లిచి పండు ప్రయోజనాలు, నష్టాలు తెలుసుకుందాం?
లిచి పండు సోప్ బెర్రీ కి చెందిన మెనో టైపింగ్ టాక్సీస్ కుటుంబానికి చెందినది . లిచి పండులో ఒకే ఒక్క జాతి ఉంటుంది. లిచి పండు నైరుతి, ఆగ్నేయ, పజియాన్, గ్యాంగ్ డాంగ్, యున్నాం నాన్, ప్రావిన్స్ గల ఉష్ణ మండలంలో పెరిగే చెట్లు. ఈ పండ్ల పంటను 11వ శతాబ్దం నుండి సాగు చేస్తున్నారు. ఎంతో మంచి వాసన కలిగి ఉంటుంది. లిచి చైనీస్ అనే శాస్త్రీయ నామంతో పిలవబడుతుంది. ర్యాంక్ అనే జాతి నుండి పుట్టింది.
లిచి పండులోని ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీయకుండా రక్షిస్తాయి . శరీరంలో అనేక తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడుతాయి. విటమిన్ సి ప్లవనాయిడ్లు ఎక్కువగా ఉన్న పండ్లలో లిచీ పండు ఒకటి.
లిచి ఉపయోగాలు:
గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి ప్రమాదకరమైన రోగాలు రాకుండా మనకెంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. లిచి పండులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే మలినాన్ని విష పదార్థాలను తీసివేస్తాయి. లిచీ పండు లోని విటమిన్ సి ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేసి, తెల్ల రక్త కణాలను ఎక్కువగా పెంచుతుంది. తెల్ల రక్త కణాలు పెరగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు ,దగ్గు, స్టోక్ లాంటి ప్రమాదాలను అదుపు చేస్తుంది. ఈ పండులో కొలెస్ట్రాల్ ,సోడియం ఎక్కువగా ఉండదు. ఇవి లేనందువలన స్టోక్, గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు, రక్తహీనత, ఆతేరో స్క్వేరోసిస్ వ్యాధులు లాంటి ప్రమాదాలు రాకుండా కాపాడుతుంది. లిచి పండులో విటమిన్ బి త్రీ ఉటుంది. ఈ విటమిన్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచి హానికరమైన ట్రైగ్లిజెరైడ్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి జీవ క్రియను పెంచడానికి దోహదపడుతుంది.
జీవక్రియ పెరగడం వలన క్రొవ్వులు, కార్బోహైడ్రేడ్లు, ప్రోటీన్ల శోషణను పెంచడానికి ఉపయోగపడుతుంది. బరువును తగ్గిస్తుంది. లిచీ పండులో ఫైబర్ ఉండడంవల్ల జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసి మలబద్దకాన్ని తగ్గించి కడుపున శుభ్రం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండ్లని తినడం వలన షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఈ పండు లో ఎక్కువ శాతం నీరు ఉండడం వలన వేసవిలో చల్లగా, హైడ్రేటుగా ఉంచి డిహైడ్రేషన్ సమస్య నుండి ఉపశమనాన్ని చేకూరుస్తుంది. లిచీ పండు లోని హైపోటో ప్రొటెక్టివ్ ఏజెంట్లు కాలేయ సంబంధిత వ్యాధులను నయం చేయడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. లిచి పండులో విటమిన్ ఏ విటమిన్ సి ఉండడం వలన చర్మం తెల్లబడడం, మొటిమలు, చర్మం ముడతలు రాకుండా చేస్తుంది.
లిచి పండు వలన కలిగే నష్టాలు:
లిచీ పండు తినడం వలన ఎన్ని లాభాలో అదేవిధంగా అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. స్ట్రాబెరీ రూపంలో అందంగా ఉండే లిచీ పనులు ఎంత రుచిగా ఉంటాయో అంత ప్రమాదకరంగా కూడా ఉన్నాయి. లిచీ పండ్లను ఎక్కువగా తినడం వలన ప్రాణాలకు ప్రమాదం కావచ్చు. ఇందుకు కారణం లిచి పండులో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు. ఇవి బయట నుండి కలిపినవి కావు. సహజ సిద్ధంగా లిచీ పండులో ఏర్పడే రసాయనాలు. అందువలన లిచిపండ్లను ఎక్కువగా తింటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. సాధారణమైన పండ్ల కంటే లిచీ పండ్లు ప్రత్యేకమైనవి. వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపున తినకూడదు.
అలాగే రాత్రి పడుకునే ముందు తినకూడదు. పచ్చిగా ఉండి ఎర్ర రంగు వేసి అమ్మే వాటిని అసలు తినకూడదు. ఇలాంటి వాటిని తినడం వలన ప్రాణనష్టం జరుగుతుంది. లిచీ పండ్లను చిన్నపిల్లలకు దూరంగా ఉంచమని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ పండులో (A ES) ఎక్యూట్ ఏ న్ సేఫలైటీస్ సిండ్రోం అనే రసాయనం వల్ల మెదడువాపు సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
38 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండి 65 నుంచి 80 శాతం తేమ ఉన్నట్లయితే ఉష్ణోగ్రతలు కూడా లిచీ పండ్లను విషపూరిథం చేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ముజాఫర్పూర్ లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీలోని గోపాల్ శంకర్ అనే సీనియర్ డాక్టర్ 1995లో దీనిపై పరిశోధనలు చేసి తెలిపారు. లిచీ పండు లో ఉండే మితిలిన్ సైక్లోప్రోపిల్ గ్లైసిన్ అనే రసాయనం రక్తంలో చక్కెర శాతాన్ని పూర్తిగా తగ్గించి ప్రమాద స్థాయికి చేరుస్తుంది.
ఖాళీ కడుపుతో తిన్నవారిలో, పౌష్టిక ఆహార లోపం ఉన్నవారు లిచి పండు తినడం వలన చక్కెర స్థాయి పూర్తిగా తగ్గిపోతాయి. ఈ పండులోని (MC PG) రసాయనం మెదడు పనితీరుపై ప్రభావితం చేస్తుంది. ముజాఫర్ పూ చిన్నారులు ఎక్కువగా మరణించారు. లిచీ పండ్లు ఎక్కువగా తినడం వలన లిచ్చి పండ్లలో ఉండే విషపూరితమైన రసాయనం వీరిపై ఎంతగానో ప్రభావం చూపించిందని అందువలనే మరణించారని వైద్యులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏడుగురు శాస్త్రవేత్తలు కలిసి ఒక బృందంగా ఏర్పడి లిచీ పనులను పరీక్షించి లిచీ పనులు అతిగా తినడం వలన విషపూరితమవుతుందని ధృవీకరించారు.