FruitsPlants

Fig Fruit Benefits: Angeer అత్తిపండు రోగాల భరతం పడుతుంది

Fig Fruit Benefits: మన శరీరానికి అన్ని రకాల పోషక పదార్థాలు అందుతూనే ఆరోగ్యంగా ఉంటాము. ఇందుకోసం మంచి ఆహారంతో పాటు మంచి పండ్లు కూడా చాలా అవసరం ఈ పండ్లు .సహజసిద్ధమైన పోషకాలను విటమిన్లను, ఖనిజాలను ,అనేక ఔషధ గుణాలను నిక్షిప్తం చేసుకుని ఉన్నాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండ్లు కొన్నిసార్లు ఉచితంగానే దొరుకుతాయి. కొన్నిసార్లు మార్కెట్లలో చౌక ధరకు లభిస్తాయి.

Angeer Fruit Benefits

మేడి చెట్టును సంస్కృతంలో ఆవుదుంభా వృక్షం అంటారు. దత్రే తామ స్వరూపం, కృతిక నక్షత్రం వారికి అదృష్ట వృక్షం. దీనిని అంజీరని, అతి పండు అని కూడా పిలుస్తారు. ఇంగ్లీషులో fig fruit అంటారు. పైకస్ జాతికి చెందిన మేడిపండు. మోరేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం పైకస్ రాసేమో సహ . మేడిపండు మేలైన పోషకాలను కలిగి ఉంది. ఇందులో చెడు చేసే కొవ్వు, పిండి పదార్థాలు, మరియు సోడియం వంటి లవణాలు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మంచి చేసే ఖనిజాలు, పీచు పదార్థం ,విటమిన్లు, ఎక్కువగా ఉన్నాయి. ఎండు అంజీరా లో అయితే ప్రోటీన్ కూడా ఎక్కువ. తక్కువ మోతాదులో చక్కెరలు ఉన్నందున డయాబెటిక్ ఉన్నవారు కూడా తినదగినది.

శారీరక శక్తిని తగ్గించి ,రోగ నిరోధక శక్తిని పెంచుతుంది .రోగాల భరతం పడుతుంది. రక్తంలోని చక్కెర నిల్వల్ని నియంత్రిస్తుంది. వ్యాధిగ్రస్తులకు నేస్తం ఈ పండు. మేడి పండు తో పాటు వాటి ఆకులు కూడా షుగర్ ను నియంత్రిస్తుంది. ఆకులతో కషాయం చేసుకొని త్రాగితే ఇన్సులిన్ మోతాదును నియంత్రిస్తుంది. ఈ పండ్లలో a,b1b2 విటమిన్లు ,క్యాల్షియం, ఐరన్ ఫాస్పరస్, మెగ్నీషియం ,పొటాషియం లతోపాటు ,ఫ్లవనాయిడ్లు ఉన్నాయి. ఎండు అంజీర లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, ఆంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉన్నాయి. ఈ పండ్లలో క్యాల్షియం అధికంగా కలిగినటం వలన దంతాలకు ,ఎముకుల పటిష్టకు ఆరోగ్యానికి మంచిది.

రోజు మూడు పళ్ళు తింటే చాలు .రోజు పాలు తాగడం అవసరం ఉండదు .రక్తహీనతను తొలగిస్తుంది. నోటిలో పుండ్లు ,నాలుక మంట వాటికి అంజీర పండ్లుదివ్య ఔషధం. ఎదిగే పిల్లలకు రోజు అంజీర పండు ఇవ్వడం వలన బుద్ధి మాంద్యం తగ్గుతుంది. తెలివితేటలు పెరుగుతాయి.వయసులో ఉన్న పిల్లల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. అలాంటప్పుడు రోజు ఒక అంజీర పండు తినడం వల్ల ముఖంపై మొటిమలు తగ్గిపోతాయి. అందుకేనేమో రాణి ధియోపాత్ర ఈ పండ్లు కోసంఎంతో ఇష్టపడేది .

