Health Tips

Mushroom benefits పుట్టగొడుగుల వల్ల మాంసం కన్నా ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయా?

Mushroom benefits : ప్రపంచంలో మనం తినే ఆహారాలలో మష్రూమ్స్ ఒకటి. మష్రూమ్స్ ను తెలుగులో పుట్టగొడుగులు అని పిలుస్తారు. పుట్టగొడుగుల గురించే మనందరికీ తెలిసినదే వీటిని ప్రపంచ దేశాలలో ఎక్కువగా వాడుతారు. పప్పులు, గింజలు, గుడ్లు, మాంసం వంటి ఆహారాలను మనం ఎప్పుడూ తింటూ ఉంటాము, కానీ మష్రూమ్స్ తినే వారు మాత్రం చాలా తక్కువ ఎందుకంటే వాటి టెస్ట్ వేరేలా ఉంటుంది. అలాగే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలియవు, అందువల్ల వీటిని చాలామంది తినకుండా ఉంటారు.

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటిలో పుట్టగొడుగుల వినియోగం పెరిగిపోతున్నాయి. ఇవన్నీ గడ్డిలో పెరిగే అతి చిన్నగా ఉండి గొడుగుల ఆకారంలో ఉంటాయి. ప్రస్తుతం ఇవి జీవితాలకు సంజీవినిలా మారుతున్నాయి. మష్రూమ్స్ మొక్కల లాంటివి కావు, కుళ్ళిపోయే వాటిలో పెరిగే ఫంగస్ రకానికి చెందినవి. చూడడానికి గొడుగు ఆకారంలో ఉండి తోటల్లో, అడవుల్లో, చెట్ల కాండం మీద, కుళ్ళిపోయిన ఆకులు, గడ్డి లాంటి వాటి మీద పెరుగుతాయి ఈ పుట్టగొడుగులు కూరగాయలుగా పండే మొక్కలు లాంటివి కాకపోవడం వల్ల వీటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడరు.

ఈ మష్రూమ్స్ సూర్యకాంతి అవసరం లేకుండా పెరుగుతాయి, కాని మనకు కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. మష్రూమ్స్ తమకు కావాల్సిన పోషకాలను చనిపోయిన మొక్కలు, లేదా జీవుల నుంచి తీసుకుంటాయి వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. 

మష్రూమ్స్ వల్ల కలిగే లాభాలు:

ప్రపంచంలో క్యాన్సర్ భారీన పడి చాలామంది మరణిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన క్యాన్సర్ను నివారించడానికి పుట్టగొడుగులు బాగా ఉపయోగపడతాయి. పుట్టగొడుగుల్లో ఉండే మైటేకు. క్రిమిని, కొట్టాబెల్ల, ఓయస్టార్, వైట్ బటన్ లాంటి పేర్లు కలిగిన పుట్టగొడుగులు క్యాన్సర్ ను తగ్గిస్తాయి. శరీరంలో కొత్త కణాలు పెరిగేలా చేస్తాయి. అలాగే పుట్టగొడుగులలో ఉండే షుగర్ మాలిక్యూల్ క్యాన్సర్ ఉన్నవారికి తిరిగి ప్రాణం పోస్తుంది. అదేవిధంగా పుట్టగొడుగుల్లో ఉండే లెంటినాన్ అనే పదార్థం మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే బీటా బ్లూ కన్ అనే చక్కెర పదార్థం

మనం ప్రతిరోజు వాడే మష్రూమ్లలో కూడా ఇవి ఉంటాయి. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు పుట్టగొడుగులను ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే చాలా ఫలితం ఉంటుంది. శరీరంలో ఉండే చెడు కులస్త్రాలను తీసివేస్తాయి. లివర్ చెడు కొలెస్ట్రాల్ ను  తొలగిస్తుంది. అందువల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. లివర్ బాగా పనిచేయడానికి పుట్టగొడుగులు ఎంతో ఉపయోగపడతాయి.

బీపీ ఉన్నవారు పుట్టగొడుగులు ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాక మన శరీరంలో కొవ్వు కరిగించే డి విటమిన్ పుట్టగొడుగుల్లో ఉంటుంది. బటన్, క్రిమినస్ అనే పుట్టగొడుగుల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి 12 కూడా ఉంటుంది. మాంసం తినని వారు వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల, మాంసం తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు అన్ని వీటిని తినడం ద్వారా పొందవచ్చు.

మనం తీసుకునే ఆహారం శక్తిగా మారాలంటే బి విటమిన్ అవసరం అందువల్ల పుట్టగొడుగులను కనీసం వారానికి రెండు సార్లు అయినా తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. అంతేకాక పుట్టగొడుగుల్లో  ఎర్గో దియానిస్, గ్లూటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. అవి శరీరంలో ఉండే చెడు కణాలను తీసివేస్తాయి. శరీరంలోనికి బయట నుంచి వచ్చే వైరస్, బ్యాక్టీరియాలను అడ్డుకుంటాయి. అందువల్ల ముసలితనం త్వరగా రాకుండా చేస్తాయి. ఈ విధంగా పనిచేయడం ద్వారా విదేశీయులు పుట్టగొడుగులను డైలీ ఫుడ్ గా తీసుకుంటున్నారు.

ఇవి రేటు ఎక్కువతో కూడుకున్నవి అయినప్పటికీ మన దేశంలో వారానికి ఒకసారి తీసుకుంటున్నారు. ఆరోగ్య నిపుణులు మాత్రం పుట్టగొడుగులను రెగ్యులర్గా తీసుకోవాలని తెలుపుతున్నారు. తాజాగా డిప్రెషన్ లో ఉన్న వారిపై మష్రూమ్స్ అద్భుతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందువల్ల పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.

Bamboo Chicken Making Process:

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button