Disease

Monkeypox: భారతలో మంకీ ఫాక్స్ వైరస్ విస్తరిస్తుందా?

మంకీ ఫాక్స్ భారతదేశంలో కూడా వ్యాపించడం మొదలైంది. తాజాగా భారత దేశంలో మూడు కేసులు నమోదయ్యాయి. కోల్కతాలో మొదటి కేసు నమోదు  అవ్వగా మిగిలిన రెండు కేసులు కేరళలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బి అలర్ట్ ను ప్రకటించింది . భారతదేశంలో మంకీ ఫాక్స్ప్రారంభం అయ్యిందని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దానికి సంబంధించిన సమాచారం వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వం తెలియజేసింది. మంకీ ఫాక్స్ వైరస్ లక్షణాలు కలవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు తెలియజేస్తున్నాయి. దీనిపై ఆందోళనలు చెందవలసిన అవసరం లేదని జాగ్రత్తలు పాటించడం వల్ల వైరస్ ను అదుపులోకి తీసుకురావచ్చు అని భారతీయ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది.

MONKEY POX

మంకీ ఫాక్స్ వైరస్ సోకినప్పుడు ఉండే లక్షణాలు:

చలితో కూడిన జ్వరం ఎక్కువగా ఉండటం. సోషరశకనుపుల వాపు ఎక్కువగా ఉండటం. ఆయాసం, దురదతో కూడుకున్న మొటిమలు లేదా దద్దుర్లు మొహం, శరీరం అంతా రావడం. అంటూ వ్యాధి లాగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించటం. వ్యాధి నిర్ధారణకు ఒకటి నుంచి రెండు వారాల సమయం పడుతుంది. ఈ వ్యాధి సోకిన వారికి రెండు నుంచి  నాలుగు వారాల వరకు ఈ వ్యాధి ఉంటుంది.

మంకీ ఫాక్స్  ఎలాంటి ప్రాణాంతకం కాదు. ఈ వ్యాధి కరోనా లాగా విస్తరించినప్పటికీ మరణాల సంఖ్య తక్కువగానే ఉంటుంది. వ్యాధి తీవ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారిలో త్వరగా తగ్గుతుంది.

నివారణ చర్యలు పాటించడం వల్ల ఈ వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చు.

స్మాల్ ఫాక్స్ నిర్మూలన కోసం వాడి వ్యాక్సిన్ లను వాడి రక్షణ పొందవచ్చు అని ఆరోగ్య సంస్థలు తెలిపాయి. ఈ వ్యాధి సోకిన వారితో దూరం పాటించడం. వ్యాధిగ్రస్తులు తాకిన వాటిని ముట్టుకోకుండా ఉండడం. మంకీ ఫాక్స్ సోకిందని అనుమానించే వారితో ఆహారం నీళ్లు పంచుకోకూడదు. తరచూ చేతులను హ్యాండ్ వాష్ తో శుభ్రంగా కడుక్కోవాలి. బయటికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. వ్యాధి సోకిన వారిని కుటుంబంతో  కలవనీయకుండా ప్రత్యేక గదిలో ఉంచడం మంచిది. ఇటువంటి చర్యలు పాటించడం వల్ల మంకీ ఫాక్స్ వ్యాధి నుండి ప్రాణాలను రక్షించుకోవచ్చు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button