Anjeer Fruit Telugu( అత్తిపండు):

ఈ పండ్లు ఆధునిక మానవులు కూడా రుచి చూసినారు. వృద్యాప చాయలను ముఖంపై దరిచేరనీయవు. మేడిపండు ఊపిరితిత్తుల సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. దగ్గు ,ఆస్తమా వ్యాధిగ్రస్తులకు మంచి దివ్య ఔషధం ఈ అత్తిపండు. ఈ అత్తిపండు తినడం వల్ల కఫం తగ్గిస్తుంది. ఆయాసం ,నీరసాన్ని దూరం చేస్తుంది. శ్వాసక్రియ బాగా జరిగేటట్లు చేస్తుంది. ఈ పండ్లతోపాటు వీటి ఆకులలో కూడా పొటాషియం అధికంగా ఉంటుంది. ఆకులతో కషాయం చేసి త్రాగడంవలన గుండె జబ్బుల నుండి రక్షణ కలిగిస్తుంది. ఎండు అంజీర లో ఉన్న ఒమేగా 3ఒమేగా 6 ఆసిడ్ మరియు పాలి ఫినాల్ కలిగి ఉండటం వలన హై బీపీని తగ్గించి ,కంట్రోల్లో ఉంచుతుంది, హై టెన్షన్ను కూడా తగ్గిస్తుంది.

Fig Fruit Benefits  Angeer అత్తిపండు

ఎటు చూసినా మేడిపండు గుండె కి మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. మలబద్ధకం ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. వాటిలో ముఖ్యమైనవి మొలలు, కొలన్ క్యాన్సర్ ,బరువు పెరగడం, వంటివి అంజీరాల లో అధికంగా ఉన్న పీచు పదార్థం ఈ సమస్యలన్నింటిని దూరం చేస్తుంది. రాత్రిపూట 3 అంజీరాల ను నీటిలో నానబెట్టి ఉదయం తినడం వల్ల మొలలు తగ్గుతాయి. ఈ విధంగా ఉదయం నానబెట్టిన అంజీర పండ్లు ను రాత్రి తినడం ద్వారా ఈ విధంగా రెండు నెలల పాటు తినడం వల్ల మొలలు తగ్గుతాయి.

వీటిలో అధిక మొత్తంలో సెల్లులోజ్ ఉంటుంది. అంతేకాకుండా చిన్నచిన్న గింజలు పేగు లోపల గోడలను సున్నితంగా ఉత్తేజ పరచడం వలన పేగు కదలికలు జరిగి విరేచనాలు సాఫీగా అయ్యేలాచేస్తుంది. అందువల్ల మల విసర్జన సమయంలో ము క్కవలసిన అవసరం లేదు. కోలన్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. పీచు పదార్థం ఉండటం వల్ల నిత్యం వీటిని తినడం వలన బరువు తగ్గుతారు. రెండు మేడిపండ్లను చిన్నచిన్న ముక్కలుగా చేసి వేడి చేసిన నీటిలో ఉడికించి పరిగడుపున తాగడం వలన కిడ్నీలో రాళ్లు తగ్గుతాయి.

Fig Fruit అంజీర పదార్థాల లాభాలు

అంజీర పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది, అంజీరా లో పొటాషియం, సోడియం బాగా లభిస్తాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది అంటే బీ.పీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. భోజనానికి ముందు రెండు మేడిపండు తింటే వారిలో రక్తం బాగా పెరుగుతుంది. మలేరియా డెంగ్యూ జ్వరం బారిన పడిన వారికి తినిపిస్తే వెంటనే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది.

శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. భోజనం తర్వాత వీటిని తీసుకుంటే రక్తంలో షుగర్ స్థాయి పెరగనివ్వదు. క్యాల్షియం ఎక్కువగా ఉండటంవల్ల ఎముకలు దృఢంగా అవుతాయి. ఎముకలు విరిగిన వారికి వీటిని తినిపిస్తే ఎముకలు తొందరగా అతుక్కుంటాయి. గొంతు నొప్పి ఉన్నవారు అంజీర పండ్లనుతింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. దగ్గు, జ్వరం, కడుపునొప్పి ఉంటే అంజీర పండ్లను తినడం వలన వెంటనే ఉపశమనం కలుగుతుంది.

దుష్ప్రభావాలు:

మేడి పండుని పోషకాల గని అనికూడా చెప్పవచ్చు. కానీ మేడిపండును అధికంగా తినడం వల్ల కొన్ని ప్రమాదాలు సంభవించవచ్చు. అంజీర పండును డయాబెటిక్ పేషంట్ రోజుకి మూడు మాత్రమే తీసుకోవాలి అధికంగా తినడం వల్ల షుగర్ లెవెల్స్ అమాంతంగా పడిపోతాయి. హైపో గ్లైసేమియాతో బాధపడే వారు కూడా అంజీరాను తీసుకోకూడదు blood warfarin,aspirin వంటి టాబ్లెట్స్ ఉపయోగిస్తున్న వారు అంజీర పండును తక్కువగా తీసుకోవాలి. అంటే రక్తం పలుచగా కావడానికి ట్రీట్మెంట్ తీసుకునేవారు డాక్టర్ల సలహా మేరకు అంజీర పండును తీసుకోవాలి.

ఎందుకంటే furcoramines అనేఎంజాయ్ మరియు కె విటమిన్ ఎక్కువగా ఉండటం వలన బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అంజీర పండ్లను ఎక్కువ తీసుకోవడం వల్ల లూజ్ మోషన్స్ ,కడుపు ఉబ్బరం, ఆయాసం, అలర్జీ ,ఆస్తమా , వంటి సమస్యలు ఎక్కువవుతాయి కాబట్టి మితంగానే అంజీర పండ్లనుతీసుకోవాలి. పిల్లలు లేని వారు కూడా తక్కువ మోతాదులోనే అంజీర పళ్ళను తీసుకోవడం మంచిది.

అంజీర పండులో క్యాలరీస్;

పూర్వం రోజుల్లో పట్టణాల్లో మాత్రమే లభ్యం అయ్యే ఈ అంజీర పండ్లు కానీ ఇప్పుడు అన్ని ప్రాంతాలలో కూడా ఈ పండ్లుదొరుకుతున్నాయి. అంజీర పండు కొంచెం వగరు, కొంచెం తీపి, కొంచెం పులుపు కలిగి ఉండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆకర్షణీయమైన రంగు రుచి లేకపోవడం వలన మార్కెట్లలో కనిపించిన వీటిని తీసుకోము. మరి రూపం నచ్చకనో లేక గింజలు అధికంగా ఉండటం వలన ఇష్టపడరు తెలియదు కానీ అనేక పోషక విలువలను కలిగి ఉంది అంజీరా పండు. ఎండు అంజీరాన్ని 100 గ్రాములు తీసుకుంటే 207 క్యాలరీల శక్తి ఉంటుంది. ఎండటం వల్ల నీటి శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి శక్తి ఎక్కువగా ఉంటుంది అన్నిటికంటే మలబద్ధకాన్ని తొలగించడానికి మంచిగా పని చేస్తుంది.

పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 100 గ్రాముల తీసు కుంటే 10 గ్రాముల శక్తి లభిస్తుంది. అన్ని ఫ్రూట్స్లో కన్నా ఈ ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా కలిగి ఉoది. మన శరీరంలో కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షించే పోషకాలని యాంటీ ఆక్సిడెంట్ అంటారు. అంజీరా లో ఈ ఆంటీ ఆక్సిడెంట్ శాతం ఎక్కువగా ఉంది. C3r ఆంటీ ఆక్సిడెంట్ అంజీరా లో 92 శాతం ఉన్నాయి. ఆంటీ ఆక్సిడెంట్ కణాలు మనం తిన్న ఆహారాన్ని కొవ్వు పదార్థాన్ని పేగు నుంచి రక్తంలో పలికి చేరకుండా కాస్త నియంత్రించి బరువు పెరగకుండా ఉండడానికి కంట్రోల్ చేస్తుంది.

బీటా సైటోస్టిరాల్ అనే కెమికల్స్ ఉన్నాయి. క్యాన్సర్ కణాలు ఉన్నప్పుడు క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి తోడ్పడతాయి. బీటా d గ్లైకోస్టిరాల్ ఆల్కహాల్ తాగే వారికి అవి లివర్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి తోడ్పడతాయి. టీ.బిఉన్నవారు అంజీర పండును తీసుకోవడం వల్ల టీ.బి తొందరగా తగ్గిపోతుంది. అంజీరా పండులో ముఖ్యంగా 680 మిల్లీగ్రాముల పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీ.పీని కంట్రోల్ గా ఉంచుతుంది.

అంజీర పండ్ల ఉపయోగాలు:

ఒమేగా ఫ్లాట్టియాసిడ్స్ ఉంటాయి. ఒమేగా ప్లాటియాసిడ్స్ కొద్ది మోతాదులో ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మరియు గుండె లైఫ్ పెంచడానికి ఒమేగా ప్లాటియాసిడ్స్ బాగా పనిచేస్తాయి. ఫ్రెష్ గా ఉన్న అంజీరా ను 100 గ్రాములు తీసుకుంటే 37 క్యాలరీల శక్తి లభిస్తుంది. కండరాల పట్టుత్వం కోల్పోకుండా అంజీర పండు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఏ కాలంలో దొరికే ఆ పండ్లు తినడం ద్వారా మన శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందుతాయి. ఎండిన అంజీర పండ్లను యధా విధంగా తినవచ్చు. పచ్చి అంజి రా లో 87% వాటర్ ఉండడం ద్వారా కొద్దిగా చెప్పగా ఉంటాయి. ఎండబెట్టడం ద్వారా నీరు బయటకు పోవడం వల్ల ఎండిన అంజీరాలు తీయగా ఉంటాయి. కాబట్టి 207 క్యాలరీల శక్తి లభిస్తుంది.

ఆకర్షణీయమైన రంగు రూపం కానీ అంజీర కు లేవు. కానీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అద్భుతమైన రుచితో పాటు విలువైన పోషకాలు కలిగి ఉన్నాయి.

Dry Fruits

ప్రపంచవ్యాప్తంగా డ్రై ఫ్రూట్స్ రూపంలో ఎక్కువగా దొరుకుతున్నాయి. రోగనిరోధ క శక్తి పెంచే గుణాలు అంజీర లోనే ఎక్కువగా ఉన్నాయి. ఏ వ్యాధితో నైనా బాధపడుతున్న వారు అంజి రాను తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకుంటారు. శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అంజీరాలు ఇస్తాయి. శరీరానికి , మానసిక రోగులకు కావాల్సిన శక్తిని ఈ అంజీరాలు ఇస్తాయి. క్యాన్సర్ తరహా గడ్డల నివారణకు అంజీరాలు బాగా పనిచేస్తాయి. వీటిలో అధికంగా ఉన్న పొటాషియం బి.పి కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

ఊపిరితిత్తుల సమస్యలకు ఇది ఒక మంచి ఔషధం. అస్తమా, దగ్గు వంటి పాత్రను తగ్గించడంలో ఘనమైన పాత్ర పోషిస్తుంది. అంజీర్ లైంగిక సమస్యలను దూరం చేస్తుంది. దీర్ఘకాలంగా వ్యాధుల బారిన పడిన వారికి వీటిని ఆహారంగా తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతారు. మలబద్ధకానికి మంచి ఔషధంగా పెట్టిందే పేరు. ఇది అజిర్తి ని తొలగిస్తుంది. వీటిలో క్యాల్షియం, ఎముకల వృద్ధికి బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ట్రిప్ ప్తో టీన్ హాయిగా నిద్ర పట్టేందుకు చేస్తుంది. నిద్రలేమి తో బాధపడేవారు రోజు రాత్రి పూట రెండు అంజీర పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది

.వృద్యాపంలో వచ్చే చారలను తగ్గిస్తుంది. కడుపునొప్పి, జ్వరం ,చెవి నొప్పి, లైంగిక వ్యాధులు తగ్గించడంలో అంజీర కీలకపాత్ర వహిస్తుంది. ఆడపిల్లల ముఖంపై ఉండే మచ్చలను తగ్గించడానికి రోజు రెండు పండ్లను తీసుకోవడం ద్వారా మచ్చలు తగ్గుతాయి. ముసలితనపు లక్షణాలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఎదిగే పిల్లలు రోజు క్రమం తప్పకుండా అంజీర పండ్లను తీసుకోవడం ద్వారా బుద్ధిమాంద్యం తగ్గి, తెలివితేటలు పెరుగుతాయి .ఎముకలు గట్టిగా తయారవుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అంజీర పండును తీసుకొని అందరం ఆరోగ్యంగా ఉందాం.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button