Health TipsUncategorized

Health tip of the day: ప్రతిరోజు రాత్రి ఈ ఆహారం తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు…

హెల్త్ టిప్ ఆఫ్ ది డే: మనం ప్రతిరోజు మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము. ఎవరు ఏం చెప్పినా దానిని పాటిస్తూ ముందుకు వెళుతుంటాము.

మనం అలా అనుసరించిన వాటిలో లాభం ఉందో, లేదో తెలుసుకోకుండా డాక్టర్స్ ను సంప్రదించకుండా అన్నిటిని పాటిస్తూ ఉంటాము. మీకు లాభం వచ్చే విధంగా మీరు చేసిన పనికి ప్రతిఫలం దక్కేలా ఉండే టిప్స్ ని మీకు తెలియజేస్తున్నాము. దీనిని అనుసరించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అనుసరించిన దానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.

అందువలన హెల్త్ టిప్ ఆఫ్ ద డే లో మీకు మేము తెలియజేస్తున్నది, ప్రతిరోజు మీ డిన్నర్ ను ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఒక వారంలో ఈజీగా బరువు తగ్గవచ్చు. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

అందువల్ల దీనిని ఎవరైనా ఈజీగా పాటించవచ్చు. ప్రస్తుత కాలంలో ఉబకాయం అనేక పెద్ద సమస్యలకు దారితీస్తుంది. వెయిట్ ఎక్కువగా కావడం వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నాము. అందువలన మీరు త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.

weight loss

హెల్త్ టిప్ ఫర్ ఉమెన్: ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం ఆడవారు ఉబకాయంతో బాధపడుతున్నారు. ప్రపంచంలో పురుషులకంటే స్త్రీలే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందువలన ఆడవారి త్వరగా బరువు తగ్గడానికి హెల్త్ టిప్ ఆఫ్ ది డే లో చెప్పిన ఈ టిప్స్ ద్వారా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. దీనిని ఈజీగా పాటించవచ్చు.

అందువలన త్వరగా వెయిట్ లాస్ అవ్వవచ్చు. దానివల్ల మీరు ఆనందంగా, అందంగా ఉండవచ్చు. ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. కొంతమంది ఫిట్ గా ఉండడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది జిమ్ కు వెళ్లి వ్యాయామాలు చేస్తూ ఉంటారు.

మరికొందరు డైట్ చేస్తూ ప్రత్యేక ఆహారం తీసుకుంటారు. దీనివలన త్వరగా వెయిట్ లాస్ అవుతుందని ఈ విధంగా చేస్తారు. అదేవిధంగా రాత్రిపూట తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకుంటారు. అలా తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవడం వల్ల ఎంత సేపు నిద్రించిన బరువు పెరుగుతామేమో అన్న భయం ఉండదు.

టుడే హెల్త్ టిప్స్: ఈరోజు హెల్త్ టిప్స్ లో వెయిట్ లాస్ టిప్స్ గురించి తెలుసుకుందాం.

టుడే హెల్త్ టిప్స్ ఆఫ్ ది డే లో టుడే వెయిట్ లాస్ టిప్స్: మీరు రాత్రి భోజనాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవాలి. అదే విధంగా మరికొన్ని ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అని నిపుణులు తెలియజేస్తున్నారు అందువలన రాత్రిపూట ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మీకు ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

తొందరగా వెయిట్ లాస్ కావడానికి రాత్రిపూట తీసుకోవాల్సిన వెయిట్ లాస్ ఫుడ్:

1. పెసరపప్పు: పెసల గురించి అందరికీ తెలిసిందే. అనేక రకాల వంటలలో ఉపయోగిస్తాము. సాంస్కృతిక వంటకాలలో కూడా ఉపయోగిస్తారు. పెసలతో పెసరపప్పు చేసుకోవచ్చు. పెసరపప్పులో అనేక రకాల పోషకాలు చాలానే ఉన్నాయి. అంతేకాక పెసరపప్పును ఆహారంగా తీసుకోవడం ద్వారా మీ రక్తపోటును బ్యాలెన్స్ చేస్తుంది.

pesara pappu

అంతేకాక తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువలన మీరు కూడా త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే రాత్రిపూట పెసరపప్పును తీసుకోవచ్చు. పెసరపప్పును చాలా ఈజీగా చేసుకోవచ్చు కందిపప్పు బదులు పెసలను వాడి పెసరపప్పు చేసుకుంటారు.

2. సగ్గుబియ్యం కిచిడి: సగ్గుబియ్యంలో కార్బోహైడ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ అయ్యే వారికి కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహారం చాలా అవసరం. అందువల్లన ప్రతిరోజు రాత్రిళ్ళు తినేటప్పుడు ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. ఇది చాలా తేలికగా జీర్ణం అయ్యే ఆహారం.

