Fat

Heavy Weight: అధిక బరువు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు

నేటి ఆధునిక సమాజంలో స్థూలకాయత్వం ఒక ప్రధానమైన సమస్య. ఉండవలసిన బరువు కన్నా పది శాతం బరువు ఎక్కువగా ఉంటే దానిని స్థూలకాయం అని చెప్పవచ్చు. వెయిట్ ఎక్కువగా పెరగడం వల్ల గుండె సంబంధిత జబ్బులు, డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. కెలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల స్థూల కాయం వస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. హార్మోన్ల కారణాలు పక్కకు పెడితే ఎక్కువగా తినడమే దీనికి ప్రధానమైన కారణం. ఈ వ్యాధి ఎక్కువగా స్త్రీలలో వస్తుంది. బరువు పెరగడాన్ని కూడా రెండు రకాలుగా చెప్పవచ్చు. 1.చిన్నతనం నుండి బరువు పెరగడం. దీనిని డెవలప్మెంట్ ఒబిసిటీ అంటారు.

2. రియాక్టివ్ఒబెసిటీ. ఇది పరిస్థితుల ప్రభావం వల్ల వస్తుంది. ఇంటి నుండి దూరంగా వెళ్లిపోవడం, అనుకోకుండా అయినవారు చనిపోవడం లాంటి వాటి వల్ల ఎక్కువగా తినడం వల్ల వస్తుంది. 

స్థూలకాయత్వం తగ్గించుకునే మార్గాలు:

బరువుతగ్గాలంటే వారి సంకల్పం ముఖ్యం. అసలు తినకుండా ఉండిపోవడం కాకుండా తక్కువగా తినటానికి అలవాటు చేసుకోవాలి. బరువులను తరచూ చూసుకుంటూ ఒకచోట రాసి పెట్టుకోవాలి. అన్నాన్ని బాగా తగ్గించాలి, స్వీట్లు, చాక్లెట్స్, కేకులు, వేపుడు కూరగాయలు, అరటి పండ్లు, యాపిల్ పండ్లు, ఐస్ క్రీములు, నెయ్యి, నూనెలు బాగా తగ్గించాలి. కాఫీ కన్నా టీ తాగటం మంచిది అని వైద్యులు చెప్తున్నారు. రాగి జావా, ఓట్స్ కూడా తినవచ్చు. ఉదయం పూట టిఫిన్ కి బదులు రాగి జావా, ఓట్స్, పచ్చి కూరగాయలు (క్యారెటు, బీట్రుట్) పండ్లు, జ్యూస్ లు తాగటం అలవాటు చేసుకోవడం వల్ల చాలా ఫలితం ఉంటుంది. ఎత్తును బట్టి ఎంత బరువు ఉండాలో చూసుకొని ఎనిమిది వందల నుండి 1200 కిలో కెలరీలు ఉన్న ఆహారం మాత్రమే తీసుకుంటే చాలా మంచిది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button