Foxtail millet:కొర్రలు ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు
Foxtail millet: నేటి సమాజంలో మానవుడు ఆరోగ్యానికి అన్నిటికంటే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు.అందులో భాగంగానే వారి జీవన శైలిని ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు
.నేటి సమాజంలో చిన్న, పెద్ద తేడా లేకుండా మధుమేహం,హై బీపీ,లో బీపీ, వంటి సమస్యలు ఎక్కువైనందున వాటి నుంచి బయటపడటానికి వరి,గోధుమల పదార్థాల కంటే చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు.చిరుధాన్యాలలో వ్యాధి నిరోధకతను పెంచే గుణాలు,మధుమేహాన్ని కంట్రోల్ చేసే,బ్లడ్ ప్రెజర్ నుఅదుపులో పెట్టే పోషకాలు ఉన్నాయి.అలాంటి చిరుధాన్యాల లో చాలా సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే కొర్రల గురించి మనం తెలుసుకుందాం.
ఈ కొర్రలను ఎలాంటి భూమిలోనైనా సాగు చేయవచ్చును.ఈ పంటకు నీరు కూడా ఎక్కువ మోతాదులో అవసరం లేదు.ఎడారి ప్రాంత వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఈ పంటను సాగు చేయవచ్చును.ముఖ్యంగా ఇతర పంటలలో అంతర పంటగా కూడా ఈ పంటను సాగు చేయవచ్చును.అందుకే కొర్రలను పేదవారి పరమాన్నం అని పేరు.
నేను సమాజంలో ఉన్నత కుటుంబాల వారు కూడా వీటిని వాడటం అధికం అయింది. కొర్రల వల్ల కలుగు లాభాలు:కొర్రలు తీపి,వగరు వంటి రుచిని కలిగి ఉంటాయి.చిన్నపిల్లలకు గర్భిణీలకు మంచి ఆహారం.వీటిని తినడం వల్ల అధిక బరువు తగ్గించవచ్చు.అలాగే ఏకాగ్రత జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది కొర్రలను తినడం వలన నాడీ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది.నాడి సంబంధ వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజు కొర్రలను తినాలి. కొర్రలలో ఉండే విటమిన్ B1 గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.గుండె జబ్బులు ఉన్నవారు కొర్రలను తింటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
మధుమేహ రోగులు అన్నానికి బదులుగా కొర్రలను తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.కొర్రలు తినడం వలన ఆకలి తగ్గి శక్తి పెంచుతుంది.మరియు శరీరంలో అదనంగా పేరుకుపోయి ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది.ఈ కొర్రలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లైంగిక సమస్యలు కూడా దూరం అవుతాయి.ఎముకలు దృఢంగా ఉంటాయి కొర్రలలో ఉండే అధిక మొత్తంలో క్యాల్షియం ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది.
కొర్రలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.శరీరంలోని కొలెస్ట్రాల పరిమాణాన్ని తగ్గిస్తుంది.ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు నొప్పి,మూత్రం పోసేటప్పుడు మంటగా ఉండటం,అతిసారం మొదలగు వ్యాధులకు కొర్రలు మంచి ఔషధంగా పనిచేస్తాయి.12 శాతం ప్రోటీన్లు,8 శాతం పీచు పదార్థం కొర్రల్లో ఉంటుంది.కొర్ర నుండి మీరు పొందగల ఉత్తమ ప్రయోజనాల్లో ఒకటి మీరు సన్నగా మరియు బలమైన కండరాలను కలిగి ఉండడం.
Read more: Horsegram in Telugu ఉలవలు ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు
మీరు శాఖాహారులు అయితే మీకు సరిగ్గా ప్రోటీన్ లభించకపోతే ఈ కోర్రలను తీసుకోవడం ప్రారంభించండి.ఈ కొర్రలతో అన్నమే కాక మరెన్నో వంటకాలు కూడా చేసుకోవచ్చును. ఉదాహరణకు పులిహోర,సూపు,ఉప్మా,గారెలు, దోసలు,గంజి,పరమాన్నం మరెన్నో వంటకాలు చేసుకోవచ్చును.మరెందుకు ఆలస్యం కొర్రలను మీ రోజుపాటి ఆహారపు అలవాట్లలో చేర్చుకోండి ఆరోగ్యంగా ఉండండి.