సగ్గుబియ్యం కిచిడి కి కావాల్సిన పదార్థాలు:

1. సగ్గుబియ్యం ఒక కప్పు

2. నానబెట్టడానికి కావాల్సినంత నీరు

3. ఆయిల్ ఒక టేబుల్ స్పూన్.

4. బంగాళదుంప ఒకటి

5. వేరుశనగపప్పు ఒక టేబుల్ స్పూన్

6. సైంధవ లవణం, (లేక ఉప్పు) రుచికి తగినంత

7. జీలకర్ర ఆఫ్ టేబుల్ స్పూన్

8. సన్నగా తరిగిన పచ్చిమిర్చి

9. కరివేపాకు నాలుగు రెమ్మలు

10. కొత్తిమీర కొంచెం

11. అర చెక్క నిమ్మరసం

saggu rice

సగ్గుబియ్యం కిచిడీ తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపను మరీ మెత్తగా కాకుండా మీడియం గా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని మూడు లేదా నాలుగు సార్లు బాగా కడగాలి ఇలా కడగడం వల్ల సగ్గుబియ్యానికి ఉండే పిండి అంతా పోతుంది. ఈ విధంగా చేయడం ద్వారా కిచిడి పొడిపొడిగా వస్తుంది.

తర్వాత నీళ్లు పోసి సగ్గుబియ్యాన్ని ఆరు గంటలు నానబెట్టాలి. బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, స్టవ్ పై కడాయి పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ముక్కలు బంగాళాదుంప, కరివేపాకు వేసి వేగనివ్వాలి.

కొంచెం సేపు వేగిన తర్వాత అందులో పంచదార, అర చెక్క నిమ్మరసం రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఐదు లేదా పది నిమిషాలు మగ్గనివ్వాలి. ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడవచ్చు. సైంధవ లవణం అంటే హిమాలయాలలో దొరికే ఉప్పు. ఇది పతంజలి మార్కెట్లలో దొరుకుతుంది. ఆ తర్వాత బాగా కలిపి మిర్యాల పొడి వేయాలి. అందులోనే కొంచెం వేరుశనగపప్పు కూడా వేసి ఐదు నిమిషాలు మగ్గించి, ఆ తర్వాత కొత్తిమీర వేసి స్లో ఫ్లేమ్ లో 10 లేదా 15 నిమిషాలు మగ్గిస్తే వేడి వేడి సగ్గుబియ్యం కిచిడి తయారవుతుంది.

బొప్పాయి సలాడ్: బొప్పాయిలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. రక్త కణాలు తగ్గిన వారికి బొప్పాయి చాలా బాగా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతారు. అంతేకాక మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి బయటపడవచ్చు. అదేవిధంగా బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

అందువలన మీరు రాత్రిపూట ఆహారంగా బొప్పాయి సలాడ్ ని తీసుకోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా బొప్పాయి పాలిచ్చే తల్లులకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

బొప్పాయి సలాడ్ కు కావలసిన పదార్థాలు:

1. పచ్చి బొప్పాయి 1

2. పచ్చి మామిడికాయ ఒకటి

3. క్యారెట్ తురుము కొంచెం

4. ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్

5. నల్ల నువ్వులు కొంచెం

6. నాలుగుపచ్చిమిర్చి తరుగు

7. మిరియాల పొడి ఆఫ్ టేబుల్ స్పూన్

8. ఉప్పు తగినంత

9. చక్కెర 1/4 టేబుల్ స్పూన్

papaya salad

బొప్పాయి సలాడ్ తయారు చేసుకునే పద్ధతి: ముందుగా పచ్చిమామిడి కాయను తొక్క తీసి మీడియంగా ఉండేలా తురుము పట్టుకోవాలి. అదేవిధంగా బొప్పాయి తొక్క తీసి తురుము చేసుకోవాలి. ఎప్పుడైనా మామిడి తురుముకు రెండు రెట్లు ఎక్కువగా బొప్పాయి తురుము ఉండేలాగా చూసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేయాలి. ఇది లేకపోతే మరి ఏ ఆయిల్ వేయకూడదు. ఆయిల్ లేకపోయినా చాలా బాగుంటుంది. అందులో కొంచెం మిరియాల పొడి, ఉప్పు, చక్కెర వేసి కలపాలి. తర్వాత అందులోకి మామిడి తురుము, బొప్పాయి తురుము వేసి బాగా కలిసేలా అంతా కలపాలి.

తర్వాత అందులో పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసి అందులో వేసి బాగా కలపాలి. అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం నల్ల నువ్వులు, క్యారెట్ తురుము వేసి గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా బొప్పాయి సలాడ్ తయారవుతుంది. అంతేకాక బొప్పాయితో అన్ని రకాల వంటలు, స్వీట్స్ చేసుకోవచ్చు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button