Health tips of the day: సన్నగా ఉండి బలహీనంగా ఉన్నారా? అయితే పాటించాల్సినవి ఇవే !
Health tips: చాలామంది తమ ఆరోగ్యం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాక ఎవరు ఏ టిప్స్ చెప్పినా పాటిస్తూ ఉంటారు. మన శరీరానికి ప్రోటీన్స్ అవసరం చాలానే ఉంది. ఎందుకంటే ప్రోటీన్స్ నుంచే మన శరీరం దృఢంగా, ఫిట్నెస్ గా ఉంటుంది. జుట్టుకు, చర్మానికి, కళ్ళకు, కండరాలకు, ఎముకలకు ఇలా చెప్పుకుంటూ పోతే మన శరీరంలోని ప్రతి ఒక్క అవయవానికి ప్రోటీన్స్ అవసరం చాలానే ఉంటుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రోటీన్స్ మన శరీరంలో ఉండే కణాలను క్రమబద్ధీకరిస్తుంది. కొత్తగా కణాలను పెంపొందిస్తుంది. ప్రోటీన్ పుష్కలంగా లభిస్తే శరీరం బలంగా ఉంటుంది.
అందువల్లనే ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అంతేకాక ఈ మధ్యకాలంలో ఎక్కువగా బరువు పెరిగే వారితో పాటుగానే, చాలా సన్నగా ఉండి బలహీనంగా ఉండేవారు కూడా ఉన్నారు. అటువంటి వారికి ప్రోటీన్స్ అవసరం చాలానే ఉంటుంది. అందువల్ల వారు కొంత ప్రత్యేకమైన ఫుడ్ ను టిఫిన్స్ లో భాగంగా చేసుకుని తింటే వెయిట్ లాస్ సమస్య నుండి తప్పించుకోవచ్చు.
Health tips of the day: ఈరోజు హెల్త్ టిప్స్ ఆఫ్ ద డే లో మనం ప్రోటీన్స్ తక్కువగా ఉండి సన్నగా, బలహీనంగా ఉండే వారికి కావలసిన ప్రోటీన్స్ పొందే ఆహారం గురించి తెలుసుకుందాం.
గుడ్లు:
గ్రుడ్డిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగాలంటే ప్రతి రోజు గుడ్డును టిఫిన్స్ లో భాగంగా చేసుకుని తినాలి. గుడ్డులోనే తెల్లసనలో ప్రోటీన్స్ ఉంటాయి. పచ్చ సోనలో శరీరానికి అవసరమైన మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి. అందువల్ల కనీసం రోజుకు రెండు గుడ్లు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
బాదంపప్పు (ఆల్మండ్):
బాదంపప్పు అనేది డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి. ఇందులో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. కనుక తక్కువ బరువు ఉన్నవారు వీటిని కూడా ఆహారంగా తీసుకోవచ్చు.
పాలు:
పాలలో శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు లభిస్తాయి. పాలలో కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కనుక ప్రతిరోజు పాలన తాగడం ద్వారా త్వరగా బరువు పెరుగుతారు.
ఈ విధంగా వీటిని మీరు ప్రతి రోజు తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. శరీరానికి కావలసిన అన్ని రకాల ప్రోటీన్స్ అందుతాయి. ఆరోగ్యంగా కూడా ఉంటారు.
Health tips for women:
ఈ కాలంలో ఎక్కువ శాతం మంది ఆడవారు ఎంత త్వరగా బరువు పెరుగుతున్నారో,అలాగే కొంతమంది బరువు పెరగక బలహీనంగా ఉండి చాలా సమస్యల భారీ మారిన పడుతున్నారు. ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలకు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ప్రోటీన్స్ లోపం వల్ల వీరు చాలా బలహీనంగా ఉంటారు. చురుకుగా ఏ పని చేయలేరు, ఉత్సాహంగా ఉండలేరు, చిన్న పని చేసిన తొందరగా నిరసించి పోతారు, అంతేకాక పెళ్లి చూపులలో కూడా బలహీనంగా ఉందని వివాహం చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ప్రస్తుత కాలంలో సన్నగా ఉండే వారిని ఇష్టపడతారు. అది నిజమే కానీ ఎటువంటి లోపాలు లేకుండా, యాక్టివ్ గా ఉండే వారిని మాత్రమే ఓకే చేస్తారు. అందువలన ఆడవారు వీక్ గా లేకుండా చురుకుగా ఉండటానికి, మీ శరీరానికి కావలసిన ప్రోటీన్స్ అందడం కోసం మేము చెప్పిన ఈ ట్రిప్స్ ఫాలో అవ్వండి. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ శరీరం దృఢంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఎటువంటి గ్యాస్టిక్ సమస్యలు కూడా ఉండవు.
Health tip 2022:
హెల్త్ టిప్స్ 2022లో మన ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
1. వ్యాయామం: మనం ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. మన శరీరాన్ని మనమే కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యం జబ్బుల బారిన పడకుండా చేస్తుంది. ఎముకలు, కండరాలను దృఢంగా ఉంచుతుంది. గుండెకు సంబంధించిన జబ్బులను రాకుండా చేస్తుంది. వ్యాయామం చేయడం ద్వారా మీరు సంతోషంగా చురుకుగా ఉంటారు.
2. ప్రతిరోజు క్రమంగా నీరు తాగడం: రోజుకు తగినంత నీరు తాగకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు ప్రతి రోజు ఎంత నీరు తాగాలి అనేది మీ జీవనశైలి పై ఆధారపడి ఉంటుంది. కనీసం రోజుకు 8 గ్లాసు నీరైనా తాగాలి. ఇలా త్రాగడం వలన మీ శరీరం త్వరగా డిహైడ్రేడ్ ఉంటుంది. అంతేకాక మన శరీరానికి వచ్చే జబ్బులు ఎక్కువ శాతం నీరు త్రాగకపోవడం వల్లనే వస్తాయి.
3. స్మూతీస్ తీసుకోవాలి: మీరు ఆరోగ్యంగా ఉండటానికి నీరు ఎక్కువగా తీసుకోలేకపోతే వాటి స్థానంలో పాలతో పండ్లను చేర్చిన స్మూతీస్ తాగాలి. పండ్లు తినలేము అనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక అన్ని రకాల ప్రోటీన్స్ మన శరీరానికి అందుతాయి.
4. నిద్రపోవడం: అందరికీ విశ్రాంతి చాలా అవసరం. పగలంతా ఎంత శ్రమ పడ్డారో, అంత మంచి నిద్ర అవసరం. నిద్రపోవటం వలన మీ ఆరోగ్యానికి చాలా మంచిది. CDC తెలిపిన నివేదిక ప్రకారం 18 నుండి 60 సంవత్సరాల వయసు గల వారికి ఏడు గంటల నిద్ర చాలా అవసరమని వెళ్లడయ్యింది. చాలా సమస్యలు నిద్ర సరిగా లేకపోవడం వలన వస్తాయి.
5. పుస్తకాలను చదవటం: మీరు ఖాళీగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా పుస్తకాలను చదవవచ్చు. చదవడం ద్వారా ఒత్తిడి తగ్గి విశ్రాంతిగా ఫీల్ అవుతారు. టెన్షన్ను తగ్గించుకోవచ్చు. మెదడుకు వ్యాయామంగా పనిచేస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. రాత్రిపూట పడుకునే ముందు చదవడం ద్వారా నిద్ర రాని వారికి నిద్ర త్వరగా రావడానికి సహాయపడుతుంది.