Disease

Honey Uses: దగ్గు,జలుబుకు ఇంటి వైద్యం

వర్షాకాలం మొదలవగానే అనేక రకాల వ్యాధులు మనపై దాడి చేస్తాయి. అందులో మొదటగా వచ్చేది దగ్గు,జలుబు. వర్షాకాలంలో వీచే చల్లగాలి వలన, చల్లని నీరు త్రాగడం వల్ల, వర్షంలో ఎక్కువగా తడవటం వల్ల దగ్గు,జలుబు వస్తుంది.

గొంతులో నొప్పి, ముక్కుదిబ్బడ, గొంతులో గరగర దగ్గు, జలుబు లక్షణాలు. ఇవే కాక వీటివల్ల క్రమంగా జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కూడా వస్తాయి. మనం ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే జలుబు దగ్గు నుండి ఉపశమనం కలిగి బయటపడవచ్చును.

శరీరానికి వేడి చేసేవి, చాలాకారంగా ఉన్న ఆహారం, టాబ్లెట్లు ఏవి తీసుకోకూడదు. వీటి ఫలితంగా  రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.

బాగా మరిగించిన నీటిని టీ తాగినట్టుగా గంటకొకసారి త్రాగాలి. ఇలా చేయడం వల్ల గొంతులో గరగర తగ్గుతుంది. నీటిలో పసుపు కానీ ఉప్పు కానీ వేసి కొద్దిగా వేడి చేసి అ నీటిని గొంతులో పోసుకొని పుక్కిలిస్తే గొంతులో ఉండే మంట, నొప్పి తగ్గి కొంచెం ఉపసమానంగా ఉంటుంది. ఈ విధంగా రోజుకు రెండు మూడు సార్లు చేయాలి. అదేవిధంగా బాగా మరిగించిన నీటిలో కొంచెం పసుపు వేసి లేదా పెయిన్ బాంబు వేసి ఆవిరి పట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఇవే కాక ఆహారం ద్వారా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చికెన్ సూప్ తాగడం వల్ల ఎంతో ఉపసమనంగా ఉంటుంది. నిమ్మకాయ , నారింజ పండ్లను వాడటం వల్ల త్వరగా జలుబు అదుపులో ఉంటుంది. ఎండుమిర్చి వాడటం వల్ల కూడా శ్వాస రంధ్రాలు క్లియర్ అవుతాయి. అదేవిధంగా అల్లం నీటిలో వేసి బాగా మరిగించి కొంచెం తేనె కలిపి తీసుకుంటే త్వరగా ఉపశమనం పొందవచ్చు.

గ్రీన్ టీ కూడా తాగవచ్చు. కాఫీ అసలు తాగకూడదు. వెల్లుల్లిని కూడా ఉడికించి తేనె కలిపి కషాయంగా తీసుకుంటే చాలా మంచిది. ఈ విధంగాచేయటం ద్వారా త్వరగాతగ్గిపోతాయి. చిటికెడు వాము నమిలి దవడలో పెట్టుకుంటే పొడి దగ్గును అదుపు చేయవచ్చు. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వాటిని ఎదుర్కొనే చెక్కను పొడిచేసి తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఇదే విధంగా మిరియాలు కూడా వాడవచ్చు. తులసి ఆకులను కొంచెం నీటిలో వేసి మరిగించి ఆ నీటిని కషాయంలో వాడడం వల్ల జలుబు త్వరగా తగ్గిపోతుంది. ఇటువంటి సమయంలోఅన్నానికి బదులు నీటిని బాగా తాగుతూ అదేవిధంగా వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి త్రాగటం ద్వారా జలుబు దగ్గును త్వరగా నివారణ చేసుకోవచ్చు.ఈ విధంగా ఇంటిలోనే జలుబును ,దగ్గును మనం నివారించుకోవచ్చు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button