Dengue Fever:వర్షాకాలం సీజన్లో దోమల నుంచి వ్యాపించే రోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మరణాలను కూడా చవిచూడాల్సి వస్తుంది.దోమల వలన మలేరియా, ఫైలేరియా,డెంగ్యూ లాంటి రోగాలు సంభవిస్తాయి. వీటిలో డెంగ్యూ అత్యంత ప్రమాదకరంగా పరిగణించబడుతుంది.డెంగ్యూ వ్యాధి డెంగ్యూ వైరస్ వలన ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.
డెంగ్యూ వైరస్ ను ఆడ దోమ అయినటువంటి ఏడిస్ ఈజిప్టే ఒకరి నుంచి మరొకరికి వ్యాధిని సంక్రమింప చేస్తుంది.డెంగ్యూ వ్యాధిని బ్రేక్ బోన్ ఫీవర్ అన్ని అంటారు.డెంగ్యూ వ్యాధి లక్షణాలు: ఈ వ్యాధి సోకిన వారు అధిక జ్వరం,విపరీతమైన తలనొప్పి,కండరాల నొప్పి,కీళ్ళ నొప్పులు, వాంతులు చేసుకోవడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం,మలంలో రక్తం రావడం, నీరసించి పోవడం,ముఖము పాలిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రధానంగా ఈ వ్యాధి మానవ శరీరంలోని రక్త కణాల ప్లేట్లెట్ ల పై ప్రభావం చూపి వాటి సంఖ్య విపరీతంగా తగ్గిస్తుంది.ఈ కారణం చే డెంగ్యూ వ్యాధి వ్యాధిగ్రస్తులో మరణం కూడా సంభవించును. డెంగ్యూ సోకిన వారు ప్లేట్ లెట్ ల వృద్ధి కొరకు బొప్పాయి ఆకు రసం ను,బొప్పాయి పండు జ్యూస్ ను తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు.
గర్భిణీ స్త్రీలకు డెంగ్యూ వైరస్ సోకినచో పుట్టబోయే శిశువుపై ప్రభావం చూపి బిడ్డ ఎదుగుదలలో లోపం ను కలిగించును. మరియు ప్రసవ సమయం కన్నా ముందుగానే ప్రసవించెదరు. డెంగ్యూవ్యాధి రాకుండా ముందస్తుగానే డింగ్వా క్సియా టీకాను 9 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారికి వేయవచ్చును.
ముఖ్యంగా దోమల నుంచి రక్షణగా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, సాధ్యమైనంత వరకు ఇంటిలో నీరు నిల్వ ఉంచుకున్న పాత్రలపై, బకెట్లపై, నీటి డ్రమ్ములపై మూత ఉండే విధంగా చూసుకోవాలి. ఏడిస్ దోమ ఉదయం సాయంకాలం సమయంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.ఆ సమయంలో దోమకాటు కు గురి కాకుండా శరీరం మొత్తం కప్పి ఉంచే దుస్తులను ధరించుట మంచిది. ఇండ్లలో వాడి పారేసిన టైర్స్,ట్యూబ్స్,కొబ్బరి బొండాలు లేకుండా చూసుకోవాలి వీటిలోనే ఏడీస్ దోమ తమ సంతానవృద్దిని పెంపొందించుకుంటుంది.రాత్రి వేళల్లో దోమల నుంచి రక్షణగా దోమతెరలను, కాయిల్స్ ను,జల్ ను వాడవలెను. ప్రపంచం మొత్తం మీద డెంగ్యూ వ్యాధితో మరణాల రేటు సరాసరి 1000 నుంచి 2000 దాకా ఉందని WHO తెలియజేసింది. ఇండియాలో డెంగ్యూ ఫీవర్ సుమారు సంవత్సరంలో 2 లక్షల వారికి వస్తూ ఉందని, మరణాలు రేటు సుమారు 100 వరకు ఉందని కేంద్రప్రభుత్వం తెలియజేసింది.