Gastric Problems: నేటి సమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వలన మానవులు రెడీమేడ్ ఫుడ్ కు అలవాటు పడ్డాడు, జంక్ ఫుడ్ ను తింటున్నాడు. ఈ ఆహారపు అలవాట్ల వలన మానవులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా చిన్న,పెద్ద అని తేడా లేకుండా గ్యాస్ట్రిక్ సమస్యకు గురవుతున్నారు. ఈ సమస్య వలన గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. అయితే కొన్ని సాధారణ ఇంటి చిట్కాలు ఉపయోగించి గ్యాస్ట్రిక్ సమస్యను దూరం చేసుకోవచ్చు.
గ్యాస్ట్రిక్ సమస్య వల్ల కలిగే దుష్ప్రయోజనాలు: ఈ సమస్య ఎదుర్కొనేవారు కడుపు ఉబ్బరంగా ఉండడం, ఏమి తినకుండా కూడా కడుపు నిండిన అనుభూతికి లోనవ్వడం, స్థిరత్వం లోకపోవడం,నలుగురిలో ముభావంగా ఉండడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అసలు గ్యాస్ అనేది రెండు విధాలుగా ఏర్పడుతుంది.
Gastric Problems:
1.తినేటప్పుడు, త్రాగేతప్పుడు. లేదా గురక పెట్టే సమయంలో మన శరీరంలోనికి ఆక్సిజన్ మరియు నత్రజని తో కూడుకున్న గాలి వెళ్తూ ఉంటుంది.
2. శరీరంలోకి వెళ్లే ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియలో హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, మిథైన్ లు ఎక్కువ మోతాదులో విడుదలవుతుంటాయి. ఇవి సాఫీగా బయటికి పొకపోతే ఆసౌకర్యంగా ఉంటుంది. అందువల్లనే ఆహార పదార్థాలు తినేటప్పుడే ఈ గ్యాస్ ను ఏర్పరిచే ఆహార పదార్థాలు తినరాదు.
గ్యాస్ నివారణకి వంటింటి చిట్కాలు :
- వాము మంచి ప్రయోజన కారిగా ఉంటుంది వామును నేరుగా గాని, పొడిగా గాని చేసుకొని నాలుక కింద ఉంచుకొని చప్పరించినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు, లేదా వేడి నీటిలో వాము పౌడర్ ను కలుపుకొని తాగవచ్చు.
- జిలకర్ర వలన కూడా గ్యాస్టిక్ సమస్యను పోగొట్టుకోవచ్చును. చాలామందికి జీలకర్ర చూడగానే సాధారణంగా నోటిలో నీళ్లు ఊరుతాయి జీలకర్ర కు లక్షణం గలదు ఒక టేబుల్ స్పూన్ జిలకరను తీసుకొని 200 ML నీటిలో సుమారు 20 నిమిషాలు ఉడకబెట్టాలి. ఆ ఉడకపెట్టిన నీటిని చల్లారాక తాగడం వలన గ్యాస్టిక్ సమస్యను దూరం చేసుకోవచ్చు.
- వంటింట్లో లభించే ఇంగువను కొద్దిగా తీసుకొని సరైన మోతాదులో గోరువెచ్చని నీటిలో కలుపుకొని త్రాగడం వల్ల ఈ సమస్య నుంచి దూరం చేసుకోవచ్చు.
- అల్లం ను టీ మాదిరిగా చేసుకొని,లేదా సొంటీ ని టీ లో వెసుకొని త్రాగడం వలన గ్యాస్టిక్ సమస్యను తొలగించుకోవచ్చును. 5 .ఉసిరి,తాని, కరక ఈమూడు ఫలాలచూర్ణంను త్రిఫల చూర్ణం అంటారు. ఈ చూర్ణంను వేడి నీటిలో కలుపుకొని తాగడం వలన గ్యాస్టిక్ సమస్య నుంచి యే కాక వ్యాధి నిరోధక శక్తిని కూడా పొందవచ్చు.
గ్యాస్టిక్ సమస్యలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:
- 1. ఆహార పదార్థాల్లో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి
- 2. తాజా ఆకుకూరలు, పండ్లను తినాలి.
- 3. అధికంగా మసాలాలు ఉండే ఆహారంను సాధ్యమైనంత వరకు తక్కువగా తినాలి.
- 4. నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి.
- 5. ధూమపానం, మద్యపానం సేవించరాదు.
- 6.ఆహారం భుజించాక చివర్లో మజ్జిగ,పెరుగు పదార్థాలను తీసుకోవాలి.
Read more: Horsegram in Telugu ఉలవలు ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు