Plants

10 benefits of Tulsi: తులసి సర్వరోగ నివారిణి

10 benefits of Tulsi: హిందువులు తులసి మొక్కను పవిత్రంగా ప్రాచీన కాలం నుంచి పూజిస్తారు. తులసి మొక్కని ప్రతిరోజు పూజించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తులసి మొక్క ఇంట్లో ఉండటం వల్ల మంచి జరుగుతుందని భావిస్తారు. తులసి మొక్క ఇంట్లో ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ తులసి మొక్కలో ప్రోటీన్లు ,విటమిన్లు, ఖనిజాలు, ఆహార ఫైబర్ మరియు అనేక సేంద్రియ సమ్మేలారాలకు  ఒక మంచి వనరుగా ఉంది తులసి.

తులసి మొక్క బెనిఫిట్స్:

మనిషి చనిపోయే ముందు హిందూ సాంప్రదాయ ప్రకారం నోటిలో తులసి తీర్థం పోస్తారు. ప్రాణవాయువును తులసి మొక్క 24 గంటలు కుదురుతూ ఉంటుంది. తులసి మొక్క శాస్త్రీయ నామం “ఓసీమమ్ టేన్యూయి ఫ్లోరం”(ocimumtenuiflorum). ఇది’ లామియో సి ‘ కుటుంబానికి చెందినది. సంస్కృతం లో తుల్సి అంటారు. పవిత్ర తులసి ,రామ తులసి, కృష్ణ తులసి ఇలా అనేక పేర్లతో పిలుస్తారు.ఇంటి వైద్యం చిట్కాలలో తులసి ఆకుల రసం అధికంగా వాడుతుంటారు. ఆయుర్వేదంలో కూడా తులసి ఆకుల రసం వాడుతారు.

తులసిలో ఉండే ఫ్లవర్ నా యిడుల్లు లో మొటిమలు, అస్తమా, మంట మరియు శ్వాస సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.ఎంతో పవిత్రంగాను ఈ తులసి మొక్కను పూజిస్తారు. పురాణాల్లో కూడా ఈ తులసి మొక్కకు అధిక ప్రాముఖ్యత ఉంది. తులసిని బృందా అని కూడా పిలుస్తారు. చాలామంది భూమిపై తులసి  మొక్కని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. ప్రముఖ స్థానాన్ని తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సంప్రదాయాలలో కలిగి ఉంది.

Tulasi Benefits in Telugu తులసి సర్వరోగ నివారిణి
Tulsi Benefits in Telugu తులసి సర్వరోగ నివారిణి

తలనొప్పి, పోట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు జలుబు మలేరియా వంటి చాలా రకాల వ్యాధులను నయం చేయడానికి తులసి రసాన్ని ఉపయోగిస్తారు. తులసి ఆకులురసం అనేక ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ తులసి ఆకులు జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కార్తిక శుక్ల ద్వాదశి రోజున తులసి మొక్కకు చెరుకు గడలతో ప్రతి సంవత్సరం పందిరిని అలంకరిస్తారు.

మామిడి తోరణాలు కట్టి తులసి మొక్కను పూలతో అందంగా అలంకరించి పూజ భక్తిశ్రద్ధలతో చేస్తారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అని అంటారు.కొంచెం లేత రంగులో ఉండే దానిని రామ తులసి అని అంటారు. సాధారణంగా కృష్ణ తులసిని పూజకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద ఔషధాల్లో కూడా కృష్ణ తులసి అధికంగా ఉపయోగిస్తారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది కాబట్టి తులసి మొక్కను సర్వరోగ నివారిణిగా పేర్కొంటారు.

తులసి మొక్క లోని పోషక విలువలు (basil)

100 గ్రాముల తులసి మొక్కలు నీరు 92.06 గ్రామ్ లభిస్తుంది. 23 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్ 3.15 గ్రామ్ లభిస్తుంది కొవ్వు 0.64 గ్రా లభిస్తుంది. కార్బోహైడ్రేట్ 2.25g, ఫైబర్ 1.6 గ్రా ఉంటాయి. క్యాల్షియం 177mg, ఇనుము 3.17mg, మెగ్నీషియం 64mg, ఫాస్పరస్ 56mg, సోడియం 4mg, జింక్ 0.81mg, విటమిన్ సి 18.0mg,

Tulsi uses Basil Benefits in telugu:

జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి మరియు నాడులకు టానిక్, లా గాఈ ఆకులను ఔషధం లో ఎక్కువగా ఉపయోగిస్తారు. జ్వరాన్ని తగ్గించడం కోసం ఈ ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు. డెంగు జ్వరం వ్యాప్తి అధికంగా ఉన్నప్పుడు లేదా తులసి ఆకుల్ని తీసుకొని నీటిలో మరిగించుకొని తీసుకోవడం ద్వారా జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. అనేక రకాల ఆయుర్వేద వైద్యంలోనూ దగ్గును నివారించడoకోసం ఈ తులసిని తప్పకుండా ఉపయోగిస్తారు.

ఆస్తమాలో కఫాని తగ్గించడంలో కూడా ఈ తులసి ఆకులను ఉపయోగిస్తారు. గొంతులో గరగర ఉన్నట్లయితే ఈ తులసి ఆకుల మరిగించిన నీటితో పుక్కిలించడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. కడుపులో ఉన్న నులిపురుగులు తగ్గించడం కోసం వీటి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి .మరియు రక్తంలో బ్లడ్ షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది. వీటి ఆకులనునూరి ఫేస్ కి పట్టించుకోవడం వల్ల మచ్చలు తగ్గిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

బరువు తగ్గడం కోసం వీటి ఆకులను మజ్జిగతో కలిపి తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులలో యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి. తులసి ఆకులను తీసుకోవడం ద్వారా చర్మం పై ఉండే ముడతలు తగ్గుతాయి .దీనివల్ల చర్మంపై ఉండే మృతుకనాలనుతోలిగి పోతాయి. చర్మం యవ్వనంగా  మెరుస్తుంది. విటమిన్ సి మరియు జింక్ తులసి ఆకులలో సమృద్ధిగా లభిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల అంటువ్యాధులను దరిచేరనివ్వదు. తులసి మొక్కలు ఘాటైన వాసనకలిగి ఉండటం వల్ల ఈగలు, దోమలు, పాములు ,రాకుండా కాపాడుతుంది.

తులసి ఆకులను ఒంటరిగా తుంచకూడదు మూడు ఆకుల దళంతో కలిపి ఉంచాలి. అమావాస్య పున్నమి తిధులలో తులసి ఆకులను తుంచకూడదు. స్నానం చేయకుండా మరియు చెప్పులు వేసుకుని తులసి మొక్కను పట్టుకోకూడదు. తులసి మొక్కనే కాకుండా ఆకులు, కొమ్మలు, గింజలు ,అన్నింటినీ వైద్యరంగంలో ఉపయోగపడుతుంది. తులసి ఆకుల రసాన్ని తీసుకోవడం ద్వారా జ్వరం, వాంతులు ,విరోచనాలు, అతిసార, రక్తస్రావం, తదితర వ్యాధులను ను oచి ఉపశమనం కలుగుతుంది.

తులసి మొక్క పక్కన కొన్ని రకాల మొక్కలు అస్సలు నాటకూడదు దీనివల్ల తులసి మొక్క శక్తి క్షీణిస్తుంది ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరగడానికి కారణం అవుతుంది తులసి మొక్క చుట్టూ ఏ ఏ మొక్కలను పెంచకూడదో  తెలుసుకుందాము. కాక్టస్ మొక్కను తులసి మొక్కతో పాటు కలిపి ఎప్పుడూ నాటకూడదు. ఎందుకంటే కక్టస్ మొక్కకు ముళ్ళు ఉంటాయి .దీనివల్ల రాహు- కేతువులకు చిహ్నంగా ఉంటుంది .ఈ మొక్క ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి కలుగుతుంది .ఫలితంగా తులసి మొక్క క్రమంగా క్షీణిస్తుంది.

ఇలా జరగడం వల్ల ఇంటికి మంచిది కాదు. తులసి మొక్కతోపాటు కాక్టస్ మొక్కను ఉంచుకపోవడానికి కారణం రాహు -కేతు దిశను నైరుతిగా మారుస్తుంది. తులసి మొక్కను ఈశాన్యంలో పెట్టుతారు. కాబట్టి రెండు మొక్కలు ఎప్పుడు పక్క పక్కన  నా టకూడదు. జిల్లేడు మొక్కను కూడా తులసి మొక్కతో పాటు కలిపి నాడ కూడదు. చాలామంది ఒకే కుండీలో రెండు ముక్కలు నాటుతుంటారు. కానీ అలా చేయకూడదు. దీనివల్ల తులసి మొక్క క్రమంగా క్షమిస్తుంది. జిల్లేడు నుంచి పాలు కారుతుంటాయి. కాబట్టి ఆ పాలు తులసి మొక్కపై పడతాయి. దీనివల్ల తులసి మొక్క పాడైపోతుంది.

అందువల్ల ఈ రెండు మొక్కలను కలిపి ఎప్పుడూ నాటకూడదు. గుప్పెడు తులసి ఆకులను తీసుకొని మరిగించిన నీటిలో వేసి కషాయం తయారు చేసుకోవాలి దీనికి చిటికెడు సైంధవ లవణం కలిపి తీసుకోవడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, జిగట విరోచనాలు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. చర్మవ్యాధులలో కూడా ఈ తులసి ఆకుల రసాన్ని తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. తులసి గింజల పొడిని పాలలో కలిపి పిల్లలకు  త్రాగించడం ద్వారా కడుపు ఉబ్బరం పొట్టనొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది మరియు జీర్ణక్రియ చక్కగా పనిచేస్తుంది.

తులసి ఆకులను ప్రతిరోజు నీళ్ళు కలిపి తీసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. తులసి ఆకుల తైలాన్ని ముఖం మీద అప్లై చేసుకుని 20ని మిషా చాలుతర్వాత ముఖం వాష్ చేసుకుంటే ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు మరియు ముఖం కాంతివంతంగా ప్రకాశిస్తుంది.

tulsi leaves side effects సైడ్ ఎఫెక్ట్స్:

గర్భిణీ స్త్రీలు అధిక పరిమాణంలో తులసిని తీసుకోకూడదు దీనివల్ల తల్లి బిడ్డకి ఇద్దరికీ కూడా దీర్య కాల సమస్యలు కలుగుతాయి గర్భిణీ స్త్రీలలో గర్భాశయ సంకోచాలు ఏర్పడే అవకాశాన్ని కలిగిస్తుంది తులసి కాబట్టి గర్భిణీ స్త్రీలు తులసిని తీసుకోవడానికి ముందు డాక్టర్ను సంప్రదించి వారి సలహా మేరకు తీసుకోవాలి. సంతాన ఉత్పత్తి స్థాయిలను కూడా ఈ తులసి తగ్గిస్తుంది దీనివల్ల గర్భం కోసం ప్రయత్నిస్తున్న స్త్రీలు లేదా పిల్లలకి పాలిస్తున్న బాలింతలు తులసిని ఉపయోగించకూడదు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button