Paneer Tikka: పనీర్ తో పనీర్ టిక్కా, పనీర్ మసాలా, పనీర్ పిజ్జా తయారీ ఎలాగో తెలుసా?

Paneer Tikka:
పన్నీర్ టిక్కా ఇంట్లోనే చేసుకోవడం చాలా సులభం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
పన్నీర్ టిక్కా చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, ముందుగా ఒక పెద్ద గిన్నెలో గట్టి పెరుగు ఒక కప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు,
రెండు టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ,జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ,రెండు టేబుల్ స్పూన్ నూనె, అరకప్పు శెనగపిండి ,ఒక నిమ్మకాయ, రుచికి తగినంత ఉప్పు, వీటన్నింటినీ బాగా పేస్టులా కలపాలి.

కలిపిన తర్వాత ఒక కప్పు పన్నీర్ ముక్కల్ని దానిలో వేసి బాగా కలపాలి. ఆ మసాలా పన్నీర్ ముక్కలకి అంత కలిసే విధంగా బాగా పట్టించాలి.పట్టించిన తర్వాత 30 నిమిషాల వరకు వదిలేయాలి. వీటిని ఒక పుల్లకు గుచ్చి పన్నీర్ తవపై బాగా కాల్చాలి ఇప్పుడు పన్నీరు టిక్కా రెడీ అయిపోయింది.

Paneer Tikka Masala:

పన్నీర్ టిక్కా మసాలాని ఇంట్లోనే దాబా స్టైల్ లో రుచిగా చేసుకోవచ్చు. దానిని చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా పన్నీర్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక గిన్నెలో పన్నీర్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం రెండు టేబుల్ స్పూన్లు, చిటికెడు పసుపు, నూనె రెండు టేబుల్ స్పూన్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని 30 నిమిషాలు పక్కన పెట్టాలి.

తర్వాత ఒక పాన్ లో పన్నీర్ ఆ మిశ్రమాన్ని వేసి రెండు నుండి మూడు నిమిషాలు వేయించాలి. తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత అందులో ఒక బిర్యాని ఆకు, రెండు యాలుకలు ,ఒక దాల్చిన చెక్క ,మూడు లవంగాలు, జీలకర్ర టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ ,వేసి దోరగా వేయించాలి.

Paneer

తర్వాత ఎండుమిరపకాయల పొడిని కొద్దిగా వేసి వేయించాలి అందులో రెండు ఉల్లిపాయల ముక్కల్ని వేసి అవి దోరగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కారం రెండు టేబుల్ స్పూన్ ,ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ,వేసి వేయించాలి .తర్వాత రెండు పెద్ద టమాటాలా పేస్ట్ ని వేసి కొద్దిసేపు మూత పెట్టాలి బాగా వేగిన తర్వాత అందులో ఒక కప్పు పెరుగు వేసి కొద్దిసేపు మూత పెట్టాలి.

తర్వాత మనం వేయించి పక్కనపెట్టిన పనీర్ ముక్కలు ఆ మిశ్రమంలో వేసి బాగా కలపాలి పది నిమిషాల తర్వాత కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసి పక్కన పెట్టాలి .అంతే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ టిక్కా మసాలా రెడీ అయిపోయింది.

Paneer Tikka Pizza

: పన్నీర్ పిజ్జా ఇంట్లోనే చేసుకుని సులభమైన పద్ధతి. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో అర కప్పు నీటిని తీసుకొని రెండు టేబుల్ స్పూన్ చక్కర ను వేయాలి. రెండింటిని బాగా కలపాలి. అందులో 1/4 టేబుల్ స్పూన్ ఈస్ట్ ను కలపండి. వీటన్నింటినీ బాగా కలపాలి. దీనిని మూడు నిమిషాలు పక్కన పెట్టాలి.

ఇప్పుడు ఇందులో మైదా రెండు కప్పులు ,పాలపొడి రెండు టేబుల్ స్పూన్లు, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూను ,ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేయాలి. వీటన్నింటినీ కలిపి పిండి ముద్దలా చేయండి. ఆ పిండిని చేతితో కొద్దిగా నీళ్లు వేసి బాగా మర్దన చేయాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండిని బాగా కలిపి ఆ పిండిని 24 గంటల వరకు ఫ్రిజ్లో ఉంచాలి.

https://telugu.thefinexpress.com/health/wp-content/uploads/sites/12/2022/10/Paneer-Tikka.mp4

రోజు ఆ పిండిని తీసి రెండు ఉండలుగా చేసుకోండి. దీనిపై పొడి పిండి చల్లండి. ఒక పాన్ పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ ,టేబుల్ స్పూన్ వెన్న వేసి సన్నని మంటపై వేడి చేయండి. ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ కారం ,ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, రుచికి తగినంత ఉప్పు, మైదా ఒక టేబుల్ స్పూన్, కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్, వీటిని కలిపి పక్కన పెట్టండి. పైన ఉన్న నూనెలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టిన మిశ్రమాన్ని అందులో వేయాలి. వీటిని బాగా కలుపుతూ దాయించాలి.200 ml టమాటో ప్యూరీని వేయాలి. బాగా ఉడక పెట్టాలి. ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి కొద్దిగా నీళ్లు ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసి ఐదు నిమిషాలు పాటు బాగా ఉడకనివ్వండి.

ఇప్పుడు పనీర్ ముక్కలను పాన్ పై కొద్దిగా నూనె వేసి వేయించి అందులో కొద్దిగా పసుపు, గరం మసాలా ,కసూరి మేతి ,కారం వేసి వేయించాలి. తర్వాత పక్కన పెట్టిన పిండిని చేతితోనే ఒత్తుకోవాలి ఇప్పుడు దీనిపై మనం రెడీ చేసుకుని పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని సమానంగా పంచాలి. తర్వాత దానిపై కొద్దీ చీజ్, పనీర్ ను ,క్యాప్సికం ,ను వేయాలి .తర్వాత పిజ్జా ను ఒవేన్ లో 250 డిగ్రీల వద్ద 13 నిమిషాల వరకు ఉంచాలి. ఎంతో రుచికరమైన పనీర్ పిజ్జాను ఇంట్లోనే రెడీ చేసుకోండి.

Exit mobile version