Wood Apple Benefits in Telugu: వెలగపండు ఉపయోగాలు
Wood Apple Benefits in Telugu: వెలగ పండు నుఇంగ్లీషులో ఉడ్ ఆపిల్ ,మంకీ ఫ్రూట్ ,కార్డ్,ఫ్రూట్ ఇలా అనేక చాలా పేర్లు ఉన్నాయి. వినాయక చవితి మొదలుకొని వేసవి వరకు ఇవి వస్తానే ఉంటాయి .గణపతికి ఎంతో ప్రీతి పాత్రమైన వెలగపండు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. వెలగపండు అనేక పోషకాల సమ్మేళనం .
ఇందులో క్యాలరీలు ,పిండి పదార్థాలు, ప్రోటీన్లు, బీటా కెరోటిన్, దయామిన్ ,రైబోఫ్లవిన్, నియాసిన్ ,క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ,సిట్రిక్ ఆమ్లాలతో పాటు అనేక పోషక పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. వెలగపండు ‘రూటేసి ‘కుటుంబానికి చెందినది. వెలగపండును “ఎలిఫెంట్ ఆపిల్ లేక ఉడ్ ఆపిల్ “లేదా ఫెరోనియా లియోనియా అని అంటారు. వుడ్ ఆపిల్ వగరు ,పులుపు రుచి ని కలిగి ఉండి సుహాసన భరితంగా వాసన కలిగి ఉంటుంది.
వెలగపండు ఉపయోగాలు Wood Apple Benefits:
వెలగపండు గుజ్జు జీర్ణశక్తికి ఎంతో మంచిది .జ్యూస్ రూపంలో తీసుకుంటే జీర్ణ సంబంధిత మరియు పేగు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది .కడుపులో ఉండే పరాన్న జీవులైన నులిపురుగుల్ని దరిచేరనివ్వదు. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయ సమస్యలను దూరం చేస్తుంది. గుండె జబ్బుతో బాధపడే వారికి మంచి ఔషధం అని చెప్పవచ్చు .
అలాగే కంటి చూపును మెరుగుపరచడంతో పాటుకంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మహిళలు క్రమం తప్పకుండా వెలగపండు గుజ్జును తినడం వలన రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే మహిళల్లో ఏర్పడే హార్మోన్ల సమతుల్య సమస్యను దూరం చేస్తాయి. వెలగపండును తేనెతో కలిపి తీసుకుంటే అధిక దాహాన్ని తగ్గించుకోవచ్చు .అలాగే నోటిలో ఏర్పడే పుండ్లను నివారిస్తుంది .ఉదర సమస్యలైనా గ్యాస్ ,ఎసిడిటీని తగ్గించి ఉదరఆరోగ్యాన్ని పెంచుతుంది.
వెలగ పండు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా పురుషులలో ,వీర్య వృద్ధి కలుగుతుంది. అలసట ,నీరసం పోయి శరీరం శక్తివంతంగా మారుతుంది. అలాగే మూత్రపిండాలు ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి వెలగపండుకు ఉంది. లివర్ కి చాలా మంచిది వెలగపండు .ఆల్కహాల్ తాగేవారు జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారు .ఎవరికైనా సరే వెలగపండు తింటే లివర్ కి అద్భుతంగా పనిచేస్తుంది.
వెలగపండు క్యాలరీస్:
100 గ్రాముల వెలగపండు తీసుకుంటే 134 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలు 18 గ్రాములు.7గ్రాములు మాంసాకృతులు. ప్రోటీన్స్5గ్రాములు, tryptophan 1.5 మిల్లీగ్రాములు కలిగి ఉంటుంది. 40 రకాల antioxidants కలిగి ఉంటుంది. ఇది 15 రకాల క్యాన్సర్లను రాకుండా చేస్తుంది మరియు extract పనిచేస్తుంది. పండు తీసుకోవడం ద్వారా లివర్ ఎంజాయ్ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. ఈ వెలగపండు తీసుకోవడం ద్వారా ఫ్రీ డాడికల్స్ త్వరగా నిర్మూలించి శరీరాన్ని రక్షించుకోవచ్చు. ఫ్యాటీ లివర్ తో బాధపడేవారు అలాంటివారు ఈ వెలగపండు తీసుకోవడం ద్వారా చాలా ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం వెలగపండు చాలా ఉపయోగపడుతుంది.
వెలగపండు ప్లాంట్ గురించి:
వెలగ పండే కాదు ఈ చెట్టు ఆకులు పూలు, వేర్లు, బెరడు అన్ని ఔషధ భరతమే. సుమారు 21 రకాల బ్యాక్టీరియాలతో పోరాడు శక్తి దీనికి ఉంది .అలాగే మహిళల్లో ఏర్పడే రక్తహీనత సమస్యల్ని కూడా ఈ పండు దూరం చేస్తుంది. దీని పూలు ఆకుపచ్చని రంగుతో కూడిన, తెలుపు రంగులో ఉండి కమ్మని వాసని కలగజేస్తాయి .వెలగపండు కాయలు గట్టిగా ఉంటాయి .విత్తనాలు చాలా ఉంటాయి.
వెలగపండు గుజ్జు కూడా సుహాసనను కలిగి ఉంటుంది . వెలగపండు వేర్లతో దోమలను తరిమి కొట్టవచ్చు.క్యాన్సర్లను నివారించడంలో కూడా వెలగపండు ఉపయోగపడుతుంది.ఇందులో గల పదార్థాలు మినరల్స్ ,విటమిన్లు, క్యాల్షియం ఫాస్ఫరస్ ఇలా చాలానే కలిగి ఉంటాయి .ఇనుము కెరోటిన్ చాలా ఔషధ గుణాలు వెలగపండు కలిగి ఉంది.ఆకులు ,పండ్లు ,కాయలు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.
అతిసారా వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు.వగరు ,పులుపు రుచితో కూడి ఉంటుంది .పండిన గుజ్జు అయితే మంచి వాసనను ఇస్తూ తీపి రుచిని కలిగి ఉంటుంది.వెలగ పండులో అనేక పోషకాలు ఆరోగ్య గుణాలు ఉన్నాయి. పిండి పదార్థాలు ,నియాసిన్, ఆక్జాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ 23 రకాల బ్యాక్టీరియాలతో పోరాడే గుణం కలిగి ఉంది.విటమిన్ సి ,యాంటీ ఆక్సిడెంట్ ట్లు పుష్కలంగా ఉన్నాయి.
యాంటీ ఆక్సిడెంట్లు వృద్యాప పక్రియను నెమ్మదిగా చేస్తుంది. విటమిన్ సి ,కొల్లాజిన్ ఉత్పత్తిని పెరుగుదలకు సహాయపడుతుంది.జీర్ణ సమస్యలకు ఈ వెలగపండు చెక్ పెడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు ,పేగులోని నురిపురుగులకు చాలా చక్కగా పనిచేస్తుంది. బీటా కి రొటీన్ ,క్యాల్షియం ,ఆమ్లాలు అధికంగా ఉంటాయి. కలరా తో బాధపడే వారికి వెలగపండు గుజ్జు తీసుకోవడం ద్వారా చాలా మంచి ఉపశమనం కలుగుతుంది.
రక్తంతో కూడిన విరేచనాలు ,జిగట విరోచనాలు ,అన్నం తిన్న తర్వాత టాయిలెట్ కి వెళ్లడం ఇలాంటి లక్షణాలన్నీ అమీబియాసిస్ వంటి వ్యాధి లక్షణాలు. నీరసం వాంతి, వికారంగా ,ఉన్నప్పుడు వెలగపండు తింటే సరిపోతుంది. దగ్గు, జలుబు, తుమ్ములు, దద్దుర్లు వంటి వాటికి వెలగపండు మంచి దివ్య ఔషధం .ఏ రకమైన అలర్జీ ఉన్నా సరే వెలగపండు తీసుకోవడం మంచిది . వెలగపండుకు, కాస్త బెల్లాన్ని చేర్చి, ఉప్పు, కారం తో కలిపితీసుకుంటే చాలా బాగుంటుంది.
కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది వెలగపండు. కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల తక్షణ శక్తిని అందిస్తుంది. క్యాన్సర్ నివారణకు కూడా వెలగపండు సహాయపడుతుంది. వెలగ పండు రోగ నిరోధక శక్తి పెంచుతుంది. మరియు గాయాలను త్వరగా నయం చేస్తుంది. తామర ,గజ్జి వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. జలుబు లేదా ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అలసట, నీరసం ఉండేవారు వెలగపండును తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది.
Velaga Pandu సైడ్ ఎఫెక్ట్స్:
ఇది వేగంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేడ్లు మరియు రక్త ప్రవాహంలో ప్రవేశించి వేగం కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు. గర్భధారణ సమయంలో మరియు పాలిచ్చే మహిళలలు వెలగపండు దూరంగా ఉంటేనే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మందులను వాడుతూ ఉంటే వారు వెలగపండు తినే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే వెలగపండు రక్తంలో చక్కెర సాయి చాలా తగ్గిస్తుంది.శాస్త్ర చికిత్సలకు కనీసం రెండు వారాలకు ముందు వెలగపండుతినడం మానివేయాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిల మీద త్రీ వ మై న ప్రభావాన్ని చూపిస్తుంది. అదిగా తింటే కడుపులో నొప్పిని కలగజేస్తుంది పరిమితంగా తింటే ఔషధ గుణాoగా పనిచేస్తుంది. గుండె జబ్బులు ,గొంతు వ్యాధి ఉన్నవారు వెలగపండును తీసుకోకూడదు .అతిగా తింటే వెలగపండు ఆ జిర్తి ,కడుపులో నొప్పిని కలగజేస్తుంది. ఏ రకమైన పండును మనము మితంగానే తినాలి అతిగా తినకూడదు.
ఉడ్ ఆపిల్ పచ్చడి:
పచ్చిగా ఉండే వెలగపండును తీసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుంది. ముందుగా ఒక పెద్ద సైజు వెలగపండును తీసుకోవాలి. దీనిని టెంకాయ పగలగొట్టినట్లు, పగలగొట్టుకొవలి. పైన ఉన్న పెంకులు పాడవేసి లోపల ఉన్న గుజ్జును మాత్రమే తీసుకోవాలి. ఈ పచ్చడి కి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ తీసుకోవాలి. ఫ్యాన్ హిట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. Oil వేడి అయినాతర్వాత, అందులో ముందుగా పోపు గింజలను వేసుకోవాలి.
అవి దోరగా వేగిన తర్వాత, ఒక నాలుగు పచ్చిమిరపకాయలను సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి. అందులోని ఒక ఐదు ఎండు మి రపకాయలను వేసుకొని, దోరగా వేయించుకొని ఈ మిశ్రమాన్ని పక్కన తీసుకొని చల్లార్చుకోవాలి. అదే పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మనం తీసుకున్న పచ్చి వెలగపండు గుజ్జును ,అందులో వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల వరకు ముగించుకోవాలి. ఒకవేళ అది సరిగ్గా మగ్గకపోతే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి.
ఇలా ఉడికించుకోడుకోవడం వల్ల వగరు అనేది పోతుంది. బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా మనం వేయించుకున్న పోపు గింజలు ,ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నాలుగు వెల్లుల్లి రెమ్మలు, వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మనం ముగించుకున్న వెలగపండు గుజ్జును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వెలగ పండు గుజ్జు గట్టిగా ఉంటుంది కాబట్టి water వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి.
ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం వల్ల వెలగపండు పచ్చడి టేస్ట్ గా ఉంటుంది. తాలింపు లోనే చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువఅనేది ఆప్షనల్ అండి. వేసుకుంటే టేస్ట్ గా ఉంటుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.
వెలగపండు (Velagapandu) పెరుగు పచ్చడి తయారీ విధానం:
ముందుగా రెండు వెలగపండులను తీసుకోవాలి. వీటిని పలగొట్టుకొని లోపల ఉన్న గుజ్జును స్పూన్తో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు వెల్లుల్లి రెమ్మలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక ఐదు ఎండుమిరపకాయలను తీసుకోవాలి. వెలగపండు పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువగా తీసుకున్నాను.
ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. అందులోనే వెలగపండు గుజ్జుని వేసి, కొద్దిగా పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బయటికి తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమం గట్టిగా ఉంటుంది కాబట్టి,పెరుగు కలుపుకుంటూ అటు పల్చగా కాకుండా గట్టిగా కాకుండా మధ్యలో ఉండేటట్లు చూసుకోవాలి. ఈ పెరుగు కలుపుకున్న వెలగపండు గుజ్జుమిశ్రమానికి తాలింపు పెట్టుకోవాలి.
స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనే త్రి టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండు మిరపకాయలు వేసుకొని అవి చిటపటలా డే వరకు వేయించుకోవాలి. తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు వేసుకోవాలి. మన మిక్సీ పట్టుకున్న పెరుగు వెలగపండు గుజ్జుబౌల్లోకి,ఈ తాలింపు మొత్తంవేసుకొని, బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉండే వెలగపండు పెరుగుపచ్చడి రెడీ.