాస్, మలబద్ధకం, కిడ్నీలో రాళ్లు సమస్యలు తగ్గుతాయి .నిరా లో ఉన్న మినరల్స్ తో రక్తకణాలు మెరుగుపడతాయి .నీరా ఆల్కహాల్ లేని సహాసిద్ధమైన ఆరోగ్య ద్రావణం. ప్రకృతి ప్రసాదం నీరా. నీరా సహాసిద్ధమైన శక్తినిచ్చే ఎనర్జీ డ్రింక్ గానే కాకుండా, జీర్ణకోశ సంబంధమైన ఒక ఔషధం లాగా కూడా పనిచేస్తుంది .కంటి చూపును చాలా వరకు మెరుగుపరుస్తుంది .నీరాలో ఉండే ప్రోబయాటిక్స్ ,ఇమ్యూనిటీని ,నిరోధక శక్తిని పెరగడానికి దోహదం చేస్తుంది. సుక్రోజ్ ఉండటం వల్ల డయాబెటిక్ పేషెంట్లు కూడా నీరాను నిర్భయంగా తీసుకోవచ్చు.
నీరా ఎలా తయారవుతుంది?
నీరా తాటి చెట్టు ,ఈత చెట్టు తో పాటు ఖర్జూర, జీరిక ,చెట్టు నుంచి వస్తుంది. అయితే తెలంగాణలో మాత్రం ఈత చెట్టు ,తాటి చెట్టు నుంచి మాత్రమే నీరాను ఉత్పత్తి చేస్తారు. నీ రాను చెట్టు నుంచి స్వీకరించే పద్ధతి ప్రత్యేకంగా ఉంటుంది, దీనికి కుండను తినే సున్నపు తేటతో శుభ్రంగా కడిగి, అది ఆరిన తర్వాత ,కొంత సున్నపు తేటను కుండలో వేసి ,సాయంత్రం సమయంలో చెట్టుకు అమర్చుతారు.
తెల్లవారుజామున నాలుగున్నర తర్వాత నీరను సేకరిస్తారు. అలా సేకరించిన నీరాను రెండు మూడు గంటల్లో సేవించాలి. లేదంటే ఐస్ బాక్స్‌లలో భద్రపరిచి లేదా ఇంట్లో ఫ్రిజ్‌లో ఉంచితే రంగు గానీ, రుచి గానీ మారకుండా తాజాగా ఉంటుంది .కొబ్బరి నీళ్ళ కంటే ఇది ఎంతో శ్రేష్టంగా రుచికరంగా ఉంటుంది. దీని కల్లుగా గుర్తించరు .ఇందులో మత్తు పదార్థం ఉండదు .నిషా కూడా రాదు. కంటి చూపు క్యాన్సర్ నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది .ముఖ్యంగా నీర త్రాగితే ఫ్లోరోసిస్ త్రీవత తగ్గుతుంది.
పోషక విలువలు:
100 మిల్లీలీటర్ల నీరలో 264 కెసిల్ ప్రోటీన్, పిండి పదార్థం, సున్నా శాతం కొవ్వు, లవణాలు, ఐరన్ ,మెగ్నీషియం, సున్నా శాతం కొవ్వు, లవణాలు ,ఐరన్ ,మెగ్నీషియం ,జింక్, క్యాల్షియం ,సోడియం పొటాషియం ,ఉంటాయి .మినరల్స్ లో ,ఎక్స్కారిబిక్ యాసిడ్ ,రీబోఫ్లవిన్లు, మెండుగా ఉంటాయి. తాటి ఈత చెట్లు కేవలం కల్లును ఉత్పత్తి చేసే వృక్షాలుగానో మనకు తెలుసు కానీ అనేక పోషక ఆరోగ్య గుణాలున్న అరుదైన దేశీయ ఆరోగ్య పాణ్యాన్ని నీరా మనకు అందిస్తుంది. ఆల్క హాల్ ఏమాత్రం లేని దేశ పానీయం.
నీరా కొన్ని వ్యాధులకు చెక్ పెడుతుంది:
లివర్ సంబంధిత వ్యాధులకు నివారిణిగా పనిచేస్తుంది. కామెర్లు, ప్లాటి లివర్ , లివర్ రోసిస్ నుంచి నీరా కాపాడుతుంది. గుండె పని చేసే విధానాన్ని మెరుగుపరుస్తుంది. కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. వచ్చిన రాళ్లను కరిగిస్తుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో మినరల్స్ రక్త కణాలను వృద్ధి చేస్తాయి. ఇది కడుపులోని గ్యాస్ , అసిడీ టీ క్యామెర్లు ,లివర్ రోసి స్, గుండె విధానాన్ని మెరుగుపరుస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.
కల్లుఒక ఆల్కహాల్ కలిగిన పానీయము. దీనిని తాటి చెట్టు, ఈత చెట్టు నుంచి తీస్తారు .పామే కుటుంబానికి చెందిన అనేక చెట్లనుండి తీస్తారు .ఇది చిక్కని, తెల్లని ద్రవం ,కల్లు,ఆఫ్రికా ఖండము ,దక్షిణ భారతదేశము ఫిలిపిన్స్ ,మొదలగు ప్రాంతాలలో వాడుతారు. దీని లాంటి మరికొన్ని మత్తు పానీయాలు తీస్తారు. దీనిని వరుని అని కూడా పిలుస్తారు .ఒకప్పుడు గ్రామ ప్రజలు మాత్రమే కళ్ళు తాగుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు పట్టణాలు ,పెద్దపెద్ద నగరాల్లో ఉండేవారు సైతం కల్లుతాగుతున్నారు .
తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. ఒక తెలంగాణలో అయితే పండుగలు, పెళ్లిళ్లు జరిగేటప్పుడు కల్లు, .త్రాగుతారు. కల్లు ను ఒక ఔషధం లాగా భావిస్తారు. కల్లుతాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అనేకమంది నమ్ముతారు. అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది . కల్లు లో క్యాన్సర్ ను నాశనం చేసే గుణం ఉంటుంది.
వీటి నుండి కల్లుతీస్తారు. ఈత చెట్టు ,ఖర్జూరచెట్టు ,చూడడానికి ఒకేలాగా ఉంటాయి. ఆకులు కాండం, వేర్లు మొదలైనవన్నీ కూడా ఖజురా ఈత చెట్లు ఒకే విధంగా ఉంటాయి .ఈతాకుల చివరిలో సూది వంటి సన్నాటి ముళ్ళు ఉంటాయి. ఇవి పశువుల నుండి రక్షణగా ఉంటాయి. ఈత పండు కొద్దిగా పొగరు తీపి కలిపినా రుచిని కలిగి ఉంటాయి .ఈ చెట్టు నుంచే గీత కల్లు బెల్లం తయారు చేస్తారు.