Smooth Chapati recipe: రుచికరమైన, మృదువైన చపాతి చేయడం మీకు వచ్చా?

Smooth Chapati recipe:ఏ వంటకమైనా మనం చేసే విధానాన్ని బట్టి రుచిగా తయారవుతాయి.మరియు చేసే విధానంలో కొన్ని చిట్కాలు అనుసరిస్తే ఆ వంటకం రుచిగా తయారవుతుంది.చపాతీ చేయడం సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే.మనం చేసే చపాతి చాలా స్మూత్ గా రుచిగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు చిట్కాలు పాటించాలి.

చపాతీ రుచిగా మెత్తగా రావాలంటే మనం కలిపే పిండి పై ఆధారపడి ఉంటుంది.ఆ పిండిని ఎలా కలపాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా నాణ్యమైన గోధుమపిండిని ఎంచుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నెలో రెండు బాగా మాగిన అరటిపండ్ల ను వేసి అందులో గోధుమ పిండిని వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు,కొన్ని పాలు,ఒక టీ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి.కలిపిన తర్వాత కొద్దికొద్దిగా నీరు వేస్తూ పిండిని బాగా కలపాలి.ఎప్పుడైనా సరే గోధుమ పిండి లో నీళ్లు ఒకేసారి వేయకూడదు.కొద్దికొద్దిగా వేస్తూ కలిపితే పిండి లోపలి వరకు బాగా నానుతుంది.

నీళ్లు వేసి కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టాలి.15 నిమిషాల తర్వాత కొద్దిగా నూనె వేసి రెండు చేతులతో బాగా కలపాలి.ఇప్పుడు బాగా కలిపిన గోధుమపిండిని ఉండలుగా చేసుకొని రుద్దుకున్న తర్వాత లేయర్ లేయర్ కి నూనె రాసి దానిపై కొద్దిగా పొడి పిండి చల్లాలి.

Smooth Chapati recipe

ఇలా చల్లితే చపాతీలు పొరలు పొరలుగా వస్తాయి తర్వాత వాటిని మీకు ఇష్టమైన షేపులో మడవండి.ఇప్పుడు తగినంత మంటపై చపాతీలు కాల్చాలి. ఈ విధంగా మీరు పిండి కలిపి చేసిన చపాతీలు మృదువుగా రుచిగా పొరలుగా బాగా పొంగుతాయి.ఈ చిట్కాలు పాటించి మీరు కూడా చపాతీలు స్మూత్ గా చేసేయండి.ఇంకా ప్రశంసలు పొందండి.

Exit mobile version