Fruits

Pumpkin seeds Benefits in Telugu: గుమ్మడి విత్తనాల్లో ఔషధ గుణాలు

Pumpkin seeds Benefits in Telugu: గుమ్మడికాయను తెలియని తెలుగు ఇల్లు ఉండదంటే అతిశయోక్తి లేదు. ఈ గుమ్మడి ఆరోగ్యానికి ,సౌందర్యానికి చాలామంచిది. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా చిన్నగా ఉన్న మంచి ఆరోగ్యఫలితాన్ని ఇస్తుంది .గుమ్మడి విత్తనలు పోషకాలు ,యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా కలిగిఉన్నాయి. గుమ్మడి విత్తనాల్లో బరువు సమస్యను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి

.వీటిని ఏదో రూపంలో రోజు తీసుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. కొవ్వు ఆమ్లాలు , పొటాషియం ,జింక్ లాంటి అవసరమైన అమైనోఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు కలిగి ఉంటుంది. ఈ గింజలు తీసుకోవడం ద్వారా మధుమేహం ,గుండె జబ్బులు ,కండరాలు, జుట్టు రాలడం, మొటిమలను, తగ్గించడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయను గుమ్మడి లేదా తీయ గుమ్మడి అంటారు.

శాస్త్రీయ నామం “cucurbita లేదా cucurbita mixta “అంటారు. సంస్కృతంలో పీత కు కుష్ముండా: అంటారు. హిందీలో ఖద్దు అంటారు. కుక్కుర్బిటేసి కుటుంబానికి చెందినది. గుమ్మడి లో ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి వీరి వీరి గుమ్మడి ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటారు.గుమ్మడి కాయను భారత సంప్రదాయ వంటకాలలో మంచి స్థానమే ఉంది.

Pumpkin seeds
Pumpkin seeds

ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నయం చేసి,నివారించే గుణం కలిగి ఉంది. గుమ్మడి విత్తనాలలో పాస్పరస్ ,మెగ్నీషియం, ఐరన్ ,పొటాషియం ,కాపర్ ,జింక్ సహా ఆరోగ్యకరమైన కొవ్వులు , అనేక పోషక విలువలు కలిగి ఉంది.గుమ్మడివిత్తనాలు చకర,స్థాయిలను అదుపులో ఉంచి టైపు టు డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది నివరిస్తుంది

.నిద్రలేమి సమస్య తోబాధపడేవారు ప్రతిరోజు 4-5 గుమ్మడి విత్తనాలు తింటే చాలు మంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులోని టిక్టోపాన్, జింక్ కలిసి సెరటోనిన్ గా మారుతుంది. ఇది తిరిగి మెలటోనిన్,హార్మోన్ గా మారి కంటినిండా నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది. అధిక బరువు ఉన్నవారు గుమ్మడి విత్తనాలను కొన్నితీసుకుంటే చాలు .

పొట్ట నిండినట్లుగా ఉంటుంది.ఎక్కువ శక్తి లభిస్తుంది. ఎందుకంటే దీనిలో ప్రోటీన్లు, ఎక్కువక్యాలరీలు ఉంటాయి. దీనిలోపీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టిజీర్ణ వ్యవస్థ నుమెరుగుపరిచి, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది . దీనివల్ల బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.
గాయాలకు:
గుమ్మడి విత్తనాలలో ఉండే జింక్ బ్యాక్టీరియా, వైరస్ తో,పోరాడి వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుంది. మ్యాంగనీస్, విటమిన్ కె ,గాయాలు త్వరగా మారడానికి ఉపయోగపడుతుంది .రోజు ఉదయం అల్పాహారంతో పాటు 10 గింజలు తీసుకుంటే లేదా భోజనాల మధ్యలో సలాడ్ తో కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. రుచి పెరగి ఆరోగ్యం సొంతమవుతుంది.

ఆరోగ్యం మరియు అందం:

గుమ్మడి విత్తనాలల్లో ఉండే కుక్కురు బిటాసిస్, అమినోయాసిడ్ శిరోజాలను ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇందులోఉండే ఈ విటమిన్ ,కెరోటినాయిడ్స్ ,వంటి యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు సహాయపడు తాయి. కోల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరిచి, చర్మానికి ముదుత్వంతో పాటు, సాగేల క్షణాన్ని కలిగి ఉంది . దినీవల్ల చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపిస్తుంది..

గుమ్మడిని ఆహారంగా ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడదు. కాంతి వoత కనిపిస్తుంది. ఫేస్ ప్యాక్,లగా ఉమ్మడి గుజ్జును తీసుకోవడంవల్ల ముఖానికి మెరుపు మరియు మృదుత్వం వస్తుంది. కళ్ల కింద ఉన్ననల్లటి వలయాలు తగ్గుతాయి. విటమిన్లు, ప్రోటీన్లు కార్బోహైడ్రేడ్లు ,జింక్ ,మెగ్నీషియం, సోడియం, పీచు, పుష్కలంగా గుమ్మడి విత్తనాలలో లభిస్తాయి.

రక్తంలోనీ మలినాలను బయటకు పంపుతుంది .మరియు శరీరానికి శక్తిని ఇస్తుంది. గుమ్మడి విత్తనాలలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును సక్రమంగా జరిగేటట్లు చేస్తాయి. మరియు రక్త ప్రసరణ సాఫీగాజరి గేటట్లు చేస్తుంది. బి.పీ కంట్రోల్లో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది .హూద్రోగాలను నివారిస్తుంది. మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గుమ్మడి వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను,నివారిస్తుంది. ఇందులో ఉండేఏ విటమిన్ వల్ల కళ్ళకు ఉపశమనం కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో తమ డైట్లలోగుమ్మడికాయ ఉండేటట్లు చూసుకోవాలి. అది బరువు సమస్యను తగ్గేలా చేస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారికి గుమ్మడికాయ ఒక ఔషధం లాగా పనిచేస్తుంది.

వ్యాయామం చేసిన తర్వాత ప్రతిరోజు గుమ్మడి గింజలు తినడం వల్ల అలసట తగ్గుతుంది.ప్రమాదవశాత్తు గాయపడిన లేదా అనారోగ్య సమస్యలతో బలహీనంగా ఉన్నవారు గుమ్మడి గింజలు తినడం వల్ల త్వరగా కోలుకుంటారు. ఈ గింజలు రోజు కొన్ని తినడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు విటమిన్లు, ప్రోటీన్లు అందుతాయి.

Side Effects:

గర్భిణీలు పాలిచ్చే మహిళలు గుమ్మడి గింజలను మితంగానే తీసుకోవాలి. ఇది గర్భిణీ ,పాలిచ్చే మహిళలకు హానికరం అని చెప్పవచ్చు. మధుమేహం ఉన్నవారు , రక్తంలో గ్లూకోస్ స్థాయి తక్కువగా ఉంటే వైద్యుని సంప్రదించిన తర్వాతే మాత్రమే గుమ్మడి విత్తనాలను తీసుకోవాలి.

ఇది రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. లో బి.పిఉన్నవారు తీసుకోకపోవడం మంచిది .వైద్యుని సంప్రదించిన తర్వాత మాత్రమే గుమ్మడి విత్తనాలను తీసుకోవాలి. అతిగా తింటే అతిసారం వస్తుంది. కడుపులో నొప్పి, తిమ్మరి ,ఉబ్బరం వంటి సమస్యలు అధికమవుతాయి. శారీరిక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే గుమ్మడి గింజలు తినే ముందు ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాలి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button