Basil seeds drinks: తులసి గింజల డ్రింక్స్ గురించి తెలుసా?

Basil seeds drinks: తులసి చెట్టు గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన విషయమే లేదు. అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతీయుల ఇంటిలో ముఖ్యమైనది. హిందువులు తులసి చెట్టును దేవతలా భావించి పూజలు చేస్తారు. అంతేకాకుండా తులసి చెట్టుకు ఎత్తుగా ఉండేలా తులసి కోట నిర్మించి అందులో నాటుతారు.

ఎక్కువమంది తులసి చెట్టును ఇంటి వాకిటికి ఎదురుగా ఉంచుతారు. ఎందుకంటే తులసి చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్క. తులసి ఆకులను మనం తీసుకోకపోయినా తులసి చెట్టు ఉంటే చాలు. ఇంటి లోపలికి వచ్చే గాలిని తులసి చెట్టు శుభ్రం చేసి, మంచి గాలిని పంపిస్తుంది. అలాగే ఎన్నో ఔషధ గుణాలు కలిగినది.

తులసి ఆకులను అనేక ఆయుర్వేదాలలో విరివిగా వాడుతారు. తులసి చెట్టు రోగ నివారిణి. ఎటువంటి అనారోగ్యాలు మన దగ్గరకు రానివ్వదు. ప్రతిరోజు తులసి ఆకులను తీసుకున్న, గాలిని పీల్చడం ఎంతో ఆరోగ్యం. తొందరగా ప్రాణం నష్టం కలగకుండా ఉండవచ్చు.

ఆకుల రసాన్ని వాడటం వల్ల గ్యాస్ట్రిక్, కడుపుబ్బరం కడుపునొప్పి, నులిపురుగులు, కామెర్లు ,దంత సమస్యలు, నోటి దుర్వాసన వంటి వాటిని తగ్గించుకోవచ్చు. అలాగే మెదడు చురుగ్గా పనిచేయటానికి, జీర్ణ క్రియ మెరుగు పడటానికి, కిడ్నీలో ఏర్పడ్డ రాళ్లు కరిగించడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా తులసి ఆకులే కాక తులసి గింజలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.

Basil seeds:

తులసి గింజలని సబ్జా గింజలు అని కూడా అంటారు. తులసి గింజలను ఇంగ్లీషులో బాసిల్ సీడ్స్ అని పిలుస్తారు. హిందీలో కూడా ఇదే పేరుతో పిలుస్తారు.

Basil seeds drinks:

బాసిల్ సీడ్స్ ని అరగంట నీటిలో వేసి నానబెట్టి వాడతారు.

1. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ నీటిలో నానబెట్టిన భాసిల్ సీడ్స్ ని నీటితో కలిపి తాగవచ్చు.

2. మనం తాగే కూల్ డ్రింక్స్ (శీతల పానీయాలు) లలో కూడా నానబెట్టిన బాసిల్ గింజలను వేసుకొని త్రాగవచ్చు.

3. ఐస్ క్రీమ్లలో కూడా నానబెట్టిన బాసిల్ సీడ్స్ ని వేసుకొని తినవచ్చు.

4. కొబ్బరి నీటిలో కూడా నానబెట్టిన బాసిల్ సీడ్స్ ని కలిపి త్రాగవచ్చు.

5. అల్లం రసం, తేనె, నిమ్మరసం కలిపి అందులో కొన్ని బాసిల్ సీడ్స్ వేసుకొని త్రాగవచ్చు.

ఈ విధంగా బాసిల్ సీడ్స్ డ్రింక్స్ ను అనేక రకాలుగా త్రాగుతారు.

Basil seeds drinks benefits:

బాసిల్ సీడ్స్ ని ప్రతిరోజు వాడడం ద్వారా మన శరీరానికి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి.

1. రోగ నిరోధక శక్తి: మన శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్స్ ని తగ్గించి, చాలా కాలం నుండి ఉండే వ్యాధులను తగ్గిస్తుంది. తులసి గింజలను (బాసిల్ సీడ్స్) నానబెట్టిన తర్వాత వాటిని కొంచెం సేపు నీటిలో ఉడకబెట్టి త్రాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

2. జీర్ణ క్రియ పెరగటం: తులసి గింజలను నీటిలో వేసి నానబెట్టిన తర్వాత వాటిని త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యలు తగ్గుతాయి.

3. మలబద్ధకం: అరటిపండును బాగా మెత్తగా చేసి అందులో కొంచెం పెరుగు, తులసి గింజలను వేసి బాగా కలిపి తీసుకోవడం ద్వారా మలగబద్ధకాన్ని నివారించవచ్చు. మలబద్ధకం ఉన్నవారు దీనిని ప్రతిరోజు రాత్రి తీసుకోవాలి.

4. గ్యాస్ట్రిక్ సమస్య: అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యకు ఈ గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటితో సహా వాడడం వల్ల గ్యాస్టిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

5. వెయిట్ లాస్: బాసిల్ సీడ్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ గింజలను ప్రతిరోజు పరగడుపునతీసుకోవడం అలాగే రోజు రాత్రి పడుకునే ముందు తీసుకోవడం ద్వారా తొందరగా వెయిట్ లాస్ అవుతారు.

6. మానసిక ఒత్తిడి: బాసిల్ సీడ్స్ ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా డిప్రెషన్ నుండి బయటపడవచ్చు. అంతేకాక తలనొప్పి, దగ్గు జలుబు, గొంతు మంట వంటి సమస్యలను తగ్గిస్తుంది. థైరాయిడ్ ఉన్నవారు వీటిని తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

7. నోరు ఎండిపోవటాన్ని: ఎండాకాలంలో ఎక్కువగా నోరెండిపోతుంది. అందువల్ల ఎండాకాలంలో వీటిని తాగడం

ద్వారా తొందరగా దాహం వెయ్యదు. నోరు ఎండిపోవడానికి నివారిస్తుంది. అలాగే శరీరం చల్లగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

8. ఎర్ర రక్త కణాల వృద్ధి:

రక్తంలో ఉండే ఆమ్లత్వాన్ని తగ్గించి, చారత్వాన్ని పెంచుతుంది అందువల్ల ఎర్ర రక్త కణాలను కాపాడుతుంది. అలాగే ఎర్ర రక్త కణాలు ఎక్కువగా వృద్ధి కావడానికి సహాయపడుతుంది.

9. ఎముకల దృఢత్వం:

ఎముకలకు కావాల్సిన క్యాల్షియం, మెగ్నీషియం అందించి ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. ముసలివారికి, చిన్నపిల్లలకు ఎముకలకు కావాల్సిన క్యాల్షియం, మెగ్నీషియం అందక తొందరగా విరిగిపోతూ ఉంటాయి. అలాంటి వారికి ఈ డ్రింక్స్ ఇవ్వడం ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది.

10 చర్మ సౌందర్యం: ఎండాకాలంలో చర్మం పేలుతూ ఉంటుంది. ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. అంతేకాక ఎండాకాలంలో ఎండ వలన మన చర్మం త్వరగా వాడిపోతుంది, అందువల్ల కావలసిన రక్షణను ఇస్తుంది. చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

11. హెయిర్ ఫాల్: ప్రస్తుత కాలంలో చాలామందిని బాధిస్తున్న సమస్య హెయిర్ ఫాల్. వీటిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలాగే హెయిర్ గ్రోత్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. వెంట్రుకల పెరుగుదలకు కావాల్సిన పోషకాలాన్నిటిని అందిస్తుంది.

Exit mobile version