Snore Problems: గురక ప్రాణ హానికి సంకేతమా

Snore Problems:గురక సమస్య ఉన్నవారు వారికి బాగానే ఉంటుంది కానీ, వారి పక్కన నిద్రపోయే వారికి మాత్రం చాలా అసౌకర్యంగా ఉంటుంది. వారు ఆ గురక శబ్దాన్ని భరించలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు, మానసిక వేదనకు గురవుతుంటారు. శ్వాస తీసుకున్నప్పుడు వచ్చే శబ్దాన్ని గురక అంటారు.

మనం నిద్ర పోయినప్పుడు శ్వాసించే సమయంలో విశ్రాంత దశలో ఉండాల్సిన కణజాలాలు కంపించడం వలన శబ్దం అనేది వస్తాయి. దీనినే గురక అని అంటారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ చిన్న,పెద్ద తేడా లేకుండా నిద్రలో గురక పెడతారు ఈ గురక లలో కొందరు చాలా బిగ్గరగా శబ్దం చేస్తూ గురకపడతారు.ఈ గురక శబ్ద తీవ్రతను బట్టి వారి యొక్క అనారోగ్య సమస్యలు ఉంటాయని వైద్యుల నమ్మకం.

గురక ప్రాణ హానికి సంకేతమా

ఎక్కువ మద్యం సేవించడం,పొగ తాగడం,అలర్జీ సమస్యలు, ఊపిరితిత్తుల్లో సమస్యలు తదితర కారణాలతో గురక రావచ్చు మహిళలతో పోలిస్తే మగవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.గురక రావడానికి గల కారణాలు:

  1. అధిక బరువు ఉండడం.
  2. . విపరీత స్థూలకాయత.
  3. మెడ భాగం,గొంతు కింది భాగంలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం.
  4. నాలుక పరిమాణంలో మార్పు.
  5. నాలుక,గొంతు బాగంలో బలహీనమైన కండరాలు.
  6. దవడ ఎముక పరిమాణంలో,కదలికలో మార్పులు.
  7. అతిగా మద్యం సేవించడం.
  8. విపరీతంగా ధూమపానం చేయడం.

అయితే సాధారణంగా గురక అనేది అందరికి వస్తుంది.కానీ గురకలో కొన్ని తేడాలు వస్తే మాత్రం వారు ప్రమాదంలో ఉన్నట్టే. ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదంలో ఉన్నట్టు సంకేతాలు:1.నిద్రలో దీర్ఘంగా(గట్టిగా)శ్వాస పీల్చడం. 2. రాత్రి వేళ మేలుకొని, పగటి పూట ఎక్కువ నిద్రించడం.3. ఏకాగ్రతలో లోపం.4.నిద్రలో, నిద్ర లేచి సమయానికి నోటిలో తడి ఆరిపోవడం.5.ఉదయం సమయంలో తలనొప్పి నుదుటి కండరాలనొప్పి ఉండడం.

అయితే కొన్ని చిన్నపాటి క్రియలను చేయడం వల్ల గురకను తగ్గించుకోవచ్చు.

Read more: గ్యాస్ట్రిక్ సమస్యను తొలగించే వంటింటి చిట్కాలు

Exit mobile version