Health Tips

Flax seeds Benefits: అవిసె గింజల ఉపయోగాలు గురించి మీకు తెలుసా?

Flax seeds: మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మానవులు తమ యొక్క ఆరోగ్యానికి, అందానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అందుకోసం వారు తమ ఆహారపు అలవాట్లను, జీవనశలిని సైతం మార్చుకుంటూ పోతున్నారు. ఆహారపు అలవాట్లలో జంక్ ఫుడ్ లకు దూరంగా ఉంటూ, ప్రోటీన్లు,ఫైబర్లు అధిక శాతంలో గల ఆహార పదార్థాలను వినియోగించడం వలన తమ యొక్క జీవన కాలాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అందుకే ఎక్కువ ఫైబర్ నిల్వలు గల ఆహార పదార్థాలను తీసుకోవడం మొదలుపెట్టారు. అలాంటి వాటిలో ముందు వరుసలో ఉండేది అవిస గింజలు. అవిస లో మొక్క మరియు గింజలు అంతయు ఉపయోగపడతాయి.

మొక్కయొక్కచరిత్రగురించితెలుసుకుందాంఈ మొక్కను ఈజిప్టు,మధ్య ఆసియా దేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.అలాగే భారత దేశంలో ప్రథమంగా ఈ మొక్క యొక్క ప్రస్తావన ఆయుర్వేదంలో ఉపయోగించేవారు. కానీ ఈ మొక్క వలన కలుగు లాభాల, ఉపయోగాల వల్ల వీటిని ఆహార పదార్థాలు, సౌందర్య లేపనాలుగా చేర్చడం జరిగింది.

మధ్య ఆసియా ప్రజలు ఈ అవిసె గింజలను ఫంక్షనల్ ఫుడ్ అని కూడా అంటారు.అవిసె గింజలు తేలికపాటిగా ఉంటాయి,రుచిలో వగరుగాను ఉంటాయి. అవిసె గింజలను పొడిగా చేసి చాలా రకాలైన వంటలలో ఉపయోగిస్తారు.

Flax seeds Benefits
Flax seeds Benefits

How to eat flax seeds:

అవిస గింజలను నీటిలో నానవేసి, మొలకెత్తించి తినవచ్చును. మరియు అవిసె గింజలను బాగా ఎండిన తర్వాత పొడిలా చేసుకుని ఆ పొడిని పాలలో, పండ్లతో తయారైన జ్యూస్ లోకలుపుకొని త్రాగవచ్చు. అవిసె గింజల పొడిని వంటకాలలో మిశ్రమంగా ఉపయోగించవచ్చు.

Flax seeds in telugu uses:

అవిస గింజలలో ఒమేగా 3 ఆమ్లము ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్, ఫైబర్ థాయామిన్,రాగి లాంటి అనేక పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తింటే అవిసె గింజల్లో ఉండే పోషకాలు పూర్తిస్థాయిలో మన శరీరానికి అందుతావి. ఆవిస లో గల ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్ ఇవి గుండె యొక్క పని తనం ను, గుండె ఆరోగ్యానికి మంచి ప్రయోజనకారి.

అవిసె గింజల్లో లిగ్నాన్ అనే పోషక పదార్థం ఉన్న కారణంగా క్యాన్సర్ వ్యాధి నిరోధకానికి చాలా మంచిగా పని చేస్తుంది. అవిసె గింజలలో ఫైబర్ అధిక శాతంలో ఉండుట వలన జీర్ణ క్రియ సాఫీగా జరిగి పెద్ద ప్రేగులలో, మరియు చిన్న ప్రేగులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా సహాయపడతాయి.

అలాగే స్థూల కాయం,ఊబకాయం నుండి కాపాడబడుతుంది. మరియు అధిక రక్తపోటు గల వారికి, రక్తపోటును సమతుల్యం గా చేయుటలో అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే డయాబెటిస్ వ్యాధి గల వారికి బహు చక్కని ఆహారం. ఆర్థరైటిస్ ను తగ్గించడంలో సహాయపడతాయి, గ్యాస్ట్రిక్ అజీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అవిసె గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ల వలన వ్యాధి నిరోధక శక్తి సమకూరును.

అవిసె గింజలు వాడుట వలన మహిళలకు కలుగు లాభాలు:

మహిళలు రుతుక్రమానికి ముందు వచ్చే నొప్పులను తగ్గించే గుణం అవిసె గింజలలో ఉంది,అలాగే మహిళలో వచ్చు రొమ్ము క్యాన్సర్ ను నిరోధించే పోషక పదార్థాలు అవిసె గింజలలో పుష్కలంగా ఉన్నవి. మహిళలలో వ్యంద్యత్వం కు కారణమైన వాటిని నిరోధించే శక్తి అవిస గింజలకు ఉంది. మరియు వారి నాజుకు చర్మాన్ని పరిరక్షించే పోషకాలు అవిసె గింజలలో చాలా మోతాదులో కలవు.వేగంగా బరువు తగ్గాలి అనుకునే వారికి అవిసె గింజలు చేసిన ఆహార పదార్థాలు తినటం వలన వారు బరువు తగ్గుదురు.

అవిసె గింజలను వాడటం వలన మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు. అవిసె గింజలను నేరుగా కానీ వేరే ఆహార పదార్థాలలో చేర్చి గాని తీసుకొనుట వలన శారీరక పెరుగుదల త్వరగా పెరుగుటకు, కేశ సౌందర్యమునకు దోహదపడును. అవిసె గింజల పొడిని వేరే ఆహార పదార్థాలలో మిశ్రమంగా చాలా సులభంగా కలుపుకోవచ్చును.

అలాగే అవిస మొక్క కూడా ఉపయోగపడును ఈ అవిసె మొక్కల గడ్డిని నారగా చేసి దుస్తులు తయారీలో వాడుదురు,ఈ నారతో తయారుచేసిన దుస్తులకు మంచి డిమాండ్ కూడా ఉంది. అవిసె గింజలతో నూనెను కూడా తీసి వంటకాలలో వాడుదురు. అవిసె గింజలను తినుట లేదా అవిసె గింజలతో తయారిన నూనెను తల వెంట్రుకలకు పట్టిస్తే వెంట్రుకలు దృఢంగా,ఏపుగా పెరుగుతాయి. మరియు ముఖముపై చర్మం ముడతలు రాకుండా ఉండుటకు అవిసె గింజలతో తయారు చేసిన ఆయిల్ ను పూయవచ్చును.

అవిస గింజల వలన చెడు పరిణామాలు:

గర్భిణీ స్త్రీలు ఆవిష గింజల తో తయారైన ఆయిల్ ను వాడుట మంచిది కాదు. వైద్యుల సలహా మేరకు గర్భిణీ స్త్రీలు అవిసె గింజలను వాడవచ్చును,అవిసె గింజలతో తయారు చేసిన ఆయిల్ ను ఎట్టి పరిస్థితుల్లో వేడి చేయరాదు, కానీ వేపుళ్ళ లో వాడవచ్చును.

Flax seeds Benefits

